గుంటూరు

నకిలీ విత్తనాలు నియంత్రించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 21: తక్కువ ఖర్చుతో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడమే పొలంబడుల ముఖ్య ఉద్దేశమని వ్యవసాయశాఖ జిల్లా సంయుక్త సంచాలకులు విడివి కృపాదాస్ అన్నారు. శుక్రవారం స్థానిక కృషిభవన్‌లో జిల్లా స్థాయి పొలంబడి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెడి కృపాదాస్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ ఖరీఫ్ సీజన్ నుండే రైతుక్షేత్రాల్లో శిక్షణ ఇచ్చి, వారి కమతాలలో శాస్ర్తియ పద్ధతులు అమలుపర్చి, నాణ్యమైన దిగుబడులు సాధించే దిశగా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ఒక్కొక్క పొలంబడిలో 30 మంది రైతులను ఎంపిక చేసి 10 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని, పొలంబడి నిర్వహణలో వారానికి ఒకరోజు చొప్పున 14 వారాలు శిక్షణ-సందర్శన జరుగుతుందన్నారు. పొలంబడి అమలుకు ప్రభుత్వం రూ. 10 లక్షల నిధులు కేటాయించిందని జెడి తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంటనష్ట పరిహారం పొందేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంపై రైతులను చైతన్యపర్చాలని వ్యవసాయ అధికారులను కోరారు. ఈ-క్రాప్ నమోదులో భాగంగా ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలని సూచించారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఉదాసీనంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని కృపాదాస్ హెచ్చరించారు. లాంఫారం డాట్ సెంటర్ కో-ఆర్డినేటర్ ఎం నగేష్ మాట్లాడుతూ ఐపిఎం సమగ్ర సస్యరక్షణ-యాజమాన్యంలో భాగంగా ప్రత్తిలో కాండంపూత, లింగాకర్షక బుట్టల వినియోగం వలన ఉపయోగాలు, జీవన ఎరువుల వాడకం వలన లాభాల గురించి వివరించారు. వరిపైరులో సమగ్ర సస్యరక్షణ, నీటి యాజమాన్యం, ఎరువుల వినియోగాన్ని విశధీకరించారు. సమావేశంలో సంయుక్త వ్యవసాయ సంచాలకులు కె లక్ష్మణరావు, డిడి తిరుపతయ్య, ఎడిఎ ఎస్ రామ్మోహన్, బాపట్ల రైతు శిక్షణా కేంద్రం ఉప వ్యవసాయ సంచాలకులు శివకుమారి, ఎం రామలింగయ్య, ఎడిఎలు మస్తానమ్మ, సి పద్మావతి, ఇన్సూరెన్స్ ప్రతినిధులు, జిల్లాలోని ఎడిఎలు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.