Others

గొప్ప కారాదు ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ హోస్‌కు,
‘నిత్య ఆలోచనల్లో (తనగురించి) మునిగి తేలేవాడే నిత్య సంతోషి’.
ఇదేదో నిన్ను పొగడటానికి సంధించిన వాక్యాస్త్రం అనుకుంటున్నావు కదూ! కానేకాదు. ఓ రెండ్రోజుల క్రితం జరిగిన ఓ సంఘటన నా మనస్సును నిర్మాణాత్మకంగా తొలచివేసింది. అది నీతో పంచుకుందామనుకుంటున్నాను.
అదేమిటంటే నా స్నేహితుడొకడికి సాహిత్య పురస్కారం వచ్చింది. అతని పుస్తకం చదివాను. నిజంగ చాలా గొప్పగా అనిపించింది. కాని అతను ‘ది గ్రేట్’ అనిపించలేదు. ఈర్ష్యగా అనిపించింది కానీ. ఇప్పుడు నువ్వు అనొచ్చు అతను నీకు పోటీ అవుతాడనో లేక నీ స్నేహితుడు నీకన్నా గొప్పవాడు అయిపోతున్నాడనో భావంవల్ల నీకు అతనిమీద ప్రశంసాభావం కన్నా ఈర్ష్యాభావం కలిగి ఉంటుంది. అదే అతను నీకు అపరిచితుడు అయితే అతనికి కూడా అభిమానివి అయ్యేవాడివి అని.
కానీ అప్పుడు జరిగిన నిత్య ఆలోచన సంఘర్షణే నాకు ‘దిగ్రేట్’ వెనకున్న అసలు రహస్యాన్ని బయటపెట్టింది. ఈర్ష్య, ముందే పరిచయం కలిగి ఉండడం వీటన్నింటికీ అతీతమైనదే నిజమైన ‘ది గ్రేట్’ వ్యక్తి లక్షణం. అంటే దీన్ని బట్టి నాకు అర్ధం అయింది ఏమిటంటే సమాజంలో గుర్తింపు పొందినవారు, పేపర్లలో ఫోటోలు పడినవారు, ఏదో రకంగా అందరి నోళ్లల్లో నానేవారు అందరూ ‘దిగ్రేట్’ కాదు.
‘ది గ్రేట్’ అనే కిరీటం కోసం ప్రత్యేకంగా పాటుపడేవారు ఓ కోవ. అంటే వీరు అనుక్షణం దీనికోసం తమ వ్యక్తిత్వానికి వేరే ముసుగు వేసి ఎదుటివారిచేత ఆ ముసుగును ‘దిగ్రేట్’గా గుర్తించేలా చేస్తారు. ఈ కోవకు చెందినవాడే నా స్నేహితుడు.
అతనితో కలిసి నాలుగేళ్లు చదివిన తర్వాత అతని ఆలోచనా విధానం, ద్వంద్వ ప్రవృత్తి రెండు నాకు తెలుసు. ఎప్పుడైతే అతని పుస్తకాన్ని చదివానో అది గొప్ప ఆలోచనలతో నిండినా అవి అతని ఆచరణ పరిధిలో లేవని అన్పించేసరికి ‘దిగ్రేట్’ అని అన్పించలేదు అతను నాకు. అది గుర్తింపే తప్ప మనస్సులో ముద్ర వేయదు. దీనిని బట్టి నాకు అర్ధం అయింది ఏమిటంటే మనది కాని వ్యక్తిత్వంతో ఎదుటివారిని ఆకర్షించవచ్చు. కానీ అది ‘దూరపు కొండలు నునుపు’ చందం అవుతుంది. అంటే అదే వ్యక్తితో నాలుగురోజులు గడిపితే గౌరవం తగ్గిపోతుంది.
నిజమైన ‘ది గ్రేట్’ అంటే అలాంటి వ్యక్తికి వున్న అభిమాన గుణం అతనిలో ఉన్నప్పుడు అతన్ని వ్యక్తిగా కాక ఉన్నత ఆలోచనా రూపంగా, కార్యదీక్ష ప్రతిరూపంగా చూడగలిగాం. అతనితో గడిపిన ప్రతిక్షణం అతని మీద గౌరవాన్ని వెయ్యిరెట్లు అధికం చేయాలి. అంతేకాకుండా ఆ అభిమాన గణం అతన్ని అభిమానించడం కన్నా ఏ అనుభవాలు, ఏ రకమైన తర్కం, ఏ రకమైన ఆలోచనా విధానం అతన్ని అలా ‘దిగ్రేట్’ శిఖరాల వైపు తీసుకెళ్లిందో ఆలోచించగల లేటరల్ థింకింగ్‌కు పునాది వెయ్యగలగాలి. వారు వాటినే కాలక్రమేణా అభిమానించగలగాలి.
గొప్పవాడు ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకుంటాడు. ‘దిగ్రేట్’ చె ప్పకుండానే తన ఆలోచనల ఆచరణ ద్వారా తన చుట్టూ ఉన్నవారునేర్చుకుని తమకే ఒక ‘దిగ్రేట్’ శిఖరాన్ని నిర్మించుకునేలా చేస్తాడు. ఇదే నిజమైన అభిమాని, నిజమైన ‘దిగ్రేట్’ మధ్య ఉండాల్సిన సంబంధం.
చివరికి ‘జాడ్యం’ నుండి తర్కం, నిర్మాణాత్మకత వైపు నా అభిమానాన్ని పయనింపచేసిన ‘ది గ్రేట్ సంస్కర్త’కు...

-శృంగవరపు రచన