విజయనగరం

ఉపాధి హామీలో సవాళ్లను అధిగమిస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 21: ఉపాధి హామీ పథకంలో సవాళ్లను అధిగమిస్తామని జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి అన్నారు. శుక్రవారం సాయంత్రం జెడ్పీ సమావేశ మందిరంలో ఆమె ఎంపిడిఒలు, డ్వామా సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పథకంలో ఎదురవుతున్న సమస్యలు, వాటిని అధిగమించడానికి పరిష్కారమార్గాలపై చర్చించారు. జిల్లాలో వ్యవసాయ పనులకు ఎన్‌ఆర్‌ఇజిఎస్ కూలీలను నియమిస్తే బాగుంటుందని గ్రామాల్లో రైతులు కోరుతున్నారని డ్వామా పిడి రామచంద్రరావు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రైతులకు కూలీల ఖర్చును ఉపాధి హామీ కింద ప్రభుత్వం భరించేందుకు ముందుకు వచ్చిందని ఆయన గుర్తు చేశారు. అలాగే ఉపాధి హామీ కూలీలకు ఎంత మొత్తం కూలీ వచ్చిందనే విషయం వారి సెల్‌ఫోన్లకు మెసేజ్‌ల రూపంలో పంపించేందుకు కసరత్తు జరుగుతుందన్నారు. డ్వామా పిడి రామచంద్రరావు మాట్లాడుతూ ప్రతి మండలంలో రెండు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. ఆ గ్రామంలో ఉపాధి హామీ కింద చేపట్టిన మొత్తం పనుల వివరాలు కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. ఎన్‌టిఆర్ గృహనిర్మాణంలో ఉపాధి కూలీలకు 90 రోజుల వేతనం అందజేసే సదుపాయం ఉన్నందున ఉపాధి కూలీలకు 150 రోజులు పని కల్పిస్తే బాగుంటుందని చీపురుపల్లి ఎంపిడిఒ అన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఒక శ్మశాన వాటికను నిర్మించాలన్న యోచనలో ఉన్నట్టు డ్వామా పిడి రామచంద్రరావు తెలిపారు. జిల్లాలో అంగన్‌వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్నామని, అదే పద్ధతిలో పాఠశాలలకు అదనపు తరగతి గదులు నిర్మించడానికి వీలుగా ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే సదస్సులో ప్రస్తావించనున్నట్టు జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి తెలిపారు.