విజయనగరం

బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 21: డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని జిల్లా ఎస్పీ పాలరాజు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనగరానికి చెందిన ఓ ఆసామి రాజీవ్ క్రీడా ప్రాంగణం పక్కన ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ పాలరాజు డిఎస్పీని ఆదేశించారు. కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలో దొంగతనం జరగ్గా కొత్తవలస పోలీసులు కేసు నమోదు చేయలేదని ఎస్పీకి తెలిపారు. దీనిపై ఎస్పీ మాట్లాడుతూ కేసు విచారణ దశలో ఉందన్నారు. గజపతినగరం పోలీసు స్టేషన్ పరిధిలో అక్రమ మైనింగ్ జరుగుతుందని, ట్రాక్టర్లతో మైనింగ్‌ను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని గజపతినగరం సిఐని ఎస్పీ ఆదేశించారు. పార్వతీపురానికి చెందిన ఓ ఆసామి తన దుకాణంలో సామాన్లు దగ్ధమయ్యాయని గతంలో పోలీసు స్టేషన్‌కు వెళ్లగా ఫిర్యాదు తీసుకోలేదని డయల్ యువర్ ఎస్పీలో ఫిర్యాదు చేసిన తరువాత ఫిర్యాదు తీసుకున్నారని ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.