రాజమండ్రి

జాతీయ స్థాయి నాటిక రచనల పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రవాస దేశంలో ఉంటూ తెలుగు ప్రజల

సంస్కృతి, కళలు, తెలుగు నాటక రంగ

వికాసం కోసం ఉద్యమిస్తున్న ‘తెలుగు

కళాసమితి-కువైట్’ జాతీయ స్థాయి నాటిక

రచనల పోటీలు నిర్వహిస్తున్నట్లు

సమన్వయకర్త వైఎస్‌కెఎన్ స్వామి, సంస్థ

నూతన అధ్యక్షుడు వాసు మాగులూరి,

కార్యదర్శి పార్థసారథి ఒక ప్రకటనలో

తెలిపారు. నాటిక రచనల విభాగంలో ప్రథమ

బహుమతిగా రూ. 20వేలు, ద్వితీయ

బహుమతిగా రూ. 15వేలు, తృతీయ

బహుమతిగా రూ. 10వేల నగదు

ఇవ్వనున్నట్లు తెలిపారు. బాలల నాటిక

రచనల విభాగంలో ప్రథమ బహుమతిగా

రూ. 10వేలు, ద్వితీయ బహుమతిగా రూ.

5వేలు అందించనున్నారు. ఈ పోటీల్లో

తెలుగు రాష్ట్రాల రచయితలతో పాటు

దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన తెలుగు

రచయితలైనా పాల్గొనవచ్చు. రచనలు

తెలుగు భాషలో ఉండాలి. ప్రదర్శన

యోగ్యంగా ఉండాలి. సందేశాత్మక, హాస్య

రచనలకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు

తెలిపారు. ఒక రచయిత ఏదోఒక విభాగంలో

ఒక రచననే పంపాలి. నాటిక ప్రదర్శనా

వ్యవధి 45 నుంచి 60 నిముషాల్లోపు, బాలల

నాటికకు 30 నుంచి 45 నిముషాల్లోపు

ఉండాలని తెలిపారు. అనువాదాలు,

అనుసరణలు స్వీకరించబోమన్నారు.

ఇతివృత్తం సమకాలీన సమాజానికి

సంబంధించినదై ఉండాలి. నాటిక ప్రతిపై

ఎక్కడా రచయిత పేరు, చిరునామా

రాయవద్దని, విడిగా ఒక పేపరుపై రాయాలని

సూచించారు. తమ రచనలు వేటికీ

అనుకరణ, అనువాదాలు కాదని,

ఆకాశవాణి, దూరదర్శన్‌లలో రికార్డు

చేసినవి కావని హామీపత్రం జతపరచాలి.

రచన సందేశాత్మకంగా వుంటూ

జనరంజకంగా ప్రదర్శించేలా తెలుగు నాటక

సమాజాల వారికి తోడ్పడాలని వారు

కోరారు. రచనలను ఆగస్టు 25వ తేదీలోపు

‘రాయపాటి ఆశీర్వాదం, ఇంటి నెం. 54-1-6

(జి), 1వ లైన్, నార్త్ రైలుపేట, ఒంగోలు,

ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్- 523001, ఆంధ్రప్రదేశ్’

చిరునామాకు పంపాలి.