శ్రీకాకుళం

బిసి రుణాలకు 31లోగా దరఖాస్తు చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జూలై 21: బీసి కార్పొరేషన్ ద్వారా రుణాలను పొందటానికి ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు ఒక ప్రకటనలో తెలిపారు. 2017-18 సంవత్సరానికి బీసీ కార్పొరేషన్, 11 బీసీ ఫెడరేషన్ల ద్వారా, కాపు కార్పొరేషన్ ద్వారా సబ్సీడితో కూడిన రుణాన్ని అందిస్తారని తెలిపారు. బ్యాంకు అనుసందానంతో రుణాన్ని అందిస్తామన్నారు. లబ్ధిదారులు ఓబి ఎం ఎం లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు నమోదు చేసుకోవాలన్నారు. ఆగస్టు 1 నుండి 15లోగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ఆగస్టు 16 నుండి 31వరకు డాక్యుమెంటేషన్ జరుగుతుందని తెలిపారు. సెప్టెంబర్ 30 నాటికి గ్రౌండింగ్ అక్టోబర్ 10 నుండి థర్డ్‌పార్టీ వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.