కడప

నేడు ముఖ్యమంత్రి రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 21: ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు శనివారం ఉద యం విజయవాడ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 9.55 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుని విమానాశ్రయంలో జిల్లా అధికారులు, టిడిపి నేతలతో జిల్లా పరిస్థితి గురించి చర్చించనున్నారు. అనంతరం ఆయన 10గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో పర్యటించి అక్కడే బసచేస్తారు. మరుసటి రోజు ఆదివారం ఉదయం 9.10గంటలకు నంద్యాల నుంచి కడప విమానాశ్రయం చేరుకుని కొంతసేపు అధికారులు, నేతలతో చర్చించిన అనంతరం ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు. ఈ మేరకు కలెక్టర్ టి.బాబూరావునాయుడు, ఎస్పీ అట్టాడ బాబూజి ఎయిర్‌పోర్టులో భారీ బందోబస్తు, ఏర్పాట్లు చేస్తూ శనివారం కార్యక్రమానికి రూపొందిస్తున్నారు.