మహబూబ్‌నగర్

ప్రజలంతా విరివిగా మొక్కలు నాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 21: ప్రజలంతా కలిసి విరివిగా మొక్కలు నాటాలని అప్పుడే హరిత తెలంగాణ సాధ్యమవుతుందని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా రవాణ శాఖ కార్యాలయం, ఆర్టిసీ బస్సుడిపో ఆవరణలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లతో కలిసి మంత్రి మహేందర్‌రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో రవాణశాఖ కార్యాలయాలు బస్‌స్టేషన్లు, బస్ డిపోలలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటేందుకు ప్రణాళికలు రూపొందించామని అన్నారు. ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి కరీంనగర్‌లో హరితహారం కార్యక్రమం ప్రారంభించిన అనంతరం అన్ని జిల్లాలలో మంత్రుల ఆధ్వర్యంలో తమతమ శాఖల ద్వారా హరితహారం కార్యక్రమాలు చేపట్టామని, అంతేకాక జిల్లా కలెక్టర్లు పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు నాటాలని, ప్రతి నియోజకవర్గంలో 4లక్షల మొక్కలు నాటాల్సిందిగా నిర్దేశించారని తెలిపారు. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో అటవీ శాతం అధికంగా ఉండడం వల్ల ఆయా జిల్లాల్లో వర్షాలు బాగా కురుస్తున్నాయని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో అటవీశాతం తక్కువగా ఉన్నందున తమవంతు కృషి చేయాలన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా అందరూ కృషి చేయాలని, మొక్కలు నాటడం నుండి కంచేలు ఏర్పాటు చేయడం, నీరు పోసి సంరక్షించే భాద్యత వరకు ప్రతి పనికి ఎన్‌ఆర్‌ఇజిఎస్ కింద నిధులు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. గ్రామాలలో మహిళా సంఘాల ఆద్వర్యంలో ప్రతి ఇంట్లో మొక్కలు నాటేలా చూడాలని పేద మహిళలు పండ్ల చెట్లను నాటి సంరక్షిస్తే వాటి ఫలాలు పొందేలా ఆ చెట్లకు పట్టాలు మంజూరు చేసే ఆలోచన కూడా ముఖ్యమంత్రి చేస్తున్నారని తెలిపారు. పిల్లలని పెంచినట్లు నాటిన మొక్కలను కూడా సమయం కేటాయించి సంరక్షించాలన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మొక్కలు నాటడంలో ప్రపంచంలోనే మూడవ స్థానంలో మనం ఉన్నామని అన్నారు. ఈ సంవత్సరం మన జిల్లాలో కోటి 30లక్షల మొక్కలు నాటేందుకు నిర్దేశించారని అన్నారు. ప్రతి ఇంట్లో నాలుగైదు పూలు, పండ్ల మొక్కలు నాటేల చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా రవాణ అధికారిణి మమతాప్రసాద్, అటవీశాఖ అధికారి గంగిరెడ్డి, డిఆర్‌డిఓ పిడి జగధీశ్వర్‌రెడ్డి, డిపి ఆర్ ఓ పాండురంగారావు, సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

భూసేకరణకు వెళ్ళిన అధికారులను అడ్డుకున్న రైతులు
జడ్చర్ల, జూలై 21: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల నిర్వహణలో అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. అయినా మొక్కఓని దీక్షతో అధికారులు ప్రభుత్వలక్షాన్ని నెరవేర్చేందుకు రైతులను ఎక్కడికక్కడ సంతృప్తి పరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఈదశలో కర్వెన రిజర్వాయర్ తర్వాత నిర్మించ తలపెట్టిన ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణం విషయంలో అధికారులకు శుక్రవారం చుక్కెదురయ్యింది. రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు ఉదండాపూర్, వల్లూర్ గ్రామాలకు వెళ్లిన అధికారులను రైతులు సర్వే జరుపనీయకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వం భూసేకరణకు సంబందించి స్పష్టమైన హామీ ఇవ్వనిదే తాము భూసేకరణ జరపనీయమని రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. ఆర్డీఒ లక్ష్మినారయణ ఆధ్వర్యంలో ఉదండాపూర్‌కు మూడు బృందాలు, వల్లూర్ గ్రామానికి మూడు బృందాలు రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూముల సర్వేకు వెళ్లారు. బృందాలలోని సభ్యులు సర్వే నిర్వహించడానికి ప్రయత్నించినా ఆయా గ్రామాల్లోని రైతులు అధికారులను అడ్డుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. భూసేకరణకు సంబందించి ప్రభుత్వం ఇవ్వజూపిన నష్టపరిహారం ఏమాత్రం సమంజసంగా లేదని తమ భూములు ఎంతో విలువైనవని హైద్రాబాద్ నగరానికి కూత వేటు దూరంలో ఉన్న తమ భూములు బంగారం లాంటివని ఇలాంటి భూములను వదులుకుంటే తమ బతుకు దుర్భరంగా మారుతుందని అందువల్ల తమకు తగిన నష్ట పరిహారం ఇస్తేనే భూసేకరణకు సహకరిస్తామని లేని పక్షంలో ఎంతటి త్యాగానికైనా తాము సిద్దమని వారు అడ్డుతగిలారు. అంతేకాక తమకు నష్ట పరిహారం చెల్లించే విషయం గురించి ముఖ్యమంత్రి కెసీఆర్‌ను కలిసి ఆయన ద్వారా స్పష్టమైన హామీ అందిన తరువాతనే భూ సేకరణ జరుపనిస్తామని అందువల్ల అధికారులు తిరిగి వెళ్లిపోవాలని అధికారులను కోరారు. ఈ విషయంలో రైతులకు నచ్చజెప్పడానికి ఆర్డీఒ లక్ష్మినారయణ, తహశీల్‌దార్ లక్ష్మినారయణలు ప్రయత్నించినా వారు వినిపించుకోలేదు. ముఖ్యమంత్రి కెసీఆర్ డిల్లీవెళ్లారని ఆయన వచ్చే వరకు వేచి ఉండాలని కెసీఆర్‌ను కలిసిన తరువాతనే ఆయన హామీ మేరకు తాము భూ సేకరణకు సహకరిస్తామని అంతవరకు వేచి ఉండాలని రైతులు అధికారులకు సూచించారు. అయితే భూసేకరణ విషయంలో అగస్టు 2వతేదీ వరకు తాము వెసులు బాటు కల్పిస్తామని అంతలోపు ముఖ్యమంత్రి కలుసుకోవాలని లేని పక్షంలో చట్ట పరంగా భూసేకరణ జరుపుతామని ఆర్డీఒ లక్ష్మినారయణ రైతులకు తెలిపి అక్కడినుండి వెనుదిరిగారు.

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
భూత్పూర్, జూలై 21: కర్వెన ప్రాజెక్టులో భూములు కొల్పోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం భూత్పూర్ మండలం భట్టుపల్లితాండ, కర్వెన గ్రామాల్లో రిజర్వాయర్ కింద భూములు కొల్పోయిన రైతులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కర్వెన రిజర్వాయర్ పనులను పరిశీలించారు. భూములు కొల్పోయిన రైతులకు ఎంతెంత పరిహరం అనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ భూముల మార్కెట్ విలువ కూడా ఎంత ఉందని ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిహారంతో తిరిగి భూములు వేరే చోట కొనుగోలు చేయడానికి ఈ డబ్బులు సరిపోతాయా అంటూ రైతులతో ఆరా తీశారు. భట్టుపల్లితాండ, కర్వెన గ్రామాల రైతులకు రూ.3.50లక్షలు మాత్రమే చెల్లించడం ఏమిటని ప్రశ్నించారు. రైతులకు సరైన ధరలు చెల్లించని ఎడల భట్టుపల్లి గ్రామ రైతులతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన వెంట సిపిఐ రాష్ట్ర సహయ కార్యదర్శి వెంకట్‌రెడ్డి, ఈర్ల నరసింహులు, పద్మ, రామకృష్ణ, రాంమోహన్, బాలకిషన్, సురేష్, ఖాజామైనోద్దిన్, మోహన్‌నాయక్‌తో పాటు భట్టుపల్లితాండ, కర్వెన గ్రామాల రైతులు ఉన్నారు. అనంతరం ముంపుకు గురయ్యే గ్రామాలను కూడా పరిశీలించి రైతుల బాధలను, కులవృత్తుల వారి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ముంపుకు గురవుతున్న కారణంగా కులవృత్తుల వారికి ప్రభుత్వం ఏం సహయం అందించిందని కూడా చాడ వెంకట్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఇందుకు కులవృత్తుల వారు చాడ వెంకట్‌రెడ్డితో మాట్లాడుతూ తమకు ఇప్పటివరకు ఎలాంటి సహయ సహకారాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కులవృత్తిని నమ్ముకుని తాము తమ కుటుంబాలు తరతరాలుగా ఇదే గ్రామాల్లో జివిస్తున్నామని ప్రస్తుతం జీవనోపాధి కొల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చశారు. కులవృత్తుల వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. 2013 చట్టంలో ఉన్నటువంటి నిబంధనాలను వీరికి వర్తింపజేయాలని ఆయన కోరారు.

పిల్లల పార్కుల అభివృద్ధికి పెద్దపీట
మహబూబ్‌నగర్, జూలై 21: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని లక్ష్మినగర్, టీచర్స్‌కాలనీ, శ్రీనివాస్‌కాలనీలలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పార్కుల పనుల నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలలో ప్రజలకు మంచి వాతావరాణాన్ని కల్పించడానికి చిన్నచిన్న పార్కుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. అందులో భాగంగా లక్ష్మినగర్‌కాలనీ, శ్రీనివాస్‌కాలని, టీచర్స్ కాలనీలలో రూ.53.66 లక్షల ఖర్చుతో పార్కుల నిర్మాణం జరుగుతుందని అన్నారు. పాలకుడు అనే వాడు అభివృద్ధి చేయాలని అలా కాకుండా ప్రజలను విడదీసి తమ స్వార్థరాజకీయాల కోసం మాటలు చేప్పి మోసం చేసి ప్రజలకు అభివృద్ధి అంటే ఏమిటనే విధంగా తెలియనివ్వకుండా చేశారని అన్నారు. సాయంత్రం పూట పిల్లాపాపలతో కొద్ది సేపు ఆడుకుందామని భావించే వారికి పట్టణంలో అలాంటి అవకాశాలు లేకుండా చేశారని అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయావని తెలిపారు. జిల్లా కేంద్రాలే ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టణాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. ఇటీవల మంత్రి కెసిఆర్ వచ్చిన సందర్భంలో తాను రోడ్లుకోసం నిధులు కావాలంటూ అడిగిన తక్షణమే రూ.20 కోట్లు మంజూరి చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో దాదాపు రూ.2000 కోట్ల నిధులతో అభివృధ్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఒక్క పట్టణంలోనే దాదాపు రూ.1200 కోట్ల నిధులు ఖర్చు పెడుతున్నామని వెల్లడించారు. 44వ జాతీయ రహదారి వైపు పట్టణాన్ని విస్తరింపజేస్తున్నామని, దీనిని దృష్టిలో ఉంచుకుని దివిటిపల్లి దగ్గర దాదాపు 1500 డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని త్వరలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ లబ్ధిదారులకు అంకితం చేయనున్నారని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ రాదఅమర్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ మున్సిపాలిటి అన్ని రంగాలలో అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కృషి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీర్వాదంతో ప్రజల కష్టాలు తీరుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దేవ్‌సింగ్‌నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ వెంకటయ్య, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

చెరువుల మరమ్మతులకు నిధులు
మహబూబ్‌నగర్, జూలై 21:జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి చెరువుల మరమ్మత్తుకై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను విడుదల చేస్తూ శుఖవారం ఉతర్వులు జారీ చేసింది. ఇటీవల రాష్ట్ర భారీ నిటిపారులశాఖ మంత్రి తన్నీరు హరిష్‌రావు జిల్లా పర్యటనలో భాగంగా పలు చెరువుల తూముల మరమ్మతుల సమస్యలు దృష్టికి వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన జిల్లా అధికారులను మరమ్మతులకు సంబింధించిన నివేదికను అందించాలని అందకు కావల్సిన నిధుల వ్యయం ఎంత అవుతుందని ప్లాన్ వేసి త్వరితగతిన అందించాలని ఆదేశించారు.
దాంతో అధికారులు వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. దాంతో సంబంధిత మంత్రి హరిష్‌రావు శుక్రవారం భీమా ప్రాజెక్టు పరిధిలోని 31 చెరువులను నింపేందుకు గాను తూముల నిర్మాణానికి, మరమ్మతులకు రూ.1.16 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భీమా ప్రాజెక్టు పరిధిలోని 21,22 ఫ్యాకెజీలలో భాగంగా ఈ పనులు చేపట్టనున్నారు. అదేవిధంగా కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పంప్‌హౌజ్‌లకు ప్రహరీగోడ, సెక్యూరీటి గార్డు గది నిర్మాణానికి గాను రూ.3కోట్ల నిధులను సైతం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాజెక్టు స్టేజ్-1 కింద నర్వ మండలం నాగిరెడ్డిపల్లి, ధన్వాడ మండలం తీలేరు గ్రామాల్లో పంప్‌హౌజ్, ప్రహరిగోడ నిర్మాణానికి ఖర్చు చేయనున్నారు.

మొక్కలు నాటండి.. సంరక్షించండి
వనపర్తి, జూలై 21: హరితహారంలో భాగంగా వనపర్తి పట్టణం 14వ వార్డులో ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రమేష్‌గౌడ్, గ్రంథాలయ ఛైర్మన్ లక్ష్మయ్య, మున్సిపల్ కమిషనర్ వీరబుచ్చయ్య, వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి, కౌన్సిలర్లు శారధ, కృష్ణబాబు, విజయలక్ష్మి, రమేష్ నాయక్, శంకర్‌ప్రసాద్, తిరుపతయ్య, కిరణ్‌కుమార్, అఖ్తర్, బాబా, రాగివేణు, చంద్రవౌలి, వెంకటేష్, హనీష్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాలను హరితవనంగా తీర్చిదిద్దాలి: డిఎస్పీ
కల్వకుర్తి, జూలై 21: గ్రామాలను హరిత వనంలా తీర్చి దిద్దాలని కల్వకుర్తి డిఎస్పీ రమాకాంత్‌రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ముకురాల, చిన్న ముకురాల గ్రామాలలో గ్రామ సర్పంచ్ పద్మకృష్ణగౌడ్‌తో కలిసి వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం మూడవ విడతలో భాగంగా కల్వకుర్తి పట్టణంతో పాటు మండల పరిధిలోని గ్రామాలను హరితవనంగా తీర్చిదిద్దాలని పచ్చదనంతోనే వర్షాలు విరివిరిగా కురుస్తాయని, మొక్కల పెంపకంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జలందర్‌రెడ్డి, ఉపాద్యాయులు, గ్రామస్థులు తదితరులు ఉన్నారు.

ఎంజికెఎల్‌ఐకి ముప్పువాటిల్లకుండా చూడండి
కొల్లాపూర్, జూలై 21: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఎంజికెఎల్‌ఐకి ముప్పువాటిల్లకుండా నిర్మాణం చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఎల్లూరు గ్రామ సమీపంలో నిర్మాణమవుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సొరంగం పనులు, కాలువ పనులు, ఎంజికెఎల్‌ఐ సంపు పనులను సిపిఐ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ ఎంజికెఎల్‌ఐ మొదటి లిప్టు సమీపంలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపొతల పథకం పనులు జరుగుతున్నాయని, సొరంగ పనుల బ్లాస్టింగ్‌తో ఎంజికెఎల్‌ఐ పంపుహౌజ్‌కు ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. ఎంజికెఎల్‌ఐ పక్కనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీళ్లు తీసుకొని పోవడం వల్ల నీటి సమస్య కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. నికర జలాలు కాకుండా తిరుగు జలాలతో వేల కోట్లు వెచ్చించి ప్రాజెక్టును నిర్మిస్తే భవిష్యత్‌లో పరిస్థితులు ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం పంతానికి పోకుండా ప్రాజెక్టులు ఇంజనీయర్ల సలహాలు తీసుకొని నిర్మిస్తే బాగుంటుందన్నారు. మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలకు జూరాల నుంచి కృష్ణానది నీళ్లు మల్లిస్తే బాగుంటుందన్నారు. ఎంజికెఎల్‌ఐ ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా నిపుణుల సలహాతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపొతల పథకాన్ని చేపట్టాలని, భూమి కోల్పోయే రైతులకు నష్టపరిహారంలో తగినవిధంగా వారికి చెల్లించాలని డిమాండ్ చేశారు. సిపిఐ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, ప్రజలకు న్యాయం జరిగేవిధంగా ప్రాజక్టుల నిర్మాణాలు కావాలనేదే సిపిఐ కోరుకుంటుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మా దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్టస్రహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు పద్మ, ఆదిరెడ్డి, ఈర్ల నర్సింహ్మా, స్థానిక నాయకులు కందాల రామకృష్ణ, బాల్‌నర్సింహ్మా, ఫయాజ్ తదితరులు ఉన్నారు.