మెయిన్ ఫీచర్

కూరగాయల దాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేటీ సాగ్లియానొ సౌత్ కరోలినా (అమెరికా) రాష్ట్రంలోని సమ్మర్ విల్లీ పట్టణంలోని తన ఇంటి పెరటిలో కేబేజీ మొక్క నాటింది. అది పెరిగి పెద్దదై సుమారు పద్ధెనిమిదిన్నర కిలోల పువ్వు పూసింది. దానిని ఇంట్లో ఉపయోగించుకోకుండా ఒక అనాథాశ్రమానికి ఉదారంగా ఇచ్చేసింది. రెండ్రోజుల తర్వాత అదే ఆశ్రమానికి కొంచెం బియ్యం, మాంసం కూడా పట్టుకువెళ్లి ఇంతకుముందు తనిచ్చిన క్యాబేజీతో కలిపి దాదాపు 275 మందికి ఆహారం వండించింది. అలా ఆరంభమైన ఆ సేవానిరతి మరెంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది.

పట్టణం శివార్లలో కొందరు విరాళంగా భూములలో తోటలు పెంచటం ఆరంభించింది. తన స్కూల్ తోటలో కూడా కూరగాయలు పండించేది. అనేకమంది వాలంటీర్లు, తోటల పెంపకందార్లు, తోటి స్కూల్ పిల్లలు ఆమెకు సాయపడ్డారు. ఒక నర్సరీ కంపెనీ ఆమెకు మొక్కలను ఉచితంగా పంపిణీ చేసింది. అప్పటినుంచి స్థానికంగా ఉండే సూప్‌కిచెన్లకు, వంటశాలలకు, అనేక పేద కుటుంబాలకు వేలాది కిలోల స్వ్కాష్, ఒకరా, కేబేజీ తదితర కూరగాయలను ఉచితంగా సరఫరా చేస్తోంది. ఇదే క్రమంలో ఆ ఊర్లోనే ఒక చర్చ్ కిచెన్ మూతబడిపోవడంతో ఆమె నెలవారీ డిన్నర్లు ఏర్పాటుచేయడం మొదలుపెట్టింది. ఆమెతోపాటు ఇతర సహాయధ్యాయులు కూడా ఆమెకు చేదోడు వాదోడుగా నెలకు వందలాదిమందికి ఉచితంగా భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా కేటీ సమకూర్చే నిధులతో అమెరికాలోని 33 రాష్ట్రాల్లో చిన్నపిల్లలు ‘కేటీ క్రాప్స్ గ్రోయర్స్’ పేరిట గ్రూపులుగా ఏర్పడి దాదాపు వంద కూరగాయల తోటలను పెంచుతూ తమ ప్రాంతాల్లోని పేదలకు వేలాది కిలోల కూరగాయలను ఉచితంగా సరఫరా చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా మేరీ ల్యాండ్ రాష్ట్రంలోని అర్బానా పట్టణానికి చెందిన సెసిహార్ట్ఫోర్డ్ (10)ను పేర్కొనవచ్చు. ఈ అమ్మాయి కేటీ క్రాప్స్ నుంచి అందిన 500 డాలర్ల గ్రాంటుతో నాలుగు వందల కిలోలకుపైగా కూరగాయల్ని స్థానిక ఆహార నిధి (్ఫడ్‌బ్యాంక్) సహాయ కార్యక్రమాల మిషన్‌తోపాటు పేద కుటుంబాలకు కూడా అందజేసింది. ఈ కార్యక్రమంలో ఆమెకు మరో 24 మంది చిన్నారులు సహకరించారు. స్కూలు చదువు తర్వాత కాలేజీలో చేరిన తర్వాత కూడా కేటీ ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంది. చుట్టుప్రక్కల కాలేజీల్లో కూడా విద్యార్థులతో కలిసి అనేక రకాల కూరగాయలు పండిస్తూ అనాథాశ్రమాలకు, పేదలకు పంపిణీ చేస్తోంది. ఇటీవలే ‘కేటీస్ కాబేజ్’ అనే పిల్లల పుస్తకాన్ని ప్రచురించింది. దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన కేటీస్ క్రాప్స్ గ్రూపుల పిల్లలకు సమ్మర్ కాంప్ కూడా నిర్వహించింది. ఒక్క కాబేజీతో మొదలైన ఈ బృహత్ విరాళ కార్యక్రమం ఇంతలా పురోగమిస్తుందని నేను ఊహించనేలేదు అని అంటోంది కేటీ!

‘నా జీవితంలో ఇంతకుమించిన ఆనందం నాకెప్పుకూ కలగలేదు’ అని చెబుతుంది కేటీ ఆ సంఘటన తరువాత. ఒక్క కేబేజీతో అంతమందికి ఆహారాన్ని అందించటం తనకే ఆశ్చర్యం కలిగించిందని, అంతకంటే ఎక్కువమంది ఆకలి తీర్చటం పెద్ద కష్టం కాదని ఆనాడే నిర్ణయంచుకున్నాను.’

-జి.కల్యాణి