ఆటాపోటీ

కాయ్-పిడి.. (పాప్ కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కబడ్డీ అనే పదం ‘కాయ్-పిడి’ అన్న తమిళ పదం నుంచి వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం. ‘కాయ్-పిడి’ అంటే గొలుసుకట్టులా చేతులు పట్టుకోవడం. రైడర్‌ను పట్టుకోవడానికి ఈ విధమైన వ్యూహమే కబడ్డీలో ప్రధానం. దక్షిణ భారతంలోనేగాక, యావత్ భారతదేశంలో ఈ ఆట అనాదిగా ప్రచారంలో ఉంది. దీనిని గురించి తెలియని లేదా ఏదో ఒక సమయంలో ఆడని భారతీయుడు లేడనడం అతిశయోక్తి కాదు. అఖంఢ భారతంలో కబడ్డీ అంతర్భాగమైంది. ప్రస్తుత భారత ఉప ఖండంలో ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. భారత్‌కు గట్టిపోటీనిచ్చే దేశాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముందు వరుసలో ఉండడమే విశేషం. బంగ్లాదేశ్‌లో కబడ్డీ జాతీయ క్రీడ. ఉప ఖండంలో దీనికి విశిష్ట స్థానం ఉందనడానికి ఇదే నిదర్శనం.
మహిళల జోరు
* కబడ్డీని ఒకప్పుడు పురుషులకు మాత్రమే పరిమితమని అనుకునేవారు. కానీ, కాలక్రమేణా ఆ ఆలోచనకు తెరపడుతున్నది. 1995లో మొదటిసారి మన దేశం మహిళల విభాగంలోనూ పోటీలను నిర్వహించింది. ఈ స్ఫూర్తితోనే 2010లో జరిగిన గాంగ్జూ ఏషియాడ్‌లో మహిళల కబడ్డీకి ఒక క్రీడాంశంగా గుర్తింపు లభించింది. గత ఏడాది మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ జరిగింది. తాజాగా ప్రో కబడ్డీలోనూ మహిళల విభాగంలో పోటీలు తెరపైకి వచ్చాయి. పురుషులకు ఏమాత్రం తీసిపోమంటూ అమ్మాయిలు కూడా జోరుగా కబడ్డీ ఆడేస్తున్నారు.
చాలా ఈజీ..
* గ్రామీణ భారతంలో కబడ్డీ విశేష ఆదరణ పొందడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒక గొప్ప వ్యాయామం ఒకటికాగా, ఖర్చు ఏమాత్రం లేకపోవడం రెండోది. కొంచెం ఖాళీ స్థలం.. ఒక విజిల్ ఉంటే చాలు కబడ్డీ ఆడుకోవచ్చు. ఇంతకంటే సులభంగా ఆడగలిగే ఆట ఇంకేముంటుంది? ఒక జట్టులో ఎంత మంది ఉండాలనే నిబంధన కూడా గ్రామాల్లో కనిపించదు. నలుగురు ఒక దగ్గర పోగై కబడ్డీ ఆడుకోవచ్చు. చాలా సింపుల్‌గా కనిపించే జంటిల్ గేమ్ కబడ్డీ.
భారత్ శ్రమ
* కబడ్డీని విశ్వవ్యాపితం చేయడానికి మన దేశం చాలాకాలంగా కృషి చేస్తున్నది. ఎన్నో రీతుల్లో శ్రమిస్తున్నది. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో భారత్ ప్రదర్శించిన కబడ్డీ మ్యాచ్ అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది. కానీ, కబడ్డీకి తగినంత ప్రచారం రాకుండా బ్రిటన్ అడ్డుకుంది. తన వలస దేశాలన్నిటిలోనూ క్రికెట్‌ను పెంచి పోషించడంద్వారా కబడ్డీని అణచివేసింది. చివరికి, కబడ్డీకి పుట్టినిల్లయిన మన దేశం కూడా క్రికెట్ మాయలోపడి కొట్టుకుపోతున్నది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీకి ఆదరణ తగ్గలేదు. వివిధ స్థాయిల్లో పోటీలు, టోర్నీలు జరుగుతూనే ఉన్నాయి.

- సత్య