అనంతపురం

శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, జూలై 21 : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ జివిపి అశోక్‌కుమార్ తెలిపారు. ప్రజలందరూ ప్రశాంత జీవనం సాగించేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. శుక్రవారం రాత్రి స్థానిక టూటౌన్ పోలీసుస్టేషన్ ఆవరణలో పెనుకొండ డివిజన్ నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీసుస్టేషన్‌ల వారీగా ఇప్పటి వరకు నమోదుపై కేసులు, పరిష్కారం తదితర విషయాల గురించి సిఐలు, ఎస్సైలతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ఏ చిన్నపాటి ఘటన కూడా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రశాంత ప్రజాజీవనానికి ఎవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల పెరిగిపోతుండటంతో వాటిని నియంత్రించేందుకు స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా 16 ఏళ్లలోపు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వరాదన్నారు. అదే విధంగా వాహనాలు నడిపే వ్యక్తులు విధిగా లైసెన్సులు, వాహన రికార్డులు కలిగి ఉండాలన్నారు. దీనికితోడు మద్యం తాగి, లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే దీనిపై జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థను పటిష్ట పరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ట్రాక్టర్ ప్రమాదాలు చోటు చేసుకుని అనేక మంది ఆసుపత్రుల పాలవుతున్నారని, దీంతో స్టిక్టర్లు లేకుండా ట్రాక్టర్లు నడిపితే అపరాధ రుసుం విధిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. దీనికి తోడు మట్కా, పేకాట తదితర జూద కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సమూలంగా బెల్ట్‌షాపులను నిర్మూలించేందుకు ఆదేశాలు జారీ చేసిందని, ఎక్కడైనా బెల్ట్ షాపులు ఉంటే వెంటనే వాటిని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డిఎస్పీ కరీముల్లా షరీఫ్, డివిజన్ పరిధిలోని వివిధ స్టేషన్‌లకు చెందిన సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.