కడప

ముందుకుసాగని ప్రాజెక్టుల నిర్మాణాలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 21: జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణాలకోసం ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు వారం వారం రివ్యూ చేస్తున్నా భూ సేకరణ జాప్యంతో ప్రాజెక్టుల నిర్మాణాలు ముందుకుసాగక వాటి అంచనాల వ్యయం కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో నిర్మాణంలో వున్న గాలేరు-నగరి, సుజల స్రవంతి, వామికొండ జలాశయం, పులివెందుల బ్రాంచికాలువ, గండికోట ఎత్తిపోతల పథకం, తెలుగుగంగ 2, తెలుగుగంగ 3, లింగాల కుడికాలువ, జికెఎల్‌ఐ జిఎన్‌ఎస్‌ఎస్ ప్యాకేజి 1, ప్యాకేజి 2 తదితర ప్రాజెక్టులకు భూసేకరణలో అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రెండు దశాబ్దాలకాలంగా ప్రాజెక్టుల నిర్మాణాలు ఆలస్యమయ్యాయి. ప్రాజెక్టుల నిర్మాణాల్లో అధికారులు తమకు ఆదాయం ఉన్న వాటికి మాత్రమే పనులకు ఆరంభం సూరత్వం చేయడం తప్ప అంకితభావం కొరవడి ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోవడంతో జాప్యం జరుగుతోంది. ప్రాజెక్టుల నిర్మాణాలకోసం భూసేకరణకు సంబంధిత ఆర్డీవోలు ప్రత్యేకించి ప్రత్యేక కలెక్టర్ నలుగురైదుగురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు నియామకం చేసినా సంబంధిత అధికారులు అటవీశాఖ, పర్యావరణశాఖ అనుమతులు తీసుకోవడంలో నిర్లక్ష్యం, జాప్యం కారణంగా అటవీ అనుమతులు రాలేక భూసేకరణ కొన్నింటికి పూర్తిగాక అటవీశాఖ అనుమతులు వచ్చినా భూసేకరణ చేయలేక అధికారులు నిర్లక్ష్యధోరణిలో వ్యవహరిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. జిల్లాలో నిర్మాణంలో వున్న ప్రాజెక్టులకు ఇప్పటివరకు 42 ప్యాకేజిల్లో పనులు జరుగుతున్నా వాటికి రూ.4450 కోట్లు ఖర్చుచేయడం జరిగింది. ఇంకా రూ.1,400కోట్లు ఖర్చుచేయాల్సివుంది. వీటన్నింటికీ 58వేల ఎకరాలు భూసేకరణ చేయాల్సివుండగా ఇప్పటివరకు 50వేల ఎకరాల భూములు మాత్రమే సేకరించారు. ఇంకా 8వేల ఎకరాలు సేకరించాల్సివుంది. కాగా 42 ప్యాకేజిలకు 26 ప్యాకేజి పనులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి. గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం, వామికొండ రిజర్వాయర్ ప్రాజెక్టులకు భూసేకరణ చట్టమే ఆయకట్టుకాలువలు నిర్మిస్తున్నారు. వాస్తవంగా కాలువల నిర్మాణాలు, పైపులైన్ల తవ్వకాలు, పంపుల ఏర్పాట్లు, చిన్నపాటి మోరీలు నిర్మించాలంటే భూసేకరణ పూర్తయి మిగిలిన పూర్తయితే తప్ప ప్రాజెక్టులు నిర్మించినా ఎటువంటి ప్రయోజనం లేదనేది జగమెరిగిన సత్యం. గాలేరు-నగరి, సుజల స్రవంతి పథకానికి 1500 ఎకరాలు, వామికొండకు 600 ఎకరాలు పైబడి, జిఎన్‌ఎస్‌ఎస్‌కు 5వేల ఎకరాలు పైబడి, ప్యాకేజి 2, ప్యాకేజి 4, ప్యాకేజి 5, ప్యాకేజి 6కు వెయ్యి ఎకరాలు పైబడి సేకరించాల్సివుంది. పులివెందుల బ్రాంచ్‌కెనాల్, గండికోట ఎత్తిపోతల పథకం, తెలుగుగంగ, లింగాల కుడికాలువ, సిబిఆర్‌లకు దాదాపు మరో 2వేల ఎకరాలు సేకరించాల్సివుంది. అయితే అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం, రెవెన్యు, అటవీశాఖ, జలవనరులశాఖ సమన్వయలోపంతో భూసేకరణ జరగని కారణంగా ప్రాజెక్టుల నిర్మాణాలు ముందుకుసాగడం లేదు. దీనికారణంగా ప్రాజెక్టుల నిర్మాణం జాప్యం జరిగేది కొద్దీ ప్రభుత్వంపై ఆదాయభారం పడి కోట్లాదిరూపాయలు గండిపడుతోంది. ఇప్పటికైనా నిద్రమత్తు, అవినీతి మత్తులో ఉన్న అధికారులు నిద్రమేలుకుని సకాలంలో భూసేకరణ పూర్తిచేసి ప్రాజెక్టుల నిర్మాణాలను వెంటనే పూర్తిచేసి జిల్లాలో తాగునీరు, సాగునీటి సమస్య తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.