ప్రకాశం

అక్రమ అరెస్టులకు నిరసనగా వామపక్షాల ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం టౌన్, జూలై 20: పర్చూరు నియోజకవర్గంలోని దేవరపల్లి గ్రామంలో దళితుల భూముల్లో చెరువులు నిర్మించడాన్ని అడ్డుకునేందుకు ఆందోళన చేపట్టిన వామపక్ష నేతలను గురువారం తెల్లవారుజామున అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మార్కాపురం పట్టణంలో సిపిఐ, సిపిఎం, వైఎస్‌ఆర్‌సిపిల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ వైఖరి, పోలీసుల తీరుపై విమర్శలు చేస్తూ నినాదాలు చేశారు. దళితులు సాగు చేసుకుంటున్న భూముల్లో కుంటలు ఏర్పాటు చేస్తే దళితులు ఆ భూమిని కోల్పోయే దుస్థితి ఉందని సిపిఎం డివిజన్ కార్యదర్శి సోమయ్య, సిపిఐ ఏరియా కార్యదర్శి అందె నాసరయ్యలు పేర్కొన్నారు. దళితుల భూములను కొల్లకట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వామపక్షనేతలు చేస్తున్న నిరసన ప్రదర్శనకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకొని నేతలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. ఈకార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి డికెఎం రఫీ, సిపిఐ పట్టణ కార్యదర్శి షేక్ కాశీం, సిపిఎం మండల కార్యదర్శి గుమ్మా బాలనాగయ్య, ఏనుగుల సురేష్‌కుమార్, అడివయ్య, షేక్ నబీరసూల్, షేక్ ననే్నసా, ఏడుకొండలు, సిహెచ్ రామిరెడ్డి, ఐద్వా డివిజన్ కార్యదర్శి కె కళావతి తదితరులు పాల్గొన్నారు.