ఖమ్మం

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), జూలై 21: రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి కె తారాక రామారావు మండల స్థాయిలో ప్రభుత్వ కార్యాక్రమాల అమలు తీరుపై శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఖమ్మం మేయర్ డాక్టర్ పాపాలాల్, కమిషనర్ బొనగిరి శ్రీనివాసరావు, అధికారుల బృంధం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షించారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నగరంలో చేపట్టిన ఓడిఎఫ్, సాలిడ్ వేస్ట్, మెనేజ్‌మెంట్, హరితహారం, లెడ్‌లైట్లు ఏర్పాట్ల అంశంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా, సిటిజెన్ సర్వీస్ సెంటర్ ద్వారా మున్సిపల్ సేవలందించే కార్యక్రమాలపై తగిన సూచనలు చేశారు. చికెన్, మటన్, ఫిష్ అమ్మకందారులు వేస్టేజ్ వలన దుర్గంధం వెదజల్లే ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేకుండా చూడాలని, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన వారిని గుర్తించి ట్యాబ్ కనెక్షన్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ పథకం వర్తించేలా చూడాలన్నారు. డంపింగ్‌యార్డును సుందీరకరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. నగరం ఆహ్లాదకరంగా ఉండేందుకు ఔషధ మొక్కలు, సువాసన వెదజల్లే మొక్కలు విరివిగా నాటాలన్నారు. ప్రధాన సమస్యగా ఉన్న గోళ్ళపాడు ఛానల్ ఆధునీకరణ పనులు త్వరగా పూర్తిచేయాలని, ఆగస్టు 10 నాటికి నిర్దేశించిన పనులన్నింటిని పూర్తి చేసే విధంగా వేగవంతం చేయాలన్నారు. మేయర్, కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి అన్ని చర్యలు చేపడుతామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎంఇ రంజిత్‌కుమార్, డిఇలు రామన్, స్వరూపారాణి, ఏసిపి రామచందర్‌రావు, ఎఇ రంగారావు, ఆర్‌ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.