తూర్పుగోదావరి

అన్ని ప్రాంతాలకు సాగు నీరందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 21: జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో జలవనరుల శాఖ సమన్వయంతో అన్ని ప్రాంతాలకు సాగు నీరందించి పంటలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయి మిశ్రా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని వ్యవసాయాధికారులతో సమావేశాన్ని నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లడుతూ స్లూయిజ్‌లు మరమ్మత్తులు కాని కారణంగా సాగునీటికి ఆటంకం వస్తుందని ఈ విషయమై వ్యవసాయ శాఖ, జలవనరుల శాఖ సమన్వయంతో సాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. జిల్లాలో డెల్టా ప్రాంతంలో సాగునీటిని ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే విడుదల చేసినందు వల్ల వరినాట్లను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. దీని ద్వారా అక్టోబర్, నవంబర్ నెలాఖరు వచ్చే తుపాన్ల నుండి పంటలను కాపాడుకోవచ్చన్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 2.32 లక్షల హెక్టార్లలో వరినాట్లను వేయాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 74 వేల 437 హెక్టార్లలో నాట్లను వేశామని చెప్పారు. అలాగే మెట్ట, ఏజెన్సీ మండలాల్లో వచ్చే అగస్ట్ నాటికి వరినాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ చెప్పారు. నేరుగా విత్తనాలు జల్లడం ద్వారా వరిసాగును ప్రోత్సహించాలని, ఖరీఫ్‌లో 52 వేల హెక్టార్లలో ఈ విధానం ద్వారా వరిసాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 33 వేల హెక్టార్లలో విత్తనాలు వేసినట్లు కలెక్టర్ చెప్పారు. భూములకు పోషక విలువలను పెంచేందుకు జింక్, సల్ఫర్, జిప్సమ్, బోరాన్‌లను వేగంగా చేయాలన్నారు. జిల్లాలో 1235 మెట్రిక్ టన్నుల మెక్రో న్యూట్రియంట్స్ పంపిణీకి 757 క్వింటాళ్ళను పంపిణీ చేసినట్లు చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 30 కోట్లతో వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేస్తామన్నారు. ఈ సీజనల్లో 48 వేల హెక్టార్లలో కందిపంటను ప్రోత్సహించటానికి 4800 క్వింటాళ్ళ కంది విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో లక్ష రైతులకు రుణ సౌకర్యం కల్పించాలని లక్ష్యాన్ని పెట్టుకోగా 25, 385 రైతులకు 60 కోట్ల మేర రుణ సౌకర్యం కల్పించారని దానిని రైతులకు అందేలా వ్యవసాయాధికారులు కృషి చేయాలన్నారు. రుణ అర్హత కలిగిన 35 వేల మంది రైతులకు 104 కోట్ల మేర రుణ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ జెడి కెవిఎస్ ప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయ ధృవపత్రాల అధారంగా రైతులకు రుణాలను అందించటంలో జిల్లా ప్రధమ స్ధానంలోను, రుణ సౌకర్యాలలో రెండో స్ధానంలో ఉందన్నారు. జిల్లాలో ఖరీఫ్‌కు వర్షాలు అనుకూలంగా ఉన్నాయని, సాధారణ వర్షపాతం కన్నా 25 శాతం అధిక వర్షపాతం నమోదయిందన్నారు. ఈ సమావేశంలో జెసి-2 జె రాధాకృష్ణమూర్తి, జిల్లాలోన వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

‘బెల్టు’ పూర్తిగా తీసేశాం..
కాకినాడ సిటీ, జూలై 21: రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నూతన మద్యం పాలసీ నిర్ణయం మేరకు జిల్లాలో ఉన్న బెల్ట్‌షాపులను పూర్తిగా తొలగించినట్లు జిల్లా ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ బి అరుణరావు ప్రకటించారు. స్థానిక ఎక్సైజ్ శాఖ సూపరిండెంటెండ్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అరుణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 1నుండి ప్రకటించిన నూతన మద్యం పాలసీకి ముందునుండే జిల్లాలో మే 25వ తేదీ నుండి బెల్ట్‌షాపులు తొలగించడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. నూతన మద్యం పాలసీకి ముందే జిల్లా వ్యాప్తంగా బెల్ట్‌షాపులను నిర్వహిస్తున్న వారిపై దాడులు నిర్వహించి 18 కేసులను నమోదుచేసి 105మందిని అరెస్టుచేయడమే కాకుండా 795లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. జూలై 1వ తేదీ నుండి అమలులోకి వచ్చిన నూతన మద్యం పాలసీకి అనుగుణంగా ఎక్సైజ్‌శాఖ అప్రమత్తమై నిన్నటి వరకు వివిధ ప్రాంతాల్లో దాడులుచేసి 25బెల్ట్‌షాపులను మూసివేయించడమే కాకుండా 25మందిపై కేసులు నమోదుచేసి 142లీటర్ల మద్యం, 30లీటర్ల బీర్‌ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. మద్యాన్ని బహిరంగా సేవిస్తే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. మద్యం షాపుల నిర్వాహకులు ఎవరైనా అక్రమ బెల్ట్ షాపులకు మద్యాన్ని సరఫరాచేసినట్లు తెలిస్తే ఆయా షాపులను సస్పెండ్ చేస్తున్నామని, ఈవిధంగా రాజమండ్రిలో ఒకటి, పెద్దాపురంలో 3షాపులను సస్పెండ్ చేసినట్లు డిసి అరుణరావు తెలిపారు. 2017 జూలై 1నుండి అమలులోకి వచ్చిన నూతన మద్యం విధానం మేరకు జిల్లాలో 534మద్యం షాపులకు, 42బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతులు ఇచ్చామన్నారు. గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా 434మద్యం షాపులు ఏర్పాటయినట్లు తెలియజేశారు. అయితే మద్యం షాపులను లైసెన్స్‌దారులు ఏర్పాటుచేసే విషయంలో ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకత కారణంగా ఇంకా వంద షాపులు పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. జాతీయ రహదారులకు ఐదువందల మీటర్లకు దూరంగా మద్యం షాపులు ఏర్పాటుచేయాల్సి ఉన్న కారణంగా మద్యం షాపుల లైసెన్స్ పొందిన వారు షాపులను ఏర్పాటుచేసే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారులో కొందరు బెల్ట్‌షాపులకు మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కడియం, ఏడిద, జి మేడపాడు తదతర కొన్ని ప్రాంతాల్లో మద్యం షాపుల ఏర్పాటుచేసి విషయంలో స్థానికుల నుండి వ్యతిరేకత వస్తోందని తెలిపారు. మద్యం అమ్మకాలపై ప్రభుత్వం నుండి ఎక్సైజ్ శాఖపై ఎటువంటి ఒత్తిడిలు లేవని, అదే విధంగా టార్గెట్‌లు లేవని స్పష్టం చేశారు. నార్కొటిక్స్ డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను అరికట్టే విషయంలో అన్ని ప్రభుత్వ శాఖలపై సమిష్టి బాధ్యత ఉందని, తమ శాఖ సైతం వివిధ ప్రాంతాల్లో దాడులను నిర్వహిస్తు డ్రగ్స్, గంజాయిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ కమీషనర్ అరుణరావు తెలియజేశారు. ఈవిలేకరుల సమావేశంలో అసిస్టెంట్ కమీషనర్ కె హేమంతనాగరాజు, సూపరిండెంటెండ్ పి రామచంద్రరావులు పాల్గొన్నారు.

రావులపాలెంలో బలగాల మోహరింపు
రావులపాలెం, జూలై 21: కాపులకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండుతో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 26నుంచి చేపట్టనున్న చావోరేవో పాదయాత్ర నేపథ్యంలో కోనసీమ ముఖ ద్వారం రావులపాలెంలో మళ్లీ పోలీసు బలగాలు మోహరిస్తున్నాయి. గతంలో రావులపాలెం నుంచి పాదయాత్ర చేస్తానని ముద్రగడ ప్రకటించిన రెండుసార్లు వేలాది మంది పోలీసులు మొహరించారు. డిఐజి, ఎస్పీ స్థాయి అధికారులు ఇక్కడినుంచే పరిస్థితులను పర్యవేక్షించారు. అయితే ఈసారి ముద్రగడ పాదయాత్ర కిర్లంపూడికి మార్చడంతో పరిస్థితి ఆ స్థాయిలో లేనప్పటికీ ముందు జాగ్రత్తగా పోలీసు బలగాల మోహరింపు జరుగుతోంది. శుక్రవారం సాయంత్రానికి అనంతపురం ఎపిఎస్పీ 14వ బెటాలియన్‌కు చెందిన సుమారు 50మంది పోలీసులు రావులపాలెం చేరుకున్నారు. ఎస్సై సిహెచ్ విద్యాసాగర్ జాతీయ రహదారిపై అదనపు బలగాలతో కలిసి కవాతు నిర్వహించారు. స్థానిక కళా వెంకట్రావు సెంటర్‌తోపాటు మండలంలోని వివిధ జాతీయ రహదారి కూడళ్లపై అదనపు బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి. 30 పోలీసు యాక్టుతోపాటు 144 సెక్షన్ అమల్లో ఉన్నందున అనుమతుల్లేకుండా ఎటువంటి ర్యాలీలు, పాదయాత్రలు చేపట్టరాదని, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు.

లంక భూముల్లోకి వరద నీరు
అయినవిల్లి, జూలై 21: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పొంగి ప్రవహించడంతో దిగువ ప్రాంతాలకు నీరు విడుదల చేస్తున్నారు. దీనితో లంక గ్రామాలకు వరదనీరు పోటెత్తుతోంది. అయినవిల్లి మండలంలో అయినవిల్లిలంక, వీరవల్లిపాలెం, కఠారిలంక గ్రామాల్లో వరదనీరు అరటి తోటల్లోకి పోటెత్తుతోంది. దీంతో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ధవళేశ్వరం ఆయకట్టు నుండి సముద్రంలోకి లక్ష ల క్యూసెక్కుల నీరు విడిచిపెట్టడంతో ముక్తేశ్వరం తొగరపాయరేవులోగల పాత వంతెన పైకంటూ వరద నీరు ప్రవహిస్తోంది. కోటిపల్లి రేవులో కాలిబాట వంతెన పూర్తిగా వరదనీటిలో మునగడంతో ప్రయాణీకులను ఇంజను బోట్లలో చుట్టూ తిప్పుతూ తీసుకువెళుతున్నారు. 20 నిమిషాల్లో రేవు దాటే ప్రయాణీకులకు 2 గంటలు వ్యవధి పట్టడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు లంక పొలాల్లో అరటితోటలు వరదనీటిలో చిక్కుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుండి నీరు అధికంగా సముద్రంలోకి వదిలితే లంక గ్రామాలకు వరద ప్రమాదం ఎక్కువగా ఉంటుందని లంక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ముఖ్యమంత్రి వస్తున్నారని గుడిసెలు కూల్చేశారు
రాజమహేంద్రవరం, జూలై 21: సీతానగరం మండలంలో పురుషోత్తపట్నం పంపుహౌస్ నిర్మాణానికి సమీపంలో గోదావరి గట్టుపై ఉన్న గుడిసెలను అధికార్లు తొలగించారు. దాదాపు ముఫ్పై ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటూ చిన్న చిన్న వ్యాపారాలలో బతుకుతున్న గుడిసెలను తొలగించారు. పథకంలో భూములు కోల్పోయిన రైతులు పరిహారం తీసుకుని ఏదో ప్రాంతానికి పోతుంటే, చిన్నచిన్న కాకా హోటళ్లు, వివిధ చిరు వ్యాపారాలతో ఏళ్ల తరబడి ఆ ప్రాంతానే్న నమ్ముకుని జీవిస్తున్నవారిని ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్పి అధికారులు హడావిడి చేసి గుడిసెలను కూల్చేశారు. ఎత్తిపోతల పథకం పేరుతో పురుషోత్తపట్నం జంక్షన్ మరింత అభివృద్ధి చెంది తమ వ్యాపారాలు బాగుంటాయని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న చిరు వ్యాపారాల గుడిసె వాసులకు ఏకంగా నిలువ నీడే కోల్పోయే పరిస్థితి రావడంతో తీవ్ర ఆందోళనలో పడ్డారు. పిడబ్ల్యుడి స్థలం కాబట్టి ఆక్రమణలను తొలగించామని అధికారులు పోలీసులతో వచ్చి అప్పటికప్పుడు దౌర్జన్యంగా తమ గుడిసెలను కూల్చేశారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏటిగట్టుపై ఏళ్ల తరబడి తలదాచుకున్న గుడిసెలపై ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్పి ఖాళీ చేయించేందుకు అధికారులు హడావిడి చేసి ఆనక కూల్చేశారు. కనీస స్థాయి ప్రత్యామ్నాయం చూపించకుండా గుడిసెలను తొలగించడంతో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. మొత్తం 26 గుడిసెలను ఇక్కడ తొలగించారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలతో కుటుంబాన్ని పోషించుకుంటోన్న వీళ్లంతా ఇపుడు ఉపాధి పోయి నిలువ నీడ లేకుండా రోడ్డున పడ్డారు.

త్వరలో రెవెన్యూ సమాచార కేంద్రాలు
పెద్దాపురం, జూలై 21: జిల్లాలో రెవెన్యూ సేవలను విస్తృత పరిచేందుకు, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు త్వరలో రెవెన్యూ సమాచార కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్టు జిల్లా సంయుక్త కలెక్టర్ ఎ మల్లికార్జున్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో విశే్వశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటుచేసిన డివిజన్ స్థాయి రెవెన్యూ అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే అన్ని రకాల సేవలు ప్రజలకు త్వరితగతిన చేరేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన రికార్డుల నిర్వహణ అత్యంత పారదర్శకంగా ఉండాలన్నారు. స్పష్టతతో కూడిన రికార్డుల నిర్వహణ ద్వారా సమస్యల పరిష్కార మార్గాలను వేగవంతం చేయాలన్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో తక్షణం రెవెన్యూ సమాచార కేంద్రాలను ప్రారంభించాలని ఆయన తహసీల్దార్లను ఆదేశించారు. సమాచార కేంద్రాల నిర్వహణకు నియమించే సిబ్బందికి రెవెన్యూ శాఖపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాలు, రేషన్ కార్డులు, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఆపద్బంధు పథకం, ఎన్‌ఎఫ్‌బిఎస్ సంబంధిత పత్రాల జారీలో అలసత్వం వహించకుండా త్వరితగతిన పత్రాల జారీ ప్రక్రియ చేపట్టాలన్నారు. డివిజన్ పరిధిలో నీటి తీరువా పన్నుల వసూళ్లు మందకొడిగా సాగుతున్నాయని, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు విఆర్వోలకు టార్గెట్లు నిర్ధారించి వసూళ్లు వేగవంతం చేయాలన్నారు. ప్రతి వారం ప్రజావాణిలో వచ్చే అర్జీలను పరిశీలించి రెవెన్యూ సంబంధిత సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలన్నారు. భూ సంబంధ, సర్వే సమస్యల పరిష్కారానికి సర్వే సిబ్బంది తక్షణం స్పందించాలన్నారు. జిల్లా ప్రజావాణికి అర్జీలు పదేపదే వస్తే సంబంధిత మండల అధికారులపై చర్యలు తప్పవన్నారు. అనంతరం ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంపై మండలాల వారీగా ఆయన సమీక్ష నిర్వహించారు. నిర్ధిష్ట గడువులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. డివిజన్ పరిధిలో విఆర్వోలకు భవనాలు, శిథిలస్థితిలో ఉన్న తహసీల్దార్ కార్యాలయాల స్థితిగతులపై ఆయన సమీక్షించారు. రేషన్ షాపులను తహసీల్దార్లు తరచుగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అనంతరం శాఖల వారీ సమీక్షలు చేపట్టి, అధికారుల నుండి సమాచారాన్ని సేకరించారు. ప్రభుత్వ పథకాల అమలులో అలసత్వం లేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలన్నారు. సమావేశంలో డివిజన్‌లోని తహసీల్దార్లు, సర్వేయర్లు, పౌర సరఫరాశాఖ అధికారులు, ఆర్‌ఐలు, విఆర్వోలు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.