ఆటాపోటీ

ప్రాచీన క్రీడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కబడ్డీ క్రీడ నిన్నమొన్నటిది కాదు. మన దేశంలో నాలుగువేల సంవత్సరాలకు పూర్వమే దీని ఉనికి ఉందని చారిత్రక ఆధారాలున్నాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఆరంభమైందో తెలియకపోయినా, కురుక్షేత్ర సంగ్రామం సమయంలో అభిమన్యుడు మొట్టమొదటిసారి కబడ్డీని పోలిన క్రీడను కనిపెట్టాడని అంటారు. కాగా, కబడ్డీల్లో ఎన్నో విధానాలున్నాయ. దీనికి ఎన్నో పేర్లు.. కానీ, మూల సూత్రాలు మాత్రం ఒకటే. పురుషుల విభాగంలో 10న13 మీటర్లు, మహిళల విభాగంలో 8న12 మీటర్ల విస్తీర్ణం ఉండే కోర్టులో ఇరు జట్లు తలపడతాయి. ఒక్కో జట్టులో ఏడుగురు సభ్యులుంటారు. ప్రత్యామ్నాయం కోసం ముగ్గురు క్రీడాకారులను రిజర్వ్‌లో ఉంచుతారు. మధ్యలో ఊపిరి తీసుకోకుండా ‘కబడ్డీ.. కబడ్డీ’ అని కూతపెడుతూ వెళ్లే రైడర్ ప్రత్యర్థులకు చిక్కకుండా విజయవంతంగా వెనక్కు రావాలి. తిరిగి తమ కోర్టుకు చేరే క్రమంలో ఎంతమందిని అతను ముట్టుకుంటాడో అంతమంది తాత్కాలికంగా అవుటవుతారు. తమ జట్టుకు పాయింట్లు లభించినప్పుడు వారికి మళ్లీ మ్యాచ్‌లో ఆడే అవకాశం లభిస్తుంది. మొత్తం 45 నిమిషాల మ్యాచ్ ప్రథమార్ధంలో 20, ద్వితీయార్ధంలో 20 నిమిషాల ఆట కొనసాగుతుంది. మధ్యలో ఐదు నిమిషాల విరామాన్ని ఇస్తారు. ఏ జట్టు ఆటగాళ్లంతా అవుటవుతారో లేదా ఎప్పుడు నిర్ణీత సమయం ముగుస్తుందో అప్పటికి ఎక్కువ పాయింట్లు సంపాదించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ విధానంలోనే అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక రకంగా శతాబ్దాలుగా కబడ్డీ అనుసరిస్తూ వస్తున్న మూల సూత్రాలు కూడా ఇవే. అయితే, కొన్నికొన్ని మార్పులతో ప్రాంతీయ స్థాయిలో మ్యాచ్‌లు ఆడుతుంటారు. సంజీవని, జెమినీ, అమర్, పంజాబీ వంటివి విధానాలు మన దేశంలో అమల్లో ఉన్నాయి. హదుదు (బంగ్లాదేశ్), బైబాలా (మాల్దీవ్స్), చెడుగుడు (ఆంధ్రప్రదేశ్), సడుగుడు (తమిళనాడు) హుతుతు (మహారాష్ట్ర) తదితర పేర్లు వాడుకలో ఉన్నప్పటికీ, నియమనిబంధనలను మాత్రం దాదాపు ఒకటే.