మంచి మాట

జీవన పథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివునికి, విష్ణువునకు అభేదభావాన్ని చాటి చెప్పేదే హరిహరతత్త్వం.
‘‘శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే
శివస్య హృదయ విష్ణుః విష్ణ్చోశ్చ హృదయం శివః’
విష్ణురూపమే శివుడు. శివరూపమే విష్ణువు. ఒకరి హృదయం ఇంకొకరు. ఇద్దరూ ఒకటే అయిన రూపమే ‘హరిహరుడు’.
అసలు భగవంతునికి రూపం లేదు. నామం లేదు. నిరాకారుడు నిర్గుణుడు అయన దైవానికి మనిషి తన సౌకర్యం కోసం తన వెసలుబాటు కోసం తన ఏకాగ్రత కోసం రూపాన్ని నామాన్ని పెట్టుకున్నాడు.
దైవం అనేది ఒక్కడే. శివనామాన్ని పఠించినా, విష్ణునామాన్ని పఠించినా ఫలితం ఒక్కటే వస్తుంధి. కాని స్వార్థపరులు కొందరు భగవంతుని పేరుచెప్పి తరతమభేదాలు సృష్టించారు. వాటిని విడనాడి మనసుకిష్టమైన నామంతో రూపంతో ఎవరు ధ్యానంచేసినా, ఎవరు స్తుతించినా ఆర్తితో పిలిచినవారికి దైవం పలుకుతాడు.
శివుడు రాముని ధ్యానం చేస్తుంటాడని రాముడు శివధ్యానం చేస్తుంటాడని చదువుతుంటాం. వారికి లేని బాధ ఇక్కడ నశ్వరమైన బతుకులుబతికే మనుష్యులు మిడి మిడి జ్ఞానంతో వీరిలో వీరు కలహించుకుంటున్నారు. కాని దైవం మాత్రంఒక్కడే. ఆయన కు రూపనామాలు లేవు. నీవు ఏరూపంలో కోరుకుంటే ఆ రూపంలో భగవంతుడు వ్యక్తమవుతాడు.
మనిషే దేవుడని పశువుల్లోను, చెట్టు చేమల్లోను దైవాంశ ఉందని చెప్పేభారతీయాన్ని సరిగా అర్థం చేసుకుంటే వారు చేసే ఆచార సంప్రదాయాలు వీటినే వెల్లడిస్తాయ. విషసర్పాలను పూజించడం, చెట్లను పూజించడం అనేది అనాది కాలం నుంచి వస్తున్నదే. ద్వాపరయుగంలోను కృష్ణుడు గోవర్థనగిరికి పూజలు చేయంచాడు. ఆవులను పాలించి అవే మనుష్యులకు సంపదనిస్తాయని గోవిశిష్టతను తెలుసుకొనమని ఎన్నోవిధాలు చెప్పాడు.
తాను కేవలం మనిషినన్న విషయాన్ని ఘంటాపథంగా చెప్పిన రాముడు మానవుడే మహనీయునిగా మారాలి అంటే ధర్మజీవనుడు కావాలని అన్నాడు. సత్యమే ధర్మమే మనిషికి ఆలంబనాలు కావాలి అని చెప్పాడు. కలసి ఉంటే కలదు సుఖం అని చెప్పడానికి తన సోదరులతో తాను కలసి ఉన్నాడు. వారికేమి కావాలో దానే్న ఆయన చేయడానికి సుముఖతను వెల్లడించడానికి కారణం నలుగురు బాగుండాలన్న ధోరణిని పెంచడానికే.
రాముని సోదరుడు లక్ష్మణుడు సేవాభావంలో ఎంత ఆనందముందో చెప్పడానికి రామునితో కూడా అడగకుండానే అడవికి వెళ్లాడు. ఆంజనేయుడు సేవాకైంకర్యంలో ఎంత ఆనందముందో ఎంత తృప్తి ఉందో చెప్పడానికి రామదాసుగా మారాడు. శ్రీరామ అన్న పదం తప్ప మరొకటి తెలియదన్నాడు. రామభజన ఎక్కడ ఉంటే తాను అక్కడే అన్నాడు.
ఇక భరతడు వీరందరికన్నా మిన్న.తనది కాని దాన్ని ఇచ్చినా తీసుకోకపోవడంలో ఎంత నిర్మలత్వం ఉందో ఎంత దృఢసంకల్పం ఉండాలో నేర్పించాడు. పరుల సొమ్ము పాపంగా ఎంచితే ఎన్నిసుఖాలు వాటంతట అవి కీర్తికారకాలుగామారుతాయో చెప్పడానికి తానే ఉదాహరణగా మారాడు. రాముడు 14 ఏండ్లు వనవాసం చేస్తే అనే్నండ్లు తాను కూడా నారచీరలుకట్టి నందిగ్రామంలో ఉండిపోయాడు. సింహాసనం ఎదురుగా ఉంచి దానిపై రామపాదుకలు ఉంచి వాటికి జరిగినవి నివేదిస్తూ రాజ్యపాలనను చేశాడు. ఇంతటి ధీరోదాత్తులు ఉంటారా అన్న ముల్లోకాలు ముక్కున వేలేసుకునేట్టుజీవించిన ధీర శిఖామణి భరతన్న.
సీతమ్మ తనకు ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ఎన్నిఆటంకాలు ఎదురైనా తాను ఎన్నుకొన్న జీవనపథాన్ని వదలలేదు. రామునితో ఏడుడగులు వేసి దాంపత్య ధర్మాన్ని ఆచరిస్తానని అగ్నిసాక్షిగా చెప్పిన సీతమ్మ తుదవరకు ఎన్ని కష్టాలు వచ్చినా చివరకు రాముడే అరణ్యవాసానికి పంపినా తాను ఆచరిస్తానని చెప్పిన మాటకు కట్టుబడి ఉంది. అందువల్ల కలియుగంలోను సీతారాముళ్లలాగా కలసి జీవించండి అన్న దీవనకు మూలకారకులయ్యారు వారు.

- చోడిశెట్టి శ్రీనివాసులు