వెంటాడే సువర్ణసుందరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాక్షీ చౌదరి, పూరణ్, రామ్ ప్రధాన తారాగణంగా ఎస్ టీమ్ పిక్చ ర్స్ పతాకంపై సూర్య దర్శకత్వంలో ఎం.ఎల్.లక్ష్మి రూపొందిస్తున్న చిత్రం సువర్ణసుందరి. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌లకు మంచి స్పంద న లభిస్తోందని దర్శక నిర్మాతలు తెలియజేస్తున్నారు. దర్శకు డు సూర్య మాట్లాడుతూ- సూపర్ నేచురల్ కథనంతో థ్రిల్లింగ్‌గా ఈ చిత్రం సాగుతుందని, 1509లో జరిగే కథనంతో ప్రారంభమై నేటివరకూ నాలుగు శతాబ్దాలలో జరిగే కథ నం ఇదని తెలిపారు. ఆయా కాలాలను బట్టి వేరు వేరు ప్రాంతాలలో షూటింగ్ చేశామని, బెంగళూరు, హైదరాబాద్, అనంతపూర్, కలకత్తా, కేరళ, బీదర్ తదితర ప్రాంతాల్లో చేసిన షూ టింగ్ ఔట్‌పుట్ బాగా వచ్చిందని తెలిపారు. చరిత్రలో బయటికి రాని, చీకటి కోణాలను ఈ సినిమాలో వైవిధ్యంగా ఆవిష్కరిస్తున్నామని, అలాంటి చీకటి కోణాలు అనేక రకాల జనరేషన్స్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపించింది అన్నదే ప్రధాన కధాంశమని ఆయన తెలిపారు.
ప్రస్తుతం సిజి కార్యక్రమా లు జరుగుతున్నాయని, హై క్వాలిటీ విజువల్స్‌తో రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన వివరించారు. ఇందర్, సాయికుమార్, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ఖాన్, అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎల్లు మహంతి, సంగీతం:సాయికార్తీక్, ఎడిటింగ్: ప్రవీ ణ్ పూడి, దర్శకత్వం:సూర్య.