విశాఖపట్నం

స్వయంకృతాపరాధం (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ పరిసరాలు నిశ్శబ్దంగా ఉన్నాయి.
తూర్పు నుండి ఉదయించిన సూర్యుని లేత

కిరణాలు ఒంటిని స్పర్శిస్తూ

ఆత్మీయభావనను అందిస్తున్నాయి.
దూరంగా చెట్టు మీద పక్షి తియ్యగా

పాడుతోంది.
తనూజ వౌనంగా ఆ పాటని వింటోంది.
ఆ పాటను చెదరగొడుతూ అంతలోనే

టక్‌టక్‌మంటూ బూట్ల శబ్దం వినిపించింది.
తనూజ ఉలిక్కిపడి బయటికి చూసింది.
సెల్ బయట సెంట్రీ ముందుకు సాగిపోతూ

కనిపించాడు.
రోజూ చూసేదే ఆ దృశ్యం.
అయినా తనూజ ఏరోజుకు ఆరోజు కొత్తగా

ఫీలవుతుంది.
తాను ఇక్కడికి వచ్చి ఎనిమిదేళ్లయిందా

అనిపిస్తుంటుంది ఒక్కోసారి ఆమెకి.
మంచి కుటుంబంలో పుట్టి, బాగా

చదువుకుని, పెడదారి పట్టి జైలు జీవితం

అనుభవిస్తోంది ఆమె. డిగ్రీ చదివిన తనూజ,

కంప్యూటర్ నేర్చుకుంది. భవిష్యత్తును

అందంగా మలుచుకోవాలని ఆశపడుతూనే

కొన్ని తప్పటడుగులు వేసి అగాథంలోకి

జారిపోయింది.
ఆమె చేసిన తప్పులకు గాను జడ్జి పదేళ్ల

జైలు శిక్ష వేశారు.
‘కాదు నాకు ఉరి వేయాలి’ అనుకుంది

తనూజ.
ముద్దుగా పెరిగిన తనూజ కాలేజీలో

చదువుతుండే సమయంలో ప్రేమ్‌కుమార్

అనే యువకుడు ఆమెని అనుక్షణం ఫాలో

అయ్యేవాడు. తరచూ మాట్లాడడం, ఏదో ఒక

వంక కల్పించుకుని గిఫ్ట్స్ కొనివ్వడం

చేసేవాడు. కొన్నాళ్లకు తనూజకి కూడా

అతనంటే ఆసక్తి, అది కాస్త ఆకర్షణగా

మారింది.
అతనిచ్చే గిఫ్టులు తన స్నేహితురాలు

ఇచ్చినట్లు చెప్పేది తనూజ.
ఆమె కవల సోదరుడు తన్మయానంద్‌కి

ఇవన్నీ తెలిసినా ఇంట్లో చెప్పేవాడు కాదు.

బయటికి వెళ్లాక మాత్రం ఆమెని

బెదిరించేవాడు.
అందుకని లంచంగా వాడికి ఏదో ఒకటి

కొనిస్తూ ఉండేది.
తనూజకి ప్రేమ్‌కుమార్ వల్ల మెల్లగా చెడు

వ్యసనాలు అలవాటు కావడం

మొదలయింది. తరచూ అతని బైక్ మీద

ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లేది. అతను

కొనిచ్చే ఐస్‌క్రీంలు తినడం, దాబాల్లో భోజనం

చేయడం అలవాటు చేసుకుంది.
ప్రేమ్‌కుమార్ వల్లే ఆమెకి క్రికెట్ బెట్టింగులు

కూడా అలవాటయ్యాయి. ఆమె బాగా ఉన్న

వారి అమ్మాయి అని తెలిసిన ప్రేమ్‌కుమార్

‘‘మనం క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొందాం.

వెయ్యికి అయిదు వేలు వస్తాయి. ఎంత జస్ట్

వెయ్యి రూపాయలు తీసుకురా’’ అనేవాడు.
అతను చెప్పినట్లే తనూజ ఇంట్లో వాళ్లకి

తెలియకుండా డబ్బు దొరకబుచ్చుకునేది. ఆ

డబ్బును ప్రేమ్‌కుమార్‌కి ఇచ్చేది.
ఇద్దరూ కలసి వెళ్లి క్రికెట్ బెట్టింగ్ ఆడేవారు.

ఎప్పుడో ఒక్కోసారి డబ్బు వచ్చినా

చాలాసార్లు మాత్రం డబ్బు బెట్టింగులో

పోతుండేది.
ఒకసారి తనూజ తన సోదరుడు

తన్మయానంద్‌ని కూడా బెట్టింగుకి

తీసుకెళ్లింది. ఆరోజు బెట్టింగులో వాళ్లు

గెలిచారు.
‘‘మనం గెలిచాం’’ సంతోషంగా అరిచాడు

ప్రేమ్‌కుమార్. ఆ ఆనందంలో అంతా బీర్

తాగారు. భయపడుతూనే తనూజ,

తన్మయానంద్ కూడా ఆ పని చేశారు.

ఇంటికి ఆలస్యంగా వెళ్లి ఎవరికీ

కనిపించకుండా వెళ్లి నిద్రపోయారు.
మర్నాడు తన్మయానంద్ బట్టలు ఉతికే

సమయంలో జేబులు చూస్తే నాలుగు వేల

రూపాయలు వాళ్ల అమ్మమ్మకి దొరికాయి.

‘వీడికి ఇంత డబ్బు ఎక్కడిదబ్బా’

అనుకుంది ఆమె.
అప్పుడే అటుగా వచ్చిన తన్మయానంద్‌ని

నిలదీసింది.
అతను సమాధానం చెప్పలేక

బిక్కచచ్చిపోయాడు.
అది గమనించిన తనూజ ‘‘వాడికి

స్కాలర్‌షిప్ వచ్చింది అమ్మమ్మ. అందుకే

నిన్న ఫ్రెండ్స్ అంతా పార్టీ కూడా

చేసుకున్నాం’’ అంటూ బొంకింది.
నిజమే అనుకుంది అమ్మమ్మ.
పిల్లలు తయారై కాలేజీకి వెళ్లిపోయారు.
సాయంత్రం ప్రేమ్‌కుమార్ తనూజకి ఫోన్

చేశాడు.
‘‘తనూజ మనం సాయంత్రం బెట్టింగుకి

వెళ్లాలి. నువ్వూ, మీ బ్రదర్ ఇద్దరూ రండి.

వచ్చేటప్పుడు పదివేలు తీసుకురండి’’

అన్నాడు.
ఈ విషయం తన్మయానంద్‌కి చెప్పింది

తనూజ.
‘‘అమ్మో నేను రాను. నినే్న అమ్మమ్మకి

దొరికిపోయాం. అయినా ఇలాంటి పనులు

మనకెందుకు? నువ్వు ఆ ప్రేమ్‌కుమార్‌తో

మరీ అంత చనువుగా ఎందుకు

ఉంటున్నావు? బీర్లు తాగడం అవీ

మనకొద్దు. వాడితో ఫ్రెండ్ షిప్ కట్ చేసెయ్’’

అన్నాడు.
‘‘పిరికివాడిలా మాట్లాడకు. కాలేజీ లైఫ్‌లో

ఇవే ఎంజాయ్‌మెంట్లు. ఈరోజు అక్క పెళ్లికి

బంగారం, బట్టలు కొనడానికి అమ్మానాన్న,

అమ్మమ్మ అంతా షాపింగుకి వెళతారు కదా.

వాళ్లతో పాటు మనం కూడా వెళదాం. నేను

అమ్మమ్మని మాటల్లో పెడతాను. ఆ

సమయంలో నువ్వు అమ్మమ్మ బ్యాగులో

నుండి పదివేలు తియ్యు. బెట్టింగుకి వెళ్లాలి’’

అంది.
ముందు భయపడినా తనూజ ధైర్యం

చెప్పగానే సరే అన్నాడు తన్మయానంద్.
అనుకున్నట్లుగానే సాయంత్రం బట్టలు

కొనడానికి వెళ్లినప్పుడు డబ్బు తస్కరించి

తనూజకి ఇచ్చాడు.
ఫ్రెండ్ ఫోన్ చేసిందని చెప్పి తనూజ, ఆమె

వెనక తన్మయానంద్ బయటికి నడిచారు.

హడావుడిగా ఉండడంతో పెద్దవాళ్లు వాళ్లని

వారించలేదు.
ఇద్దరూ ప్రేమ్‌కుమార్‌ని కలుసుకున్నారు.

ముగ్గురూ బెట్టింగ్ జరిగే చోటుకు వెళ్లారు.
అక్కడంతా హడావుడిగా ఉంది. అంతా

జోరుగా బెట్ కాస్తున్నారు. ప్రేమ్‌కుమార్

తనూజ ఇచ్చిన పదివేలు తీసుకుని బెట్

కాశాడు.
ఆట టఫ్‌గా జరుగుతోంది. ఎవరు గెలుస్తారో

తెలియదు. నరాలు తెగే టెన్షన్ రాజుకుంది.
చివరికి తనూజ వాళ్లు ఓడిపోయారు.
దాంతో తనూజ, తన్మయానంద్ డీలా

పడిపోయారు.
‘‘డోంట్ వర్రీ తనూ. ఈసారి ఓడిపోతే తర్వాత

గెలుస్తాం. అంతలోకే ఇలా అయిపోతే ఎలా?’’

అంటూ వారించాడు ప్రేమ్‌కుమార్.
వాళ్లని ఇంటికి దగ్గరలో దింపాడు.
సాయంత్రం పదివేలు తీసినందుకు

భయపడుతూనే ఇంటికి వెళ్లారు తనూజ,

తన్మయానంద్.
అయితే హడావుడిలో చూసుకుని

ఉండలేదేమో ఇంట్లో ఎవరూ ఆ విషయం

గురించి మాట్లాడలేదు. ఆ రాత్రికి హాయిగా

నిద్రపోయారు తనూజ, తన్మయానంద్.
మర్నాడు ప్రేమ్‌కుమార్ తనూజని

పిలిచాడు. వెళ్లకుండా ఉండలేకపోయింది

తనూజ. వెళ్లాక హార్స్ రేసింగ్‌కి వెళదామని,

ఏభై వేలు అవుతుందని చెప్పాడు.
భయపడిపోయింది తనూజ. ఏభైవేలా?

అనుకుంది భయంగా.
అయితే ప్రేమ్‌కుమార్ ధైర్యం చెప్పాడు.
‘‘్ఫర్వాలేదు మనకి రేపటి దాకా టైం ఉంది.

ఎలాగోలా ఏభై వేలు సంపాదించు. నీలాంటి

డబ్బున్న అమ్మాయికి ఏభై వేలు పెద్ద లెక్క

కాదు’’ అన్నాడు.
నిజమే అనిపించింది ఆమెకి.
ఇంటికి వెళ్లాక తన్మయానంద్‌కి ఈ విషయం

చెప్పింది.
‘‘అమ్మో’’ అన్నాడు తన్మయానంద్.
‘‘్ఫర్వాలేదు. అమ్మమ్మ తల కింద బీరువా

తాళాలు పెట్టుకుని పడుకుంటుంది. మెల్లగా

తాళాలు సంపాదిస్తే సరి. బీరువాలో మనకి

కావలసిన డబ్బు తీసుకుని తాళాలు మళ్లీ

అమ్మమ్మ తల కింద పెట్టేద్దాం. సాయంత్రం

హార్స్ రేసింగ్‌కి వెళ్లొచ్చు’’ అంది.
తన్మయానంద్ అర్ధరాత్రి లేచి మెల్లగా

తాళాలు తీసుకొచ్చాడు.
ఇద్దరూ బీరువా తెరిచి ఏభై వేలు

తీసుకున్నారు. వెను దిరిగి చూసే సరికి

అక్కడ అమ్మమ్మ నిలబడి కోపంగా

చూస్తోంది.
తనూజ వెంటనే అమ్మమ్మని బలంగా

నెట్టేసింది. ఆ విసురుకి అమ్మమ్మ తల

మంచం కోడుకి కొట్టుకుంది. తనూజ ఆమెని

ఫ్లవర్‌వాజ్‌తో కొట్టి ‘‘దొంగ దొంగ’’ అని

అరిచింది.
ఇంట్లో అందరూ నిద్ర లేచారు.
కింద పడిపోయిన ఆమెని లేవనెత్తారు.
అప్పటికే అమ్మమ్మ ప్రాణం పోయింది.
‘‘ఏమైంది?’’ ప్రశ్నించాడు తనూజ తండ్రి.
‘‘దొంగ ఇంట్లో దూరాడు. నేను,

తన్మయానంద్ మేల్కొనేలోపే అక్కడికి

వచ్చిన అమ్మమ్మని ఫ్లవర్‌వాజ్‌తో కొట్టి

తోసేసి పారిపోయాడు. అమ్మమ్మ కింద

పడిపోయింది’’ అంది తనూజ.
ఎవరో పోలీసులకి ఫోన్ చేస్తున్నారు.
ఇంట్లో రణగొణ ధ్వనిగా ఉంది.
కాస్సేపటికి పోలీసులు వచ్చి అంతా

పరిశీలించారు.
తనూజ వణికిపోతున్న తన్మయానంద్‌నే

చూస్తోంది.
ఏ క్షణంలోనైనా అతను పోలీసులకి నిజం

చెప్పేసేలా ఉన్నాడు.
అతనికి ధైర్యం చెప్పాలి. లేకపోతే డేంజర్

అనుకుంది తనూజ.
అతని దగ్గరకి వెళ్లేలోగానే అతను వలవల

ఏడుస్తూ జరిగింది అంతా పోలీసులకి

చెప్పేశాడు.
అప్పటి వరకు తనూజ, తాను ఏమేం చేశారో

ఆ విషయాలు కూడా చెప్పేశాడు.
ఇంట్లో వాళ్లు షాక్‌కి గురయ్యారు అవన్నీ

విని.
తనూజ, తన్మయానంద్‌లని పోలీసులు

తీసుకుపోయారు.
కోర్టులో కేసు నడిచింది.
చెడు దారి పట్టిన తనూజకి పదేళ్లు జైలు శిక్ష

వేసింది కోర్టు. తన్మయానంద్‌ని నిర్ధోషిగా

విడిచి పెట్టింది.
తల్లిదండ్రులు, కళాశాలలు పిల్లల చదువుతో

పాటు వాళ్ల ప్రవర్తన, నడవడికపై కూడా దృష్టి

పెట్టాలని, లేకపోతే ఇలాంటి అనర్థాలే

జరుగుతాయని కోర్టు హెచ్చరించింది.
అందమైన జీవితంలోకి వెళ్లాల్సిన తనూజ

చీకటి నిండిన జైలు గోడల మధ్యకి నడిచింది.
ఈ ఘటన వల్ల తనూజ అక్క పెళ్లి

ఆగిపోయింది. ఆమె తల్లిదండ్రులు దు:ఖంతో

కుంగిపోయారు. వాళ్ల కుటుంబం గురించి

అంతా చెడుగా మాట్లాడుకోవడం

మొదలుపెట్టారు.
చేసేది మంచి పనో, చెడు పనో తెలిసినా

మంచి వైపు మొగ్గకుండా చెడు వైపే

ప్రయాణించడం ఎంతటి విపత్కరమో

ఇప్పుడు అర్ధమైన తనూజ జైలు ఊచల్లో

నుండి కమ్ముకొస్తున్న చీకటిలోకి ఆశగా

రేపటి ఆశాకిరణం వైపు చూస్తోంది.

- పుష్ప గుర్రాల, ఇస్మాయిల్‌కాలనీ, రాజ్యలక్ష్మి థియేటర్ దగ్గర, విజయనగరం-2. సెల్ : 9491762638.