ఖమ్మం

విద్యా సంస్థల బంద్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), జూలై 21: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సంఘ పిలుపు మేరకు ఖమ్మంలో శుక్రవారం నిర్వహించిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. విద్యా సంఘాల పిలుపు మేరకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ముందుగానే సెలవు ప్రకటించాయి. ప్రభుత్వ పాఠశాలలు యథావిధిగా తెరచినప్పటికీ విద్యా సంఘాల నేతలు విద్యార్థులను బయటికి తీసుకువచ్చి బంద్ విజయవంతం చేశారు. బంద్ సందర్భంగా పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, టివివి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కెసిఆర్ అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సభలో విద్యార్థి సంఘాల నాయకులు మందా సురేష్, తాళ్ళ నాగరాజు, జాగర్లమూడి రంజిత్‌కుమార్, స్వాతి మాట్లాడుతూ కెసిఆర్ అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలను దుయ్యబట్టారు. ఎన్నికల ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. కెజి టు పిజి విద్య మాటల గారడిగానే మిగిలిపోయిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. విద్యా రంగానికి ఎలాంటి నిధులు కేటాయించకుండా గుళ్ళు, గోపురాలకు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ విద్యలో మధ్యాహ్న భోజన పథకం ఊసే లేదన్నారు. స్కాలర్‌షిప్, ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలను పట్టించుకునే నాథుడే లేరన్నారు. కులాల వారీగా గురుకులాలను ప్రవేశపెట్టడాన్ని వారు తప్పుపట్టారు. విద్యార్థులు లేరనే సాకుతో పాఠశాలలను మూసివేయాలనుకోవడం కార్పొరేట్ విద్యను ప్రోత్సహించడమేనని మండిపడ్డారు. ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని ప్రభుత్వం అరికట్టకపోగా వారికి ఎర్ర తీవాచీలు పరచిందని ఆరోపించారు. విద్యా రంగ సమస్యలు పరిష్కరించేంత వరకు విశ్రమించబోమని, తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.