ప్రకాశం

గ్రామాల్ని అభివృద్ధిపథంలో నడిపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దొనకొండ, జూలై 20: దర్శి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వౌలికవసతులు కల్పించి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖమంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. గురువారం మండలంలోని అన్నిగ్రామ పంచాయతీల నుంచి నాయకులను పిలిచి ఆయాగ్రామాల్లో చేయాల్సిన పనులు, చేసిన అభివృద్ధి పనుల గురించి చర్చించారు. అనంతరం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ దర్శి నియోజకవర్గాన్ని పదేళ్ళపాటు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధిపనులు చేయలేదని, టిడిపి ప్రభుత్వ హయాంలో మూడేళ్ళలో వందలాది కోట్ల రూపాయలతో రోడ్లు, వౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రెండేళ్ళలో ప్రతిగ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం 102 సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, ఆ సంక్షేమ పథకాలన్నీ ప్రజలు తెలుసుకొని సద్వినియోగం చేసుకునేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని, అధికారులు కూడా ప్రతి గ్రామంలో పర్యటించి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని కోరారు. దొనకొండ ఇండస్ట్రీయల్ కారిడార్‌గా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని, ఈనెల 18న జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారని, ప్రపంచంలో దొనకొండకు గుర్తింపు వచ్చేలా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రజలు విన్నవించిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ప్రతి పంచాయతీలో ఎలాంటి సమస్యలు వచ్చిన ఆయా అధికారులు వెంటనే పరిష్కరించాలని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అన్నిశాఖల అధికారులు అన్నిగ్రామాల్లో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని, ప్రతిపక్షపార్టీ నాయకులు అభివృద్ధిని అడ్డుకున్నా అధికారులు ముందుండి నడిపించాలని కోరారు. ఈసమావేశానికి నియోజకవర్గ స్పెషల్ అధికారి రవి, దర్శి డివైఎస్పీ విఎస్ రాంబాబు, పొదిలి సిఐ శ్రీనివాసరావు, ఐదుమండలాలకు చెందిన తహశీల్దార్లు, అన్నిశాఖలకు చెందిన అధికారులు, మండలపార్టీ అధ్యక్షులు మోది వెంకటేశ్వర్లు, మాజీ మండలపార్టీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు, 18గ్రామ పంచాయతీల టిడిపి అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.