4న మెరవనున్న నక్షత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీచక్ర మీడి యా, బుట్టబొమ్మ క్రియేషన్స్ పతాకంపై కె.శ్రీనివాసులు, విన్ విన్ విన్ క్రియేషన్స్ పతాకంపై వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా రూపొందించిన చిత్రం నక్షత్రం. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్ పొందింది. దీన్ని ఆగస్టు 4న విడుదల చేయనున్నారు. పోలీస్ అవ్వాలనే ప్రయత్నంలో వున్న ఓ యువకుడి కథనంతో ఈ చిత్రం తెరకెక్కించామని, తమ సంస్థకు, చిత్ర పరిశ్రమకు, వ్యాపార వర్గాలకు, ప్రేక్షకులలో మంచి గుర్తింపు వస్తుందని నిర్మాతలు తెలిపారు. హనుమంతుడి లక్షణాలన్నీ పోలీసులలో కనిపిస్తాయి కనుక మనుషులకంటే భిన్నంగా హీరో కనిపిస్తాడని, హనుమంతుడిలాగే సేవాభావం, శక్తియుక్తులు కనిపిస్తాయని, మన రక్షణ కోసమే ఉన్న పోలీసులను చూసి మనమెందుకు భయపడుతున్నాం అని ప్రశ్నించే చిత్రం ఇదని తెలిపారు. తప్పు చేస్తే, భయపడాలి కానీ ఊరికే ఎందుకు భయపడాలి? అనే విషయాన్ని ఈ చిత్రంలో చర్చించామని వారు తెలిపారు. పోలీసు కంటే ముందు ప్రజలు చూసే కోణం మారాలని ఈ చిత్రం లో చెప్పామని, ఎన్ని విమర్శలు వచ్చినా ఏ సమస్యనైనా చివరికి పోలీసే పరిష్కరిస్తాడని దర్శకుడు కృష్ణవంశీ అన్నారు. అంతర్జాతీయ సమస్యను ఈ చిత్రంలో చర్చించామన్నారు. సందీప్‌కిషన్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్, తులసి, జె.డి.చక్రవర్తి, ప్రకాష్‌రాజ్, శివాజీ రాజా, రఘుబాబు, తనీష్, ముక్తార్‌ఖాన్, సాయికిరణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు:కోటప్రసాద్, సంగీతం:్భమ్స్, పాటలు:అనంత్ శ్రీరామ్, కెమెరా:శ్రీకాంత్ నారోజ్, ఎడిటింగ్:శివ వై.ప్రసాద్, నిర్మాతలు:ఎస్.వేణుగోపాల్, సజ్జు, కె.శ్రీనివాసులు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:కృష్ణవంశి.