శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

తహశీల్దార్లు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జూలై 19: మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిర్ధారించిన అక్రమాలకు సంబంధించిన మొత్తాలను రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా రాబట్టేందుకు మండలాల్లో తహశీల్దార్లు సహకరించాల్సి ఉందని డ్వామా విజిలెన్స్ విభాగం జిల్లా అధికారి శ్రీనివాసులురెడ్డి స్పష్టం చేశారు. తొలుత సాధారణ పద్ధతుల్లో రికవరీ చేయలేక వైఫల్యంతోనే ఆర్‌ఆర్ చట్టాన్ని ఉపయోగించి ప్రభుత్వ ధనాన్ని తిరిగి రాబట్టాలని తహశీల్దార్లని కోరామన్నారు. అయితే ఇలా ఆర్‌ఆర్ ద్వారా రికవరీకై చాలా సంవత్సరాల నుంచి తహశీల్దార్లకు నివేదిస్తున్నా ఆ శాఖ ద్వారా సానుకూల స్పందన కనబడటం లేదన్నారు. ఈనేపథ్యంలో సదరు ఉపాధి అక్రమార్కులపై క్రిమినల్ కేసులు బనాయించేందుకు కూడా వెనుకడుగు వేసేది లేదని స్పష్టమైన హెచ్చరిక వినిపించారు. గురువారం ఆత్మకూరు మండలంలో 2016 మే నుంచి ఈ సంవత్సరం మే మాసాంతం వరకు జరిగిన మొత్తం 13 నెలల ఉపాధి హామీ పనులకు సంబంధించిన సామాజిక తనిఖీ బృందాల నివేదికలను ప్రజావేదికలో భాగంగా చర్చించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం అమలులోకి వచ్చాక ఆత్మకూరు మండలంలో ఇప్పటి వరకు ఎనిమిది విడతలుగా సామాజిక తనిఖీలు జరిగినట్లు వివరించారు. అక్రమాలు జరిగినట్లు నిర్ధారించగానే అప్పటి వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని చాలా పర్యాయాలు తొలగించడం జరుగుతుందన్నారు. దీంతో అలా తొలగించబడిన వారి నుంచి గతం తాలుకు అవకతవకల సొమ్మును తిరిగి రాబట్టాలంటే కష్టతరం అవుతుందన్నారు. ఈక్రమంలోనే తొలుత రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా రాబట్టాలని భావిస్తుండగా, సంబంధిత శాఖ నుంచి చేయూత కరవవుతున్న దృష్ట్యా క్రిమినల్ కేసులకైనా సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఆత్మకూరు మండలంలో గడచిన ఎనిమిది విడతల్లో క్షేత్ర సహాయకుల నుంచి 1,31,567 రూపాయలు రికవరీ చేయాల్సి ఉందన్నారు. ఇందుకుగాను కేవలం 26,194 రూపాయలు మాత్రమే రికవరీ చేసినట్లు తెలిపారు. ఇంకా 1,05,373 రూపాయలు వసూలు చేయాల్సి ఉందన్నారు. సాంకేతిక సహాయకుల స్థాయిలో 48,541 రూపాయల వరకు వసూలు కావాల్సి ఉందన్నారు. ఇందుకుగాను 38,983 రూపాయల వరకు వసూలు చేయగా, ఇంకా 9,558 రూపాయలు ఇంకా రావాల్సి ఉందన్నారు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ల నుంచి 3,779 రూపాయలు రికవరీ చేయాల్సి ఉండగా, 1598 రూపాయలు మాత్రమే వసూలు చేసినట్లు తెలిపారు. ఈ ప్రజావేదిక కార్యక్రమంలో ఇంకా ఎస్‌ఆర్‌పి ప్రభాకర్, ఆత్మకూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ నిర్మలాదేవి, ఉపాధి హామీ ఏపిఓలు మురళి, పూర్ణిమ, తదితరులు పాల్గొన్నారు.