విజయవాడ

నా జీవన కావ్యనాయిక (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదు దశాబ్దాలకు ఆవల
రెండు పదుల నిండు యవ్వనంలో
నాచేయి పట్టుకొని
ఏడడుగులు నడిచిన దృశ్యం
నా కనుల ఎదుట నిరంతరం
సాక్షాత్కరిస్తూనే ఉంది
నేటికి ఏడు పదులు నిండినా
అంతరంగంలోని
ప్రేమానుభూతులు
చలన రహితమై చెక్కుచెదరలేదు
నువ్వు నాలో సగమై
అర్ధాంగిగా రూపుదాల్చిన తరువాత
భౌతికంగా, మానసికంగా
నాలో మార్పులొచ్చాయిగానీ
నువ్వు మాత్రం
స్థిరమైన చిత్తరువులా
కొండంత ఓర్పుని
హృదయంలో నింపుకొని
దుఃఖసముద్ర కెరటాలు
గుండెతీరాన్ని చేరకుండా
పంటి బిగువున ఆపుకొని
నా ఆగడాలను భరించావు!
ఆదర్శ స్ర్తిమూర్తిగా
అర్ధాంగి పదానికి అర్థమై నిలిచావు
మమతానురాగాలను
మరిచిన బిడ్డలు
రెక్కలొచ్చిన పక్షుల్లా
సుదూర తీరాలకు ఎగిరిపోయారు
ఒంటరితనం మృత్యువులా
వెంటాడుతున్న వేళ
ఈ శాపగ్రస్తుణ్ణి
ప్రేమతో లాలించావు
నీ పట్ల నా తప్పిదాలన్నిటినీ
అమ్మలా మన్నించి
అక్కున చేర్చుకున్నావు
సప్తపదికి అర్థమే తెలియని నువ్వు
ఏడడుగుల బంధానికి భాష్యమై
నా జీవన కావ్యనాయికవై
నా గుండెగుడిలో
దేవతవయ్యావు!
- విడదల సాంబశివరావు,
చిలకలూరిపేట, గుంటూరు జిల్లా.
చరవాణి : 9866400059

కనుదోయి

వేయి వేణువుల
మధుర గానము
నీ నామము
వేయి కనుల వెలిగే
ఉషస్సులా నీ రూపం
నా కనులు మూసి ఉన్నా
నా మది తలుపు తెరిచే ఉంచా
నా తలపులలోనే నిన్ను
కన్నులారా చూశా
నీవు నా ఎదుటే
ఉన్నావని ఊహించా
నిను మెప్పించాలని తపించా!
నీ వేణువు నేనందుకొని
నా తలపులలో
నిన్ను ఉంచుకొని
అందమనే బంధంతో
నిను బంధించాలని ఉన్నా
గానమనే సుమగంధాన్ని
మన బంధానికి అద్దాలని
అనంతమైన మన ప్రణయ
సాగరాన్ని మధించి
అందమైన గానాన్ని
నీకు అందించాలని నా ఆశ
నా ఆశ ఫలించి
మన అనురాగం చిగురించి
నా కనుల ఎదుటకు రావా..
ప్రియా.. ఓ ప్రియా?!
- ఎంఎన్ మల్లీశ్వరి, విజయవాడ.

నేను - నువ్వు

నిశిరాతిరి నేను
కనురెప్పల పరదాలు దాటి
నన్ను వీడిన నిదురమ్మ
పసిపాపల కన్నులకు
పానుపు పరిచిన వేళ
ఒకకొకటిగా కురుస్తున్న
ఆలోచనల చినుకులు
కొన్ని చెమ్మగా.. కొన్ని చురుకుగా
కొన్ని అందంగా..
కొన్ని అమాయకంగా
అంతలో పచ్చికను తడిపేస్తూ
కొమ్మల ఊయలలూగుతూ
మిట్టపల్లాల ఈలలు వేస్తూ
అమాంతం ఆవరించిన చల్లగాలి
ఆలోచనల కట్టలు తెంచుకొని
కళ్ల వృత్తాలు దాటి
చెమ్మగిల్లిన చెంపలు
బయట హోరువాన
మేనంతా హాయి గిలిగింతలు
రేపుతున్న తరుణాన
హఠాత్తుగా మెరిసిన ‘మెరుపు’
నీ రూపు
మనసు పుస్తకాన్ని తెరిచి
ఊహల లేఖిని అందుకొని
కవితాక్షరాలు లిఖించనారంభించా
ఉసిగొలిపే ఊసులతో
ముప్పిరిగొనే శ్వాసలతో
తనువంతా పరవశింపజేస్తూ
నా అక్షరాలకు వీణతంత్రులపై
రాగాలు కడుతూ నువ్వు!
- కె దేవికారత్నాకర్,
తెనాలి, గుంటూరు జిల్లా.
చరవాణి : 9908706218

బతుకు గీతం ఉత్సవ సంగీతం

నీలాకాశం వాకిట్లో
చెల్లాచెదురుగా
పడివున్న నక్షత్రాలు
వెనె్నల బింబం వర్షం
వెలుగుపూల వెనె్నలైన నవ్వులు
నిరంతరం అంబుధిలో
ఎగసిపడే
అలల అడుగులు
తన ముఖప్రతి భూమికను
పదిలపర్చుకుంటూ
విరిగిన కెరటాల్లో
ఒక కొత్త ఇంద్రధనువు
అద్భుత దృశ్య ఆవిష్కరణం
నేల నిండి వెనె్నలయ్యా
వెండిగినె్నల్లో
పెరుగుబువ్వు తినిపిస్తున్నాడు
శిశువులకు
ఈ సమయం మల్లెలై విరబూసి
అమోఘ పరీమళంలా
పరివ్యాప్తమై
నవ్వుల వెనె్నలరేడు
రాత్రికి సరిజోడు
చల్లని చూపుల వెండిజాబిల్లి
ఎవరికి వారు నిద్రకు
ఉపక్రమించిన వేళ
నిశిలో నిద్ర ఒడిలో
తియ్యకలల రాశుల్లో
కలలశయ్యపై
పొర్లుతూనే ఉన్నాడు
నింగి నిండా
మేఘమాలలు
అల్లుకున్న నీలిమలో
మనిషి నిత్య మానవీయ
వసంతం కోసం
శ్రమ వృత్తాకారంలోకి..
బతుకు గీతంగా
ఉత్సవ సంగీతం
ప్రతిధ్వనిస్తున్నాడు
ప్రోత్సాహ విజయకేతనమై!
- అంజనాశ్రీ, ఖమ్మం. చరవాణి : 7705374539