కడప

మానవాళి మనుగడకు మొక్కలు నాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపవరం,జూలై 21: మానవాళి మనుగడకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎంపిపి శిరీష ,రూరల్ ఎస్‌ఐ హేమాద్రి తెలిపారు. మండలంలోని కాలువపల్లె జెడ్పి హైస్కూల్‌లో గోపవరం ఎస్‌ఐ హేమాద్రి ఆధ్వర్యంలో శుక్రవారం వనం-మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మొక్కలు నాటడంతోపాటు హైస్కూల్‌లో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల స్వచ్చమైన గాలి, ప్రాణవాయువు లభిస్తుందన్నారు. వృక్షాలు ఉన్నచోట వర్షాలు కురుస్తాయని ప్రతి ఒక్కరు మొక్కలు నా టి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సకాలంలో వర్షాలు లేకపోతే పర్యావరణం కుంటుపడుతుందన్నారు. మానవాళి మనుగడకు పచ్చదనం పెంపొందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ బాల ఓబయ్య, జెడ్పి హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వీర విజయలక్ష్మి, స్కూల్ కమిటీ చైర్మన్ రామసుబ్బారెడ్డి, అటవీశాఖ, ఉపాధి సిబ్బంది, పోలీసు సిబ్బంది , విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.