విజయవాడ

నక్క ఆకలి (చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక అడవిలో ఒక నక్క ఉండేది. తనకు

ఆకలిగా ఉండటంతో అడవి అంతా

తిరగసాగింది. ఎక్కడా తనకు ఆహారం

దొరకలేదు. అలసిపోయి ఒక చెట్టు దగ్గర

కూర్చొని ఆలోచిస్తూ ఉండేది తన ఆకలి

బాధ ఎలా తీర్చుకోవాలి? అని. అప్పుడే నక్క

ఉన్న దగ్గరలో ఒక ఏనుగు చచ్చి పడి

ఉంటుంది. నక్కకు చాలా సంతోషం వేసి

అక్కడికి వెళ్తుంది. తన పళ్లతో ఏనుగు

మృతకళేబరాన్ని కొరుకుతుంది. కానీ

ఏనుగు చర్మం గట్టిగా, మందంగా ఉండటంతో

తినడానికి వీలు కుదరక ఇబ్బంది

పడుతుంది. అదే సమయంలో అటువైపుగా

ఒక సింహం రావటం గమనించి దానికి

ఎదురుగా వెళుతుంది. ‘స్వాగతం

మృగరాజా..! ఇందాకే ఏనుగును పులి

వేటాడింది. నువ్వు రావడం గమనించి

పారిపోయింది. నీకోసమే నేను కాపలా

కాస్తున్నా. ఈ ఏనుగును ఆహారంగా

స్వీకరించు’ అంటుంది. సింహం తాపీగా విని

‘లేదు నక్కా! నేను వేరొకరు వేటాడినదాన్ని

తినను’ అని చెప్పి వెళ్లిపోతుంది.

‘హమ్మయ్య! సింహం బారి నుండి

తప్పించుకున్నా. కానీ నా ఆకలి తీరేది

ఎలా?’ అని ఆలోచిస్తూ నక్క అక్కడే

కూర్చుండిపోతుంది. అప్పుడే అటువైపుగా

ఒక పులి వస్తుంది. ఇది గమనించిన నక్క

పులితో ‘ఇటు రావద్దు. ఎందుకంటే, ఇప్పుడే

ఈ ఏనుగును సింహరాజు వేటాడింది.

స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్లింది. నిన్ను

చూస్తే చంపేస్తుంది’ అని చెపుతుంది. దీనికి

భయపడిన పులి అక్కడి నుండి

వెళ్లిపోతుంది. మళ్లీ తప్పించుకున్న నక్క

ఆకలి తీవ్రం కావటంతో ఏమిచేయాలో

తెలియని అయోమయ స్థితికి చేరుతుంది.
కొద్దిగా దూరంలో ఒక చిరుత నిద్రిస్తూ

ఉండటం గమనించి దాని దగ్గరకు

వెళుతుంది. ‘నా పేరు నక్క. నేను

సింహరాజు దగ్గర పనిచేస్తున్నా. ఇందాకే

రాజుగారు స్నానానికి వెళ్లారు’ అని చెప్పి

‘ఏమైంది నీకు? ఎందుకు పడుకొని

ఉన్నావు? భోజనం చేశావా?’ అని

అడుగుతుంది. ‘లేదు నక్కా! నాకు వేటాడే

శక్తిలేదు. కానీ ఆకలిగా ఉంది. ఏమిచేయాలో

తెలియక పడుకున్నా’ అని చిరుత

బదులిస్తుంది. వెంటనే నక్క స్పందిస్తూ

‘అయితే నీకు ఒక ఉపాయం చెప్తాను.

అలాచేస్తే నీకు ఆహారం దొరుకుతుంది’ అని

ఊరిస్తుంది. ‘సరే.. చెప్పు’ అని అడుగుతుంది

చిరుత. ‘ఇందాకే సింహరాజు ఒక ఏనుగును

వేటాడి స్నానం చేయడానికి వెళ్లింది. కాస్త

దూరంలో ఏనుగు పీనుగు పడి వుంది.

నువ్వు వచ్చి తినవచ్చు’ అని చెపుతుంది

నక్క. ‘సింహానికి తెలిస్తే నన్ను చంపుతుంది

కదా!’ అని సందేహిస్తుంది చిరుత. ‘ఏమీ

ఫర్వాలేదు. సింహరాజు వస్తే నేను కేక

వేస్తాను. నువ్వు పారిపో!’ అంటూ ఐడియా

ఇస్తుంది. ‘సరే’.. అంటూ చిరుత

ముందుకొస్తుంది. తన పదునైన పళ్లతో

ఏనుగు మృతకళేబరాన్ని కొరికి కాస్త

తినగానే ‘త్వరగా కొద్దిగా తీసుకొని వెళ్లిపో.

లేదంటే సింహరాజు వస్తాడు’ అని

బెదిరిస్తుంది నక్క. సరేనంటూ చిరుత కాస్త

మాంసం తీసుకొని వెళ్లిపోతుంది. చిరుత

వెళ్లిన వెంటనే జిత్తులమారి నక్క ప్రయాస

లేకుండా హాయిగా తన కడుపు

నింపుకుంటుంది.
నీతి: ఎంతటి సమస్య వచ్చినా మనం

తెలివితో ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుది.

- జాని తక్కెడశిల, బెంగళూరు, చరవాణి : 9491977190