హైదరాబాద్

మరింత చేరువలో పోలింగ్ స్టేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: సాధారణంగా మహిళలకు, పురుషులకు వేర్వేరు పోలింగ్ స్టేషన్లుంటాయి. భార్య ఓటు ఒక దగ్గర, భర్త ఓటు మరోచోట ఉంటుంది. ఓటర్లు నివాసముంటున్న ప్రాంతాలకు దూరంగా పోలింగ్ స్టేషన్లు ఉండటం వల్ల కూడా ఓటింగ్ శాతం తగ్గుతుందన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. ఇకపై సాధారణ సరిహద్దులతో ఓటర్లకు చాలా దగ్గర్లో అందుబాటులో ఉండేలా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. కొన్ని కుటుంబాలకు కలిపి, సుమారు వెయ్యి మంది ఓటర్లకు అందుబాటులో ఉండేలా ఒక్కో పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.
అంతేగాక, నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 65లక్షల మంది ఓటర్లుండటం ఒక రకంగా ఆశ్చర్యానే్న కల్గిస్తోంది. అయితే ఇందులో చనిపోయిన వారు ఇళ్లు మారి వెళ్లిపోయిన వారు, వృత్తిరీత్యా ఇక్కడి నుంచి బదిలీ అయిన వారితో పాటు నగరంలోని ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటరుగా నమోదై ఉండటం వంటివి కారణాలుగా గుర్తించిన జిహెచ్‌ఎంసి, అలాంటి తప్పోప్పులను సరి చేసి పారదర్శకమైన ఓటరు జాబితాను తయారు చేసేందుకు మరో ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. ఈ నెల 23వ తేదీ నుంచి ఇంటింటికి ఓటరు జాబితా సవరణను ముమ్మరం చేయనుంది. ఇందులో భాగంగా మొత్తం జిహెచ్‌ఎంసి పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిల్లోని సుమారు 3500 పై చిలుకు పోలింగ్ స్టేషన్లకు ఒక్కోదానికి ఒక్కో బూత్ లెవెల్ ఆఫీసర్‌ను, ప్రతి పది పోలింగ్ స్టేషన్లకు ఓ పర్యవేక్షణాధికారిని నియమించారు. ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఇంటింటి సర్వే నిర్వహించి, ఇంట్లో నివాసముంటున్న ఓటర్ల వివరాలను సరిచూసుకుని, వారికి కేటాయించిన ట్యాబ్‌లో వివరాలను నమోదు చేసి, ఓ ఫోటోను కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. అలాగే గత జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారిని కొత్త ఓటర్లుగా నమోదు చేయాల్సి ఉంటుంది. మొట్టమొదటి సారిగా ట్యాబ్ పిసిలతో ఓటింగ్ జాబితా సవరణ నగరంలో జరగనుంది. ఇది విజయవంతమైతే మొత్తం దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్‌లో జరిగే ఈ సవరణ ప్రక్రియను డేటా ఎంట్రీ ఆపరేటర్‌లు కంప్యూటర్ల ద్వారా చూస్తుంటారని, సవరణ ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యహారించినా, తప్పులు చోటుచేసుకున్నా, సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిహెచ్‌ఎంసి భావిస్తోంది.
తాళం వేసి ఉంటే..
ఓటరు జాబితా సవరణ కోసం వచ్చే బూత్ లెవెల్ అధికారులకు ప్రజలు కూడా తమవంతు బాధ్యతగా సహకరించాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి సూచించారు. ఎక్కడైనా ఇంటికి తాళం వేసి ఉన్నట్లు కన్పిస్తే ఆ ఇంటి డోర్‌కు స్టిక్కర్ అంటించాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. వచ్చిన బూత్ లెవెల్ అధికారి పేరు, సెల్ నెంబర్ వివరాలు ఆ స్టిక్కరపై ఉంటాయి.
రాజకీయ పార్టీలూ ఏజెంట్లను నియమించాలి
నగర ఓటరు జాబితా సవరణలో తప్పోప్పులను సరి చేసేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ట్యాబ్‌లెట్ల పిసిలతో చేపట్టనున్న ఈ సవరణ కార్యక్రమానికి రాజకీయ పార్టీలు కూడా తమవంతు బాధ్యతగా ఓ ఏజెంట్‌ను నియమించాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి సూచించారు. పోలింగ్ స్టేషన్ల వారీగా పార్టీలు తమ ఏజెంట్లను నియమిస్తే కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ, సవరణలకు సిబ్బంది సహాయంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.