గుంటూరు

అక్రమ కేసులతో అరెస్ట్‌లా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), జూలై 21: తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో అక్రమ కేసులతో సామాన్యులను అరెస్ట్ చేయడం పరిపాటిగా మారిందని సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు కె నళినీకాంత్ ఆరోపించారు. శుక్రవారం నగర సిపిఎం ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని పార్టీ కార్యాలయం నుండి శంకర్‌విలాస్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నళినీకాంత్ మాట్లాడుతూ నీరు-చెట్టు పేరుతో ప్రకాశం జిల్లా, దేవరపల్లిలో దళిత భూములను ఆక్రమించి చెరువులు తవ్వుతుంటే అడ్డుకున్న వారిని అరెస్ట్‌లు చేయడం దారుణమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో ఆత్మా ఫుడ్‌పార్క్ పేరిట పర్యావరణాన్ని పాడు చేస్తుంటే వ్యతిరేకించిన ప్రజలు, సిపిఎం నాయకులను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ప్రకాశం జిల్లా దేవరపల్లిలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఈ రెండు సంఘటనలలో సిపిఎం నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారని, ప్రభుత్వం వారిని వెంటనే విడుదల చేయకుంటే ఆందోళనబాటపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎండి అక్బర్, షేక్ మస్తాన్‌వలి, నికల్సన్, షకీలా, ప్రమీలారాణి, బి లక్ష్మణరావు, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.