గుంటూరు

ప్రారంభానికి డిజిపి ఆఫీసు ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూలై 21: మంగళగిరిలోని ఎపిఎస్‌పి ఆరో బెటాలియన్ ప్రాంగణంలో 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన సుమారు 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆంధ్రప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) కార్యాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన డీజీపీ కార్యాలయాన్ని ఈనెల 28న ముఖ్యమంత్రితో ప్రారంభించేందుకు ముస్తాబు చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఐదంతస్తుల భవనాన్ని విశాలంగా అత్యాధునిక వసతి సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా నిర్మించారు. డీజీపీ కార్యాలయ నిర్మాణానికి గతేడాది ఆగస్టు 26న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి , హోంశాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప శంకుస్థాపన గావించారు. తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయానికి కొత్త డీజీపీ కార్యాలయం సుమారు 20 కిమీ దూరంలో ఉంటుంది. బెటాలియన్‌లో పూర్తి భద్రత మధ్య డీజీపీ ఆఫీసు నిర్మాణం జరిపారు. ఎపి పోలీసు హెడ్ క్వార్టర్స్‌గా ఉండే ఈ ప్రాంతంలోనే భవిష్యత్తులో పోలీసు శాఖలోని అన్ని ప్రధాన విభాగాలు, సిఐడి, ఇంటిలిజెన్స్ వంటి విభాగాలు ఇక్కడి నుంచే పనిచేసే విధంగా పోలీసుశాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. పోలీసు ఉన్నతాధికారులకు రెసిడెన్షియల్ క్వార్టర్స్ కూడా బెటాలియన్‌లోనే నిర్మించే ప్రతిపాదన ఉన్నట్లు చెబుతున్నారు. బెటాలియన్ పక్కనే నిర్మించే ఎయిమ్స్ ప్రాంగంణంలో ఎన్‌హెచ్ 16 - ఓల్డ్ ఎన్‌హెచ్ కనెక్టివిటీ రోడ్డు ద్వారా రాజధాని వైపుకు డీజీపీ ఆఫీసు నుంచి రవాణా సౌకర్యం దగ్గరగా ఏర్పడనుంది.