నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. దేవ బ్రాహ్మణులకు నా
నావిధ పూజనలఁ దర్పణము సేసి ధరి
త్రీవనిత కపూర్వ శ్రీఁ
గావింపఁ దొడంగె మయుఁడు గడు రమ్యముగన్
భావం; శ్రీకృష్ణుడికి చెప్పినట్లుగా మయుడు సభాభవనాన్ని నిర్మించడానికి వీలుగా పూర్వం వృషపర్వుడనే రాజుకోసం నిర్మించదలచి సేకరించిన సామగ్రి అంతా కూడా ఇపుడు ధర్మరాజుకోసం నిర్మించే భవనానికి మయుడు వాడాలని యోచించాడు. అలా నిశ్చయించుకుని వెళ్లిన మయుడు ముందుగా దేవతలను, బ్రాహ్మణులను పూజలతో సంతృప్తిపరిచాడు. భూకాంతకు అందమైన అపూర్వాలంకారంగా సభానిర్మాణానికి పూనుకొన్నాడు.

మహాభారతం లోని పద్యము