వైశాఖం సూపర్ హిట్‌తో హ్యాపీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విడుదలైన అన్ని కేంద్రాల్లో వైశాఖం చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రెండు రాష్ట్రాలతోపాటుగా ఓవర్‌సీస్‌లో అత్యధిక థియేటర్‌లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్ టాక్‌తో సాగుతోంది. మంచి సినిమా తీశామని అందరూ మెచ్చుకుంటున్నారు. కొత్త హీరో హీరోయిన్లతో నమ్మకంతో చేశాం2అని నిర్మాత బి.ఎ.రాజు తెలిపారు. ఆర్. జె. సినిమాస్ పతాకంపై హరీశ్, అవంతిక జంటగా జయ.బి దర్శకత్వంలో బి.ఎ.రాజు రూపొందించిన వైశాఖం విడుదలైన సంగతి తెలిసిందే. చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత బి.ఎ. రాజు మరికొన్ని విశేషాలు తెలుపుతూ- మానవీయ విలువలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో వాటిని గుర్తుచేసేలా ఈ చిత్రాన్ని రూపొందించామని, హీరో హరీశ్‌తో మరో సినిమాను ప్రారంభిస్తామన్నారు. వైశాఖం సినిమా విడుదలైన అన్ని కేం ద్రాలలో వౌత్‌టాక్‌తోనే విజయం సాధిస్తోందని, ఈ సినిమా కోసం దాదాపు ఏడాదిపాటు కష్టపడ్డామని, క్లాస్ మాస్ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ చిత్రం రూపొందిందని దర్శకురాలు జయా.బి తెలిపారు. నా నిజ జీవితంలో జరిగిన సంఘటనను ఆధారంగా చేసుకొని ఈ సినిమా చేశానని, మా నాన్నగారు చనిపోయినప్పుడు అప్పటి పరిస్థితులలో నేను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణతో ఈ కథ తయారుచేసుకున్నానని, ఓ కూతురిగా అమ్మకు నచ్చే సినిమా చేసినందుకు గర్వంగా వుందని ఆమె వివరించారు. ఓ మంచి టీమ్‌లో ఈ సినిమా చేసినందుకు హ్యాపీ అని, దర్శక నిర్మాత ప్రోత్సాహంతోనే బాగా నటించే ప్రయత్నం చేశానని హీరో హరీశ్ అన్నారు. ఈ సినిమా తాను ప్రేక్షకులమధ్య కూర్చుని చూశానని, మంచి రెస్పాన్స్ వస్తోందని హీరోయిన్ అవంతిక తెలిపారు. కార్యక్రమంలో కెమెరామెన్ వాలిశెట్టి వెంకట సుబ్బారావు, సంగీత దర్శకుడు డి.జె.వసంత్ పాల్గొని విశేషాలు తెలిపారు.