హైదరాబాద్

24, 25 తేదీల్లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: నగరంలోని అడిక్‌మెట్ సమీపంలోని 500 ఎంఎం డయా ఇన్‌లెట్ స్లూయిస్ వాల్వ్, 600 ఎంఎం తయా ఔట్‌లెట్ రిజర్వాయర్ క్లీనింగ్, మరమ్మతుల పనుల కారణంగా ఈ నెల 24, 25 తేదీల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండబోదని జలమండలి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 24వ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి మరుసటి రోజైన 25న ఉదయం తొమ్మిది గంటల వరకు నీటి సరఫరా ఉండబోదని పేర్కొంది. 24న పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్, బాపూనగర్, అహ్మద్‌నగర్, ఆజాద్‌నగర్, దుర్గానగర్, ఎంసిహెచ్‌కాలనీ, రఘునాధ్‌నగర్, ఓవైసీనగర్, ఆనంత్‌రాంనగర్, అలాగే 25న పోచమ్మబస్తీ, పాములబస్తీ, తురబ్‌నగర్, బురుజుగల్లీ, కుమ్మర్‌వాడి, గంగాబౌలీ, భరత్‌నగర్, ఆకాశ్‌నగర్, చెన్నారెడ్డినగర్, జైశ్వాల్ గార్డెన్, తిరుమలనగర్, వెంకటేశ్వనగర్, మారుతినగర్, అంబేద్కర్‌నగర్ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని, పైన పేర్కొన్న ప్రాంతాల్లోని ప్రజలు ఈ విషయాన్ని గమనించిన అంతకు ముందు వచ్చే సరఫరాలో తమకు అవరమైన మోతాదులో నీటిని నిల్వ చేసుకోవాలని జలమండలి ప్రకటనలో పేర్కొంది.