నెల్లూరు

మార్పు (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతను
ఆకాశానికి
నిచ్చెనలేశాడు
అందనంత దూరానికి
ఆశల మెట్లతో ఎక్కేశాడు
అమ్మతనం ఆక్రోశిస్తున్నా
ఎత్తుకున్న భుజం యిదేమిటన్నా
చిట్టిచెల్లి చిన్నబుచ్చుకున్నా
ఊపిరిలాంటి
జన్మభూమిని వదలి
ఉట్టికెక్కాలని వురకలేశాడు
మనదేశం
మనకు వెగటువేసినా
పరాయివాడికి దేశభక్తి పెరిగి
వలసవెళ్లిన వాడి
‘‘వీసా’’ పీకేశాడు
పెంచుకున్న పేకమేడలు కూలి
కూలికెళ్లిన వాడు
కన్న నేలకు చేరాడు
అసహ్యించుకోబడ్డ అమ్మ
అక్కున చేర్చుకుంది
వదిలేసిన వూరే నీడనిచ్చింది
కాసుల మధ్య వూరేగిన మనిషి
మనసుల మధ్య కళ్లు తెరిచాడు
అహాన్ని విడిచి
ఆత్మీయులతో అల్లుకున్నాడు
అంటురోగాన్ని
వదిలించుకుని
ఆనందాన్ని పంచుకున్నాడు.
- శింగరాజు శ్రీనివాసరావు
చరవాణి : 9052048706

వి‘చిత్రం’

పువ్వులను చూచినప్పుడల్లా
నీ నవ్వులే కంటికి సాక్షాత్కరిస్తాయి
నన్ను నేను చూచుకోటానికి
అద్దమవసరంలేదు
నీ కంటి పాప చాలనిపిస్తుంది
నువ్వు శ్వాసిస్తుంటే
నా హృదయ స్పందన ఉరకలేస్తుంది
నే పిలుస్తున్నా నా మాటలు వినిపించవు నీకు
నేను పిలవాలన్నా నోరు పెగలదు నీకు
నీ శరీరాన్ని ఎంత తడిమినా నీ స్పర్శానుభూతి కల్గదు
అయినా నీవు నాకంటి ముందే ఉంటావు
నా చేతుల్లోకొస్తావు
నా హృదయానికి హత్తుకుంటాను
దృష్టి మరల్చలేక నినే్న చూస్తూ
ఈలోకానే్న మరచిపోతాను
ఇలానే లోకాన్ని నేవిడిచినా
నా చేతినుండి చితిలోకి..
నాతో రాలేవు నువ్వు
ఒకవేళ వచ్చి నాతో కాలి బూడిదైనా
నా ఆత్మలో అంతర్లీనం కాలేని
చిత్రమైన విచిత్రానివి... చిత్రానివి
నా ఊహల్లో మెదలి కుంచె కదలికతో రూపమై...
నా మదిలో ప్రేమామృతం నిండి
నను ఊహల్లో బ్రతికించిన ..
ఊహాసుందరివి.
నాదెండ్ల జ్వాలా ఉమామహేశ్వరశర్మ
అల్లూరు. చరవాణి : 9908101646

విషాద కృషీవలీయం

పెట్టిన పెట్టుబడి కొండంత
గిట్టుబాటు ధరేమో గోటి కొనంత
సాగుమీద చేసిన ఖర్చు
నాగుబాములా బుసకొడుతుంటే
అప్పులిచ్చినవారు ఎప్పుడు మీదపడతారోనని
అలికిడైతే చాలు గుండె ఉలికిపడుతుంటే
అన్నంపెట్టే రైతు గుండెకు
కన్నంవేసే కల్తీ విత్తనం
దిగులై నరాల్లో ప్రవహించే
దిగుబడి పెంచని నకిలీ ఎరువు
పడిన కష్టానికి నష్టమే ఫలితం కాగా
నమ్ముకున్న వ్యవసాయం నట్టేట ముంచేయగా
దేశానికి వెనె్నముకై మీసం మెలేసి బతికే
అన్నదాత ఆక్రందన
అరణ్యరోధనవౌతుంటే
రైతు పెట్టిన మెతుకులు తిని
ఆ రైతుకే సమాధి కట్టేస్తుంటే
అరకతో తప్ప ఇంకెవరితో చెప్పుకోగలడు
హలమే బలమనుకున్నవాడు
పొలంలోనే ఒరిగిపోతున్నాడు
మట్టే దైవమనుకున్నవాడు
మట్టిన కలిసిపోతున్నాడు
పట్టెడన్నం పెట్టేవాడు
పిడికెడు బూడిదగా మిగిలిపోతున్నాడు
చిరమన వెంకటరమణయ్య
చరవాణి- 9441380336

నేత్రదానం

చీకటికి వెలుగు అందము
వెలుగుకు చీకటితో బంధం
చీకటి వెలుగుల సంబంధం
ఇద్దరి మధ్యన నేనొక అనుబంధం
అందానికి అందము నేను
నుదిటిన వదిగిన నయనంను
సున్నితమైన చూపును నేను
కనుబొమ్మన దాగిన కాంతిని నేను
సాగే మనసుకు వారధి నేను
నడిచే నడకకు సారధి నేను
చీకటి ముసుగుల తెరలను నేను
చితికిన బతుకుల వెలుగును నేను
నయనానందకర నేత్రము నేను
సత్యనూతన కాంతిని నేను
మరణం లేని కిరణం నేను
ప్రతీ జీవికి బింబము నేను
దానగుణానికి రుణపడతాను
మీ మరణానంతరం మరో హృదయానికి వెలుగొతాను
అన్నిదానములకన్నా
నేత్రదానం మిన్న
- హస్తి మోహన్‌రాజు
చరవాణి : 8008511316

శుభోదయం (కవిత)

వానమ్మా..! నీ చిరునామా ఏదమ్మా!
పడమర గూడేస్తావు
పగలే చీకట్లు కమ్మిస్తావు
నల్లమబ్బుల తోరణాలు కట్టేస్తావు
మురిపించే మెరుపుల ఆకర్షణతో
నింపేస్తావు
ఫెళఫెళమనీ ఉరుముల
సందళ్లు చేసేస్తావు
కొట్టి కురిసే దానల్లే సరాగాలు వినిపిస్తావు..
దూరాన రుతుపవనాలను
మోసుకొస్తున్నావనే
ఆశలు మిణుకుమిణుకుమనిపిస్తావు
వాతావరణ సూచనలతో నీవు హుళక్కి
సమూహాల మేఘాలు రాక పుసక్కి
పుక్కిటపట్టి తొండాల వానలా
కురుస్తావనే ఆశ డుబుక్కే
వాగులు వంకలు గలగల పారుతాయనే ఆశ బుడుక్కే
మాయదారి ఓ వానమ్మా! ఏదమ్మా
నీ చిరునామా
కొండాకోనమ్మా నీతో చెలిమి చేసి
చెట్టూ చేమా నీతో కలిసి
చెట్టపట్టాలు వేసుకొంటూ
పల్లెలను, పట్టణాలను తడిపేస్తూ
ఎండిన మనసు(షు)లపై
ఆనందం నింపేస్తూ
వలసలు పోయే జీవితాలను ఆపేస్తూ
కరువుకాటకాలను పారదోలేస్తూ
త్వరత్వరగా వస్తావనుకొంటే
ఆలస్యమైనా రావేందుకు వానమ్మా..
పంట భూములు బీడులవుతున్నాయి
పచ్చని మానులు మోడులవుతున్నాయి
పశుగ్రాసము దొరక్క ప్రాణులు
అల్లాడుతున్నాయి
సాగునీరు లేక కాలువలు
వడలిపోయాయి
తాగునీరు లేక బావులు, చెరువులు, కుంటలు నోరెండిపోయాయి
పాలు పెరుగులు లేక కల్తీపాలు
అమ్ముడవుతున్నాయి
పశువులు మేపలేక కబేళాలకు
తరలుతున్నాయి
ఉపాధులు లేక ఊళ్లకు ఊళ్లు
వలసపక్షులౌతున్నాయి
పిల్లాజెల్లా ట్రంకుపెట్టెలై, పట్టణాలకి మోతగమారాయి
ఎగరలేని పక్షులు, గూడు వీడలేని
ముసలివాళ్లు
కన్నభూమిని దయనీయ స్థితిని కనలేక
అయినవాళ్లకు దూరంగా
గడుపుతున్నారు
వానమ్మా! నీ చిరునామా ఏదమ్మా..
మబ్బులు దిగిరావమ్మా!
హర్షంతో వర్షంగా భువికి దిగిరావమ్మా..
అలకలు మానమ్మా
అకాలమును తీర్చమ్మా
ఒక శుభవార్తగా గుండెల్లో నింపమ్మా..
పశ్చిమ ప్రకాశానికి
శుభోదయంగా నిలవమ్మా..!
- లక్కరాజు శ్రీనివాసరావు, చరవాణి : 9849166951