రాజమండ్రి

నా జీవన కావ్యనాయిక (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదు దశాబ్దాలకు ఆవల
రెండు పదుల నిండు యవ్వనంలో
నాచేయి పట్టుకొని
ఏడడుగులు నడిచిన దృశ్యం
నా కనుల ఎదుట నిరంతరం
సాక్షాత్కరిస్తూనే ఉంది
నేటికి ఏడు పదులు నిండినా
అంతరంగంలోని
ప్రేమానుభూతులు
చలన రహితమై చెక్కుచెదరలేదు
నువ్వు నాలో సగమై
అర్ధాంగిగా రూపుదాల్చిన తరువాత
భౌతికంగా, మానసికంగా
నాలో మార్పులొచ్చాయిగానీ
నువ్వు మాత్రం
స్థిరమైన చిత్తరువులా
కొండంత ఓర్పుని
హృదయంలో నింపుకొని
దుఃఖసముద్ర కెరటాలు
గుండెతీరాన్ని చేరకుండా
పంటి బిగువున ఆపుకొని
నా ఆగడాలను భరించావు!
ఆదర్శ స్ర్తిమూర్తిగా
అర్ధాంగి పదానికి అర్థమై నిలిచావు
మమతానురాగాలను
మరిచిన బిడ్డలు
రెక్కలొచ్చిన పక్షుల్లా
సుదూర తీరాలకు ఎగిరిపోయారు
ఒంటరితనం మృత్యువులా
వెంటాడుతున్న వేళ
ఈ శాపగ్రస్తుణ్ణి
ప్రేమతో లాలించావు
నీ పట్ల నా తప్పిదాలన్నిటినీ
అమ్మలా మన్నించి
అక్కున చేర్చుకున్నావు
సప్తపదికి అర్థమే తెలియని నువ్వు
ఏడడుగుల బంధానికి భాష్యమై
నా జీవన కావ్యనాయికవై
నా గుండెగుడిలో
దేవతవయ్యావు!
- విడదల సాంబశివరావు,
చిలకలూరిపేట, గుంటూరు జిల్లా.
చరవాణి : 9866400059

కనుదోయి

వేయి వేణువుల
మధుర గానము
నీ నామము
వేయి కనుల వెలిగే
ఉషస్సులా నీ రూపం
నా కనులు మూసి ఉన్నా
నా మది తలుపు తెరిచే ఉంచా
నా తలపులలోనే నిన్ను
కన్నులారా చూశా
నీవు నా ఎదుటే
ఉన్నావని ఊహించా
నిను మెప్పించాలని తపించా!
నీ వేణువు నేనందుకొని
నా తలపులలో
నిన్ను ఉంచుకొని
అందమనే బంధంతో
నిను బంధించాలని ఉన్నా
గానమనే సుమగంధాన్ని
మన బంధానికి అద్దాలని
అనంతమైన మన ప్రణయ
సాగరాన్ని మధించి
అందమైన గానాన్ని
నీకు అందించాలని నా ఆశ
నా ఆశ ఫలించి
మన అనురాగం చిగురించి
నా కనుల ఎదుటకు రావా..
ప్రియా.. ఓ ప్రియా?!
- ఎంఎన్ మల్లీశ్వరి, విజయవాడ.

నేను - నువ్వు

నిశిరాతిరి నేను
కనురెప్పల పరదాలు దాటి
నన్ను వీడిన నిదురమ్మ
పసిపాపల కన్నులకు
పానుపు పరిచిన వేళ
ఒకటొకటిగా కురుస్తున్న
ఆలోచనల చినుకులు
కొన్ని చెమ్మగా.. కొన్ని చురుకుగా
కొన్ని అందంగా..
కొన్ని అమాయకంగా
అంతలో పచ్చికను తడిపేస్తూ
కొమ్మల ఊయలలూగుతూ
మిట్టపల్లాల ఈలలు వేస్తూ
అమాంతం ఆవరించిన చల్లగాలి
ఆలోచనల కట్టలు తెంచుకొని
కళ్ల వృత్తాలు దాటి
చెమ్మగిల్లిన చెంపలు
బయట హోరువాన
మేనంతా హాయి గిలిగింతలు
రేపుతున్న తరుణాన
హఠాత్తుగా మెరిసిన ‘మెరుపు’
నీ రూపు
మనసు పుస్తకాన్ని తెరిచి
ఊహల లేఖిని అందుకొని
కవితాక్షరాలు లిఖించనారంభించా
ఉసిగొలిపే ఊసులతో
ముప్పిరిగొనే శ్వాసలతో
తనువంతా పరవశింపజేస్తూ
నా అక్షరాలకు వీణతంత్రులపై
రాగాలు కడుతూ నువ్వు!
- కె దేవికా రత్నాకర్,
తెనాలి, గుంటూరు జిల్లా.
చరవాణి : 9908706218