Others

జింక్ లోపిస్తే అలసట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషికి జింక్ ఎంతో అవసరం. గర్భిణిగా ఉన్నప్పటి నుంచే జింక్ ధాతువును అందిస్తారు. ప్రతిఒక్కరూ రోజుకు కనీసం 15 మిల్లీ గ్రాముల జింక్ అవసరం. ఆహారపదార్థాల ద్వారానే అవసరమైన జింక్‌ను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. టాబ్లెట్స్ రూపంలో తీసుకునే బదులు జింక్ ఎక్కువగా ఉండే పళ్ళు, పప్పు దినుసులు, ఆకు కూరలు, పాలు, క్యాబేజీ, బంగాళాదుంప, బీట్‌రూట్, వేరుశనగలు ప్రతిరోజూ ఆహారంలో తీసుకుంటే చాలు. జింక్ లోపం వల్ల మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయదు. పిల్లల్లో ఎదుగుదల లోపిస్తోంది. పిల్లల్లోకానీ, పెద్దలలో కానీ జింక్ లోపం ఏర్పడితే చర్మం మృధుత్వాన్ని కోల్పోయి బిరుసవుతుంది. ఆకలి తగ్గిపోయి, ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. దీనివల్ల వారికి నీరసం, పనిచేస్తుంటే అలసట ఏర్పడతాయి. గర్భిణీలకు, పాలిచ్చే బాలింతలకు మిగిలినవారి కంటే కొంతశాతం జింక్ అవసరం ఎక్కువ. కండరాలకు, కాలేయానికి, కంటి చూపునకు తోడ్పడే జింక్ అవసరం ఎంతైనా ఉంది.