విజయనగరం

చెత్త రహితం కానున్న పది పంచాయతీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 21: జిల్లాలో ప్రయోగాత్మకంగా పది పంచాయతీలను జీరో వేస్ట్ పంచాయతీలుగా తీర్చిదిద్దనున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ వచ్చేనెల 15వతేదీన స్వచ్చ గ్రామాలుగా వీటిని ప్రకటిస్తామన్నారు. వాటిలో చీపురుపల్లి మండలంలో కర్లాం, సీతానగరంలో పెదబోగిల, రామభద్రాపురంలో ఆరికతోట, నెల్లిమర్లలో దన్నానపేట, విజయనగరంలో ద్వారపూడి, మక్కువలో ఎం.వెంకంపేట, గజపతినగరం, జియ్యమ్మవలస, కురుపాం ఉన్నాయన్నారు. ఈ గ్రామాల్లో శతశాతం సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో 879 గ్రామ పంచాయతీలను ప్రిస్ యాప్‌లో ఆన్‌లైన్ చేశామన్నారు. ఇంకా 42 గ్రామ పంచాయతీల వివరాలను ఆన్‌లైన్ చేయాల్సి ఉందన్నారు. ఈ యాప్‌లోనే జిల్లాలోని 34 మండలాలకు చెందిన ఇంటి కొలతలు, ఇంటి పన్ను వివరాలు నమోదు చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం ఎన్యూమరేటర్‌కు ఒక ఇంటికి రూ.8 ఖర్చు చేస్తున్నామని చెప్పారు. వచ్చేనెల 15వతేదీలోగా ఈ వివరాలన్నీ కంప్యూటరీకరణ అవుతాయన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రస్తావించగా ప్రస్తుతం అన్ని పంచాయతీల్లో బ్లీచింగ్, ఫినాయిల్ అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ఉపాధి హామీ కూలీలతో గ్రామాల్లో ప్రతి మంగళవారం ఒక అర్థగంట సేపు శ్రమదానం చేస్తున్నారని తెలిపారు. ప్రజల్లో ఒక సామాజిక ఉద్యమ స్ఫూర్తి తీసుకురావడానికి అన్ని విధాల కృషి చేస్తున్నామన్నారు. ఇది విజయవంతమైతే జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్యం మెరుగుపరచడం సులభతరం అవుతుందన్నారు.