డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 59

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాంట్స్, షర్ట్స్‌తో పనులు సులువు. వాషింగ్, ఐరనింగ్ సులువు మన చీరలకంటే. అందరికి పెద్ద వయసు పిల్లలు ఉన్నారు. కొందరికి పెళ్లిళ్లు కూడా అయ్యాయి. అందులో ఒకరైతే అమెరికా వచ్చి 50 ఏళ్ళు దాటిందట. ఆవిడ చురుకుదనం చూస్తే ఎక్కడా డెబ్భై ఏళ్ళు దాటిన వ్యక్తిలాగానే లేదు. మన దేశంలో 50 ఏళ్ళు దాటంగానే ఆపసోపాలు మొదలుపెడుతున్నారు.
ఇక్కడ వాళ్ళను చూస్తే మాత్రం ఎంతయినా ఆశ్చర్యం కలుగుతుంది. అందరూ ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చినవాళ్ళే మళ్లీ! మరేమయింది వాళ్లకి. అమెరికా రాగానే ఇంత ఎనర్జీ ఎలా వచ్చేస్తోంది? ఇంట్లో, ఉద్యోగాలు, పిల్లలు ఆటపాటల కోసం తిరుగుళ్ళు, మళ్లీ గుళ్ళో పూజలు, ఏ ఒక్కటీ మానడంలేదు.
ఇదీ కాక రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ అంటూ స్పాకి వెడుతూ వుంటారు. మధ్యలో వాలంటీర్ వర్క్, ఎవ్వరికీ పనివాళ్ళు లేరు. ఏదో వారానికి ఒకసారి ఇల్లు శుభ్రం చెయ్యడానికి తప్ప. ఈ సూత్రం మాత్రం ఏమిటో తెలుసుకోవాలి. మనవాళ్ళకి కూడా చెప్పాలి అనుకున్నాను.
మనవైపు కాస్త ఆర్థికంగా బాగుండగానే ఇంటికి ఇద్దరు నౌకర్లు. అక్కడ పని చేస్తున్నావాళ్ళెవరూ, అది మూర్తిగారి ఇంట్లో పెళ్లి అని చేస్తున్నట్లు లేదు. ఎవరికివాళ్లకు వాళ్ల పిల్ల పెళ్లి- అంత శ్రద్ధగా, ఉత్సాహంగా ఉన్నారు. ఎంతో సరదాతో, ముచ్చట్లతో చేస్తున్నారు. వండుతున్నవాళ్ళల్లో ఒకావిడ పీడియాట్రిషన్, మరొకావిడ ఫోర్డ్ మోటార్ కంపెనీలో ఇంజనీర్, మరొకావిడ టీచర్, ఇంకో ఆవిడ ఫ్యామిలీ డాక్టర్. ఎవ్వరూ ఉద్యోగాల్లో, సంపాదనలలో కానీ తక్కువ లేరు. ఆ వంట చేసే పద్ధతిలో మాత్రం మనవాళ్ళు ఏ మాత్రం సాటిరారు.
వాళ్ళందరినీ చూస్తే నాకు ఏదైనా చెయ్యాలనిపించింది. సింక్ దగ్గరికి వెళ్లి ముందుగా చేతులు కడుక్కుని, తుడుచుకుంటూ అన్నాను- చెప్పండి, నన్ను ఏం చేయమన్నారో- నేనే చేస్తాను అన్నాను.
అబ్బే, మీరొద్దండి. ఆ కుర్చీలో కూర్చుని కబుర్లు చెప్పండి. అయిపోతోంది. మీరొచ్చేటప్పటికి పూర్తి చేసేద్దామనుకున్నాం. కానీ కొంచెం వెనకపడ్డాం, అంది ఒకావిడ.
‘‘కాస్త కబుర్లు తగ్గిస్తే మనం ఇంకొంచెం ఫాస్ట్‌గా చేసేవాళ్ళం’’ అంది ఓ పెద్దావిడ.
మొత్తంమీద వాళ్ళంతా వారించినా నేను ఒప్పుకోకపోవడంతో నన్నూ చెయ్యనిచ్చారు.
‘‘ఇదేం బాగాలేదండి! మీరు మగ పెళ్లివారు. పనులు చెయ్యకూడదు’’ అంది సావిత్రి.
‘‘మగ పెళ్లివారిలా ఉండాలంటే పెళ్లి ముందు రోజు వచ్చి మర్నాడు వెళ్లిపోవాలి. వారం ముందు నుంచి వచ్చి కూచోకూడదు’’ అన్నాను నవ్వుతూ.
‘‘్భలేవారు. మీరిలా రాకపోతే మనం కలిసి గడిపే అవకాశం ఎలా వస్తుంది చెప్పండి’’ అంది సావిత్రి.
‘‘నాకు ఇండియానుంచి వచ్చిన వాళ్ళను చూస్తే చాలా ఈర్ష్య అండి’’ అంది ఒకావిడ.
అదేం అన్నట్లుగా చూచాను.
‘‘చూడండి, చక్కగా గంజి పెట్టిన కాటన్ చీర ఎంత చక్కగా కట్టుకున్నారో- ఇక్కడ కాటన్ చీర కట్టుకోవాలంటే రెండు గంటల చాకిరి’’ అంది . నాకెంత ఇష్టమో కాటన్ చీరలు అంటే. ఇండియా వెళ్లినపుడు అన్నీ అవే కట్టుకుంటాను’’ అంది.
నవ్వాను.
‘‘ఏం చీరలో- కొనడం సరదా తప్ప కట్టుకునే సరదా పోయింది. ఎప్పుడూ ఈ వెస్ట్రన్ బట్టలతోనే గడిచిపోతున్నాయి రోజులు అంది మరొక ఆవిడ.అందరూ పక్కున నవ్వారు.
‘‘మిమ్మల్ని చూస్తే వౌళికి అమ్మలా లేరు’’ అంది.
‘‘సరిగ్గా అదేమాట అంది తేజ’’ అన్నది సావిత్రి.
నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ‘‘మీరందరూ పొగుడుతున్నారు కానీ, మీరెవ్వరూ నాకంటే ఒక్కరోజు పెద్దగా లేరు అన్నాను. మాట మార్చితే బాగుండునని అనిపిస్తోంది. అంతకంటే ముందుకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు.
‘‘మీకు ఆ పింక్ రంగు చీర బాగా సూట్ అయింది. మీ కాంప్లెక్సకి ఒక కాంప్లిమెంట్ అయింది అంది ఒకావిడ.
‘‘అవునవును’’ అంగీకరించారు మిగతావారు.
‘‘మీ వౌళి మీ పోలికే!’’ అంది మరొకావిడ.
తల ఎత్తి చూచాను ఆవిడ ఎవరా అని. ఆ మాట అన్నది ఆవిడ ఒక్కరే ఇంతకాలంలో.
‘‘ముఖ్యంగా ఆ కళ్ళల్లో ఎక్స్‌ప్రెషన్స్’’ అంది సావిత్రి.
సంభాషణ నా మీదనుండి బయటకు వెళ్లింది.. అమ్మయ్యా అనుకున్నాను.
‘‘ఎంతయినా తేజాని మెచ్చుకోవలసిందే! చక్కగా మాస్టర్స్ పూర్తి అయ్యేటప్పటికి మొగుడిని చూసుకుంది’’ అంది డాక్టర్స్‌లో ఒకరు.
‘‘నేను మా అమ్మాయికి చెప్తూనే ఉంటాను. కాస్త ఎవరన్నా ఉన్నారేమో చూడవే!’’ అని అంది మరొకావిడ.
‘‘మా అమ్మాయి అయితే మరీ రాక్షసి. పెళ్లి మాట ఎత్తితే చాలు- మామ్, దోజ్ బాయ్స్ ఆర్ సో డంబ్. నేను అలాంటివాళ్ళతో నా జీవితం వేస్ట్ చేసుకోను’’ అంటుంది. ఇంకా ఏం చెప్తాం, వాపోయింది.
నేను మావారితో అంటూనే ఉంటాను. మన పిల్లలకి ఎక్స్‌పోజర్ అంతా మీరు, నేనే. మీరు ఇలాగే వుంటే, వాళ్ళు ఇండియన్ పిల్లల్ని పెళ్లి చేసుకోరు అని. వింటేనా?.. మా ఆయన షోవనిజం- అంతా ఇంతా కాదు.
‘‘మా ఇంట్లో చెప్పకండి. మా ఆయన చదివిన న్యూస్ పేపర్ మడవడు, విప్పిన షూస్ క్లోసెట్‌లో పెట్టరు. కోట్ హాంగ్ చేయడు. ఏం చెప్పమంటారు. పైగా ఏమైనా అంటే అటువైపు చూడకు. రేపొద్దునే్న వేసుకునే షూస్ లోపల పెట్టకపోతేనేం’’ అంటాడు.
‘‘బాబోయ్! అదెంత నయమండి బాబు. మా ఆయన ఒక ఆర్గనైజర్ ఫ్రీక్. కారు తాళాలు హుక్‌కి పెట్టకపోయనా చంపుతాడు.
మాగజైన్ చదువుతూ మధ్యలో లేచి ఏదయినా పని పూర్తిచేసి వచ్చి చదువుదామంటే వచ్చేటప్పటికి ఆ మాగజైన్ అక్కడ ఉండదు. అదేం అంటే- టేబుల్ చిందర వందరగా వుందిట. సింక్‌లో ఒక గినె్న ఉండనివ్వడు. ఒక కప్పు ఉండనివ్వడు. ఎప్పుడూ అన్నీ అద్దంలా సర్ది ఉండాలాంటాడు’’ అంది మరొకావిడ మొగుడి పనులు భరిస్తూ!
‘‘ఊరుకుందురూ! మీరు మరీ కంప్లైన్ చేస్తున్నారు. హాయిగా గినె్నలు కడిగిపెడుతూ, ఇల్లు సర్దుకుంటూ, సుఖపడక’’ అంది మరొకావిడ.
‘‘సుఖమా! మా ఆయనతో రెండు వారాలు ఉండండి. తక్షణమే లాయర్ కోసం చూస్తారు విడాకుల కోసం’’ అంది. అందరూ నవ్వారు.
అక్కడ ఉన్న వారందరూ భర్తలను విమర్శిస్తూనే ఉన్నారు. ఒకరయితే ఇంటి వ్యవహారాలు ఏమంత పట్టించుకోడుట. మరొకడయితే స్టాకు మార్కెట్ తప్ప మరో పనిలేదుట. అందులో ఎంత పోయిందో అని వాపోయింది.
మరొకరు ఇండియన్ ఫుడ్ తప్ప తినడుట. మరొకడు కనిపించిందల్లా కొంటాడుట. చివరకు అందరూ చేరి మొగుళ్ళు ఎవరూ పిల్లల పెళ్లిళ్ళ విషయం ఎవరూ సీరియస్‌గా తీసుకోవడంలేదని తేల్చారు.. మనసారా తిట్టుకున్నారు.
వాళ్ళందరూ ఏదో మాట్లాడాలి కదా అని భర్తలమీద కంప్లైంట్ చేస్తున్నారు కానీ ఎవరు పెద్దగా అన్‌హాపీగా ఉన్నట్లుగా నాకు అనిపించలేదు.
వాళ్ళ సంభాషణ వింటూ లడ్డూలు చెయ్యడం తప్ప అందులో పాల్గొనడానికి నాకు అనుభవాలు లేవు.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి