వరంగల్

ప్రభుత్వ పథకాలతో ఉపాధి పొందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, జులై 21: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వినియోగించుకొని ఉపాధి పొందాలని యువతకు మహబూబాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా సూచించారు. కేసముద్రం మండల కేంద్రంలో ఎస్టీ హాస్టల్ ఆవరణలో నిరుద్యోగ యువత వ్యక్తిత్వ వికాసాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన పథకం శిక్షణ శిబిరాన్ని కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కంప్యూటర్ లాబ్‌ను ప్రారంభించారు. అనంతరం శిక్షణ పొందుతున్న యువతతో కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలపై శిక్షణ ఇచ్చి అనంతరం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని వినియోగించుకొని ఉద్యోగ, ఉపా ధి అవకాశాలు పొందడానికి యువత కృషి చేయాలన్నారు. శిక్షణ కేంద్రంలో మహబూబాబాద్ జిల్లాలో పదవ తరగతి ఉత్తీర్ణులై, ఇంటర్, డిగ్రీ ఫెయిల్ అయినవారు 18 నుంచి 26 ఏళ్ల లోపు యువతకు ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్, వర్క్ రెడ్యూసర్, కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించే విధంగా 3 మాసాల పాటు ఉచిత భోజన, వసతితో కూడిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఇడి రాజు, డిఆర్‌డిఎ పిడి గణేష్, ఎపిడి హనుమంతరావు, డిపిఆర్వో అయ్యుబ్‌అలీ, ఎంపిడిఓ అరుణాదేవి, జాబ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీలత, ఎపిఎం రాజీరు, ట్రైనర్స్ రామారావు, విజయ్‌కుమార్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి సంఘాల బంద్ సక్సెస్
వడ్డేపల్లి, జూలై 21: రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా విద్యార్థి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి ఎన్నో మార్లు వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేకపోవడంతో విద్యాసంఘాల ఐక్య కార్యాచరణ కమి టీ ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్టవ్య్రాప్త బంద్‌లో భాగంగా శుక్రవారం నగరంలోని పలుచోట్ల రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. రాష్టవ్య్రాప్త బంద్ సందర్బంగా కొన్ని పాఠశాలలు ఒకరోజు ముందే సెలవుప్రకటించగా, మరి కొన్ని విద్యాసంస్థలను విద్యార్థులు వెళ్లి బంద్ చేయించారు. ఎంజిఎం కూడలి, కలెక్టరేట్ల ముందు ఐక్య విద్యార్థి సం ఘాలు నిర్వహించిన రాస్తారోకోలు, ధర్నాలతో నగరంలో కొంత సేపు ట్రాఫిక్ అంతరాయం కలిగి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ సందర్బంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాల కాలం గడుస్తున్నా విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, దీంతో రాష్టవ్య్రాప్తంగా విద్యార్థులు రోడ్లపైకి రావలసిన దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రభుత్వం పాఠశాలు, కళాశాలలలో వేలాది బోధన, బోధనేతర సిబ్బంది ఖాలీలను నింపకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని ఆరోపించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 4650 ప్రభుత్వ పాఠశాలలను మూసి వేసే కార్యక్రమాన్ని చేపట్టడం దుర్మార్గమైన చర్యఅని మండిపడ్డారు. విద్యార్థి సంఘాలపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్, విద్యాశాఖలు సంయుక్తంగా జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని, అదే విధంగా యూనివర్సిటీలలో సభలు, సమావేశాలు నిర్వహించరాదని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కూడా రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో విశ్వవిద్యాలయాలు ఉద్యమాలకు నిలయాలని కీర్తించిన ముఖ్యమంత్రి నేడు వాటిని నిర్వీర్యం చేయాలని చూడడం సిగ్గుచేటని, విద్యార్థి ఉద్యమాలు లేకుంటే తెలంగాణ రాష్టస్రిద్దించేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రైవేట్,కార్పోరేట్ పాఠశాలలు, కళాశాలలలో బలవంతంగా వసూలు చేస్తున్న అధిక ఫీజులను నియంత్రించడానికి వెనుకాడడంలో ప్రభుత్వ ఆంతర్యం ఏమిటని, వారిచ్చే కాసులకు కక్కుర్తి పడి విద్యార్థుల జీవితాలను బుగ్గిపాలు చేయడం ఎంతవరకు సబబుఅని నిలదీశారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో వౌళిక సదుపాయాలు, ఉపాద్యాయ నియామకాలు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా, విద్యార్థుల సమస్యలపై పోరాడే విద్యార్థి సంఘాలపై అక్రమ కేసులు బనాయించడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయిన చందంగా ఉన్న విద్యాలయాలకే వౌళికసదుపాయాలు కల్పించలేని ప్రభుత్వం కెజి టు పిజి ఉచిత నిర్భంధ విద్య అందిస్తామని ముఖ్యమంత్రి ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊసరవెళ్లిలా రంగు లు మారుస్తున్నాడని నిప్పులు చెరిగారు. విద్యార్థులకు బకాయిపడిన ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యారంగాన్ని రద్దు చేయాలని, విద్యాహక్కు చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐక్యకార్యాచరణ విద్యార్థి సంఘాల నాయకులు శరత్, స్వామి, ప్రశాంత్, చిరంజీవి, మొగిలి, వెంకటరెడ్డి, సంతో ష్, విజయ్‌కన్న, సారయ్య, రోహిత్, అవినాశ్ తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐక్య విద్యార్థి సంఘాల రాష్ట్ర వ్యాప్త బంద్‌లో భాగంగా నర్సంపేట డివిజన్‌లో శుక్రవారం జరిగిన విద్యాసంస్థల బంద్ సంపూర్ణంగా జరిగింది. విద్యార్థి సంఘాల సూచనలతో ముందస్తుగానే ప్రైవేట్ పాఠశాలలకు ఆయా పాఠశాలల యజమాన్యాలు బంద్‌ను ప్రకటించాయి. ప్రభుత్వ పాఠశాలలు, కొన్ని ప్రైవేట్ కళాశాలల తరగతులను ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు బహిష్కరింపజేశారు. ద్విచక్రవాహనాలపై తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి హన్మకొండ శ్రీ్ధర్, ఏఐఎస్‌ఎఫ్ రూరల్ జిల్లా కార్యదర్శి దిడ్డి పార్ధసారథి, ఏఐఎఫ్‌డిఎస్ జిల్లా కార్యదర్శి మొగిళిచర్ల సందీప్, పిడి ఎస్‌యూ డివిజన్ నాయకుడు గుర్రం అజయ్‌లు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల ముందు కేజి నుండి పిజి వరకు ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చిన సిఎం కెసిఆర్ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. కళాశాలల్లో మధ్యాహ్నా భోజన పథకాన్ని అమలు చేయకపోవటం సరి కాదన్నారు. ప్రైవే ట్ పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించటంలో ప్రభుత్వం పూర్తి గా విఫలం అయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యారంగ విధానాలను పూర్తిగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించారు. ఇప్పకైటినా అధిక ఫీజులను నియంత్రించి, విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో ఆయా సంఘా ల నాయకులు నరేష్, సతీష్, కళ్యాణ్, గణేష్, శివకుమార్, ప్రవీణ్, నాగరాజు, మధుకర్, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
రుణాల మంజూరులో జాప్యం వద్దు
జనగామ టౌన్, జూలై 21: రైతులకు రుణాల మంజూరి విషయంలో ఏమాత్రం జాప్యం చేయవద్దని జనగామ కలెక్టర్ శ్రీదేవసేన బ్యాంకు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జనగామ కలెక్టర్ కార్యాలయంలో లిడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో వివిధ బ్యాంక్ అధికారులతో పాటు వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీదేవసేన మాట్లాడుతూ రైతులకు పలు బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నట్లు సమాచారం వస్తుందని ఇకనుండి ఏమాత్రం జాప్యం చేయవద్దని కోరారు. రుణాల కోసం బ్యాంకులకు వచ్చే రైతులతో మర్యాదపూర్వకంగా సమాదానం చెప్పేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వ్యవసాయ సీజన్‌లోనే అప్పులు ఇస్తే రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. సీజన్ దాటిన అనంతరం రుణాలు ఇస్తే దుర్వినియోగం అయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. వ్యవసాయ, బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు సహకరించాలని అన్నారు. ప్రభుత్వం స్వయం ఉపాధికోసం నిరుద్యోగ యువతి యువకుల కోసం అమలు చేస్తున్న స్కీమ్‌ల ద్వారా రాయితీలిస్తు వారిని ప్రోత్సహించాలన్నారు. మంజూరైన మూనిట్లను వెంటనే గ్రౌండింగ్ చేయాలని కోరారు. మహిళా పొదుపు సంఘాల కోసం ఇస్తున్న రుణాలను సభ్యులు ఏవిధంగా సద్వినియోగం చేసుకుంటున్నారో పర్యావేక్షిస్తూ రికవరి కోసం కృషి చేయాలని అన్నారు. లిడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 32వేల మంది రైతులకు రూ. 390కోట్ల రుణాలు రెన్యూవల్ చేశామని అలాగే రూ. 75కోట్లు మూడువేల మంది రైతులకు కొత్తరుణాలు మంజూరి చేసినట్లు తెలిపారు.
సమావేశంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వీరునాయక్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జయచంద్రారెడ్డితో పాటు వివిధ బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
నర్సంపేటలోనే.. రూరల్ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
నర్సంపేట, జూలై 21: వరంగల్ రూరల్ జిల్లా కేంద్రాన్ని నర్సంపేట పట్టణంలోనే ఏర్పాటు చేయాలని జెఎసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు అంబటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నర్సంపేటలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అంబటి శ్రీనివాస్ మాట్లాడారు. రూరల్ జిల్లా కేంద్రం ఏర్పాటు విషయంలో గత రెండు రోజులుగా వస్తున్న వార్తలు నర్సంపేట ప్రాంత వాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పారు. మొగిళిచర్ల ప్రాంతంలో రూరల్ జిల్లా కేంద్రం ఏర్పాటు ప్రతిపాదన పూర్తి అప్రజాస్వామికమని అన్నారు. నర్సంపేటలో రూరల్ జిల్లా కేంద్రం ఏర్పాటు సాధ్యం కాని పక్షంలో వరంగల్ నుండి నర్సంపేట మార్గంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలా కాకపోతే పోరుబాట తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇదే సమయంలో స్థానిక శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి రూరల్ జిల్లా కేంద్రాన్ని నర్సంపేటలోనే ఏర్పాటు చేసే దిశగా అసెంబ్లీలో మాట్లాడకపోవడం సరి కాదన్నారు. ఎమ్మెల్యే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే దొంతి నర్సంపేటలోనే రూరల్ జిల్లా కోసం ఉద్యమించాలని కోరారు. అదే విధంగా అధికార పార్టీ నాయకులు సైతం నర్సంపేటలో రూరల్ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా కృషి చేయాలని అన్నారు. లేకపోతే అన్ని వర్గాల ప్రజలను సమీకరించి ఆందోళనా కార్యక్రమాలను చేపడతామని స్పష్టం చేశారు. సమావేశంలో జెఎసి నాయకులు గంగిడి సాంబిరెడ్డి, బొనగాని రవీందర్, ఎండి.మహబూబ్‌అలీ, సోల్లి సాయికుమార్, షేక్ జావీద్, అంబటి వంశీ, రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
కనీస వేతనం ప్రకటించకుండా..కాలయాపన చేస్తున్న ప్రభుత్వం
పరకాల, జూలై 21: కార్మికులకు కనీస వేతనం ప్రకటించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి కెవి రాధకృష్ణ అన్నారు. శుక్రవారం బిఎంఎస్ వరంగల్ రూరల్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం పరకాలలో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి అడగాని జనార్థన్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కెవి రాధకృష్ణ హాజరైన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడిచిన ప్రైవేట్ వాణిజ్య వ్యాపార సంస్థలో, అసంఘటిత రంగంలో భవన నిర్మాణ కార్మికులు, హమాలి, షాప్ గుమస్తాలు మార్కెట్‌లో వేలాది మంది పని చేస్తున్నారని చెప్పారు. కనీస వేతనం రూ. 12వేలు ప్రకటించినప్పటికి అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ప్రభుత్వం కార్మికులకు ద్రోహం చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఈనెల 23న బిఎంఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో భవన నిర్మాణ రాష్ట్ర సహయ కార్యదర్శి పల్లెబోయిన ఓదెలు, కిరాణం గుమస్తా సంఘం అధ్యక్షులు చేరుకు వేణు, మోతె సారంగపాణి, చందనాల శేఖర్, శాంతికుమార్, సుదర్శన్, బత్తుల విష్ణుమూర్తి , తదితరులు పాల్గొన్నారు.
హరితహారంలో ఎవరికివారే..!
కేసముద్రం, జులై 21: మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా పట్ల అనుచిత ప్రవర్తన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడం, అప్పట్నించి వారిరువురు ఎడముఖం..పెడముఖంగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో శుక్రవారం కేసముద్రం మండలంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎవరికివారు వేర్వేరుగా పాల్గొనడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్ కేసముద్రం (స్టే) ఎస్సీ హాస్టల్, వెంకటగిరి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఇదే సమయంలో ఇనుగుర్తిలో ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఒకే రోజు దాదాపు ఒకే సమయంలో అటు కలెక్టర్, ఇటు ఎమ్మెల్యే పర్యటనకు రావడంతో అధికారులకు సంకటంగా మారింది.
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి
నర్సంపేట, జూలై 21: రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం - భధ్రాద్రి జిల్లా నుండి చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ కొత్తకొండ శ్రీలక్ష్మీ చేపట్టిన పాదయాత్ర శుక్రవారం ఉదయం నర్సంపేటకు చేరుకుంది. నర్సంపేట పట్టణంలోని సర్వాపుంర శివారులో రజకులు శ్రీలక్ష్మీ పాదయాత్రకు ఘనస్వాగతం పలికారు. అనంతరం నర్సంపేట పట్టణంలో రజకులు ప్రదర్శన నిర్వహించారు. జయలక్ష్మీ సెంటర్ వద్ద చాకలి అయిలమ్మ విగ్రహానికి శ్రీలక్ష్మీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీలక్ష్మీ పాదయాత్రకు జెఎసి, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈసందర్భంగా శ్రీలక్ష్మీ మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల మంది రజకులు ఉన్నారని, అయితే జీవన విధానం మాత్రం దుర్భరంగా మారిందన్నారు. దేశంలోని 18 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారని చెప్పారు. జెఎసి నేతలు అంబటి శ్రీనివాస్, గంగిడి సాంబిరెడ్డి, సోల్తి సాయికుమార్, బొనగాని రవీందర్, షేక్ జావీద్, మహబూబ్‌అలీ, టివివి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జగదీశ్వర్, రజక సంఘం నాయకులు పుట్టపాక కుమారస్వామి, కొల్లూరి లక్ష్మీనారాయణ, రాయారాకుల సారంగం, పొదిల రాంచందర్, కొల్లూరి శ్రీనివాస్, వైనాల అశోక్, రాయారాకుల శ్రీనివాస్, గాదె భద్రయ్య, సాంబరాతి మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి డిమాండ్
కేసముద్రం, జులై 21: మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు తక్షణం చర్యలు తీసుకోవాలని సిపిఎం మహబూబాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యుడు గునిగంటి రాజన్న డిమాండ్ చేశా రు. శుక్రవారం ఆ పార్టీ మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండలంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు మూడెకరాల భూమి పథకం ఒక్క గ్రామంలో అది కూడా అసంపూర్తిగా నిర్వహించారని, మిగిలిన గ్రామాల్లో అమలు చేయాలన్నారు. అటవి హక్కుల చట్టం ప్రకారం 2005కు ముందు నుంచి సాగులో ఉన్న పోడుదారులకు హక్కు పత్రాలిచ్చి బ్యాంక్ రుణాలు, విత్తనాలు, ఎరువులు, యంత్రపరికరాలు అందించాలన్నారు. సమావేశంలో ఆ పార్టీ మండల కార్యదర్శి మార్తినేని పాపారావు, కావటి నర్సయ్య, మొగిలి, బొబ్బాల యాకూబ్‌రెడ్డి, తాడబోయిన శ్రీశైలం, సోమారపు ఎల్లయ్య పాల్గొన్నారు.
రూటు మార్చిన ఎమ్మెల్యే శంకరన్న
మహబూబాబాద్, జూలై 21: ఎప్పుడు ఏదో ఒక వివాదాల్లో చిక్కుకునే మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ రూటు మార్చారు. ఎమ్మెల్యే అయిన అ తరువాత మొదటిసారిగా మానుకోట పట్టణంలోని దళిత కాలనీలలో ఆకస్మిక పర్యటనకు శ్రీకా రం చుట్టారు. శుక్రవారం పట్టణంలోని దళిత కాలనీలో పర్యటించి నేరుగా ప్రజల ముందుకు వెళ్లారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి సమస్యలపై ఆరా తీసారు. ప్రజలను నుంచి వివిధ సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారులకు అక్కడి నుంచే నేరుగా ఫోన్ ద్వారా ఎకరవుపెట్టారు. దళిత కాలనీలలో పర్యటించిన ఎమ్మెల్యే కాలనీలోని ఒక ఇంట్లో భోజనం చేసారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే నేరుగా ప్రజల వద్దకు వెళుతున్నానన్నారు.
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అనే విషయాన్ని స్వయంగా వారిని అడిగి తెలుసుకున్నానన్నారు. కొన్ని సమస్యలను తక్షణమే అధికారులతో మాట్లాడి పరిష్కరించానని తెలిపారు.