నేర్చుకుందాం
నేర్చుకుందాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 21 July 2017
ఉ. ఇమ్మనుజేంద్రుఁ డింద్ర దనుజేంద్రులకంటె మహావిలాస సౌ
ఖ్యమ్ములఁబెద్ద యిద్ధరణిఁ గావున నీతని పేర్మికిం దగన్
నెమ్మి నొనర్చెదన్ సభ మణిప్రభ నొప్పఁగ దేవతావిమా
నమ్ములు నిట్టివే యని జనమ్ములు దానిన మెచ్చి చూడఁగన్
భావం: శ్రీకృష్ణుడు చెప్పినదానిని దానవ శిల్పి అయిన మయుడు విన్నాడు.‘ వైభవంలో, భోగానుభవంలో, దేవేంద్ర రాక్షసేంద్రుల కంటె మనుజేంద్రుడైన ధర్మరాజే ఈ ధరమీద మిన్న. ఆయన గొప్పతనానికి తగ్గట్లు, దేవతల మేడలైనా ఇంత బాగుంటాయా అని జనులంతా దానినే మెచ్చి చూచేటట్లు మణుల కాంతితో మెరిసే ఒక మహాసభను మనసార నిర్మంచి ఇస్తాను.’ అని మయుడు శ్రీకృష్ణాదులకు చెప్పాడు.
మహాభారతం లోని పద్యము