శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జాబ్ మేళాల ద్వారా యువతకు ఉపాధి కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, జూలై 20: జిల్లాలో జాబ్‌మేళాలు ఎక్కువగా నిర్వహించి వివిధ కంపెనీలను పిలిచి యువతకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు తెలిపారు. గురువారం క్యాంపు కార్యాలయంలో స్కిల్ డెవలప్‌మెంట్, ఎంప్లాయిమెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, ఐటిడిఏ, మైనార్టీ కార్పొరేషన్, డిఆర్‌డిఏ, మెప్మా, వివిధ ఐటిఐల ద్వారా యువతకు స్కిల్ డెవలప్‌మెంట్‌పై శిక్షణా కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ పూర్తి అయిన తరువాత ఆ యువతకు ప్లేస్‌మెంట్ ఇచ్చే బాధ్యత కూడా అధికారులదేనని అన్నారు. దీనికి అనుగుణంగా యువత ఏఏ ట్రేడులలో శిక్షణ పొందారో దానికనుగుణంగా వివిధ కంపెనీలను ఆహ్వానించి జాబ్‌మేళాను నిర్వహించి వారికి ఉపాధి కల్పించేవిధంగా చేపట్టాలన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులలో శిక్షణ ఇవ్వడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐటిఐ కాలేజీలు కూడా ముందుకు వచ్చి వారు యువతకు శిక్షణ ఇవ్వాలన్నారు. స్కిల్ శిక్షణలో, ప్లేస్‌మెంట్‌లో ఇచ్చిన లక్ష్యాలను అధికారులు సాధించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసులు, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు మేనేజర్ లోకనాధ్, డిఆర్‌డిఏ పీడి లావణ్యవేణి, మెప్మా పీడి చిరంజీవి, సెట్నల్ సిఇఓ డాక్టర్ సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.