తూర్పుగోదావరి

రామ్‌నాథ్ కోవింద్ ఎన్నికతో బిజెపి సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, జూలై 20: భారత 14వ రాష్టప్రతిగా రామ్‌నాథ్ కోవింద్ ఘన విజయం సాధించడంతో స్థానిక బిజెపి నాయకులు సంబరాలు చేసుకున్నారు. బిజెపి కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కొట్టువాడ హరిబాబు అధ్యక్షతన ఈ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యదర్శి కర్రి చిట్టిబాబు విజయోత్సవ కేక్ కట్ చేశారు. బాణాసంచా కాల్చి, సంతోషం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఆకేటి శ్రీకృష్ణ, యాండ్ర బుల్లబ్బులు, టేకుమూడి సత్యనారాయణ, సతీష్ నాయుడు, పిల్లి మురళీకృష్ణ, ఖండవిల్లి సుందర్‌సింగ్, సరిపెల్ల వెంకట సత్యనారాయణ, చందన వీరబ్రహ్మం, కోడి త్రినాథ్, శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.