శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రెసిడెన్షియల్ కళాశాలల్లో కార్పొరేట్ విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 20: జిల్లాలోని 15 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో కోటి రూపాయల వ్యయంతో కార్పొరేట్ తరహా విద్యను ఆగస్టు 20వ తేదీ నుండి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఇందులో భాగంగా 60 మంది లెక్చరర్లను నియమించనున్నట్లు వెల్లడించారు. గురువారం నగరంలోని గోమతీనగర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, లెక్చరర్లకు 40 రోజులపాటు నారాయణ గ్రూపు సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 15 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 12 సాంఘిక సంక్షేమ శాఖ, 2 గిరిజన సంక్షేమ శాఖ, ఒకటి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాయని తెలిపారు. వీటిలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులున్నారని, వారికి అత్యున్నతస్థాయి విద్యనందించడమే ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలకు గాను 57 మున్సిపాలిటీలలో 2 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని వారికి ఫౌండేషన్ కోర్సును అందించడం ద్వారా మంచి ఫలితాలను రాబట్టడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం మున్సిపల్ పాఠశాలల్లో చదివి 10వ తరగతిలో 10కి 10 మార్కులు వచ్చినవారు 11 మంది కాగా, ఈ సంవత్సరం 49 మందికి 10కి 10 మార్కులు వచ్చాయని వివరించారు. రానున్న సంవత్సరంలో 100 మందికి 10కి 10 మార్కులు తేవడమే లక్ష్యంగా ఉందన్నారు. తీసుకున్న పలు చర్యల ఫలితంగా విద్యార్థులు మున్సిపల్ పాఠశాలల్లో చేరిక విషయంలో 10 నుండి 20 శాతం పెరిగిందని ఇది మంచి పరిణామమని తెలిపారు. రాష్ట్రంలో 7,500 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని, అందులో 3,500 అంగన్‌వాడీ కేంద్రాలను ఫ్రీ స్కూలు అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు. ప్రతి తరగతి గదిలో టివిలను ఏర్పాటు చేసి రైమ్స్‌ను బోధించడం జరుగుతుందని తెలిపారు. పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఎంసెట్ ఫలితాలను పరిశీలిస్తే ప్రభుత్వ కళాశాల నుండి చదివిన ఒకే ఒక విద్యార్థికి 3 వేలు ర్యాంకు వచ్చిందని తెలిపారు. తెలుగు మాతృభాషను మెరుగుపరచడం జరుగుతుందన్నారు. అనంతరం జిల్లా అధికారులు, కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కె శ్రీనివాసులురెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు, మున్సిపల్ కమిషనర్ డిల్లీరావు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.