అనంతపురం

చంద్రబాబు, కరవు కవల పిల్లలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, జూలై 21 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కరవు కవల పిల్లలు అని పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం పట్టణంలోని జాతీయ రహదారిపై అంబేద్కర్ సర్కిల్‌లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ బాబు ఎక్కడ ఉంటే కరవు అక్కడ కరాళ నృత్యం చేస్తుందన్నారు. రాష్ట్రంలో కరవుతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. అయితే ముఖ్యమంత్రి నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో రూ.8600 కోట్ల ఇన్‌ఫుట్ సబ్సిడీ, పంటల బీమా ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే తూతూమంత్రంగా విడుదల చేశారన్నారు. దీంతో రైతు కృతజ్ఞతసభలు నిర్వహించుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్నివిధాలా ఆదుకున్నట్లు గుర్తు చేశారు. టిడిపి పాలనలో కార్యకర్తలకు మాత్రమే పెద్ద ఎత్తున పంట నష్టపరిహారం అందజేస్తున్నారన్నారు. రొద్దం మండలం బూచెర్లలో ఒకటిన్నర ఎకరాల భూమి కలిగిన టిడిపి వ్యక్తికి రూ.32 వేల నష్టపరిహారం అందించారన్నారు. చంద్రబాబు లక్షల కోట్లు దోపిడి చేయగా ఇన్‌పుట్ సబ్సిడీ, ఎన్టీఆర్ గృహ పథకాల వంటి వాటిలో నాయకులు, కార్యకర్తలు వేలాది రూపాయలు దండుకుంటున్నారన్నారు. గతేడాది రక్షక తడుల పేర రూ.వేల కోట్లు దండుకున్నారన్నారు. రక్షక తడుల వల్ల ఒరిగింది శూన్యమని, గతంలో టిడిపి నాయకులే బహిరంగ ప్రకటన చేశారన్నారు. ఈ ఏడాది కూడా రక్షక తడులను చేస్తామని ప్రకటించడం శోచనీయమన్నారు. గ్రామాల్లో తాగడానికి నీరు లేక ప్రజలు తల్లడిల్లుతుంటే రక్షక తడులకు నీటిని ఎక్కడి నుండి తీసుకు వస్తారో సమాధానం చెప్పాలన్నారు. ధర్నాకు ముందు కాంగ్రెస్ నాయకులు పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ రామ్మూర్తికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, డిసిసి అధ్యక్షులు కోటా సత్యం, నాయకులు కెటి శ్రీ్ధర్, చిన్న వెంకట్రాముడు, బాలాజీమనోహర్, రమణ, నారాయణరెడ్డి, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.