కృష్ణ

చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 22: పెరుగుతున్న కేసులు, మారుతున్న చట్టాలకు అనుగుణంగా అవగాహన పెంచుకోవాలని న్యాయశాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో పని చేస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఏపిపిలు, పోలీసు అధికారులకు కలిపి శనివారం హనుమాన్‌పేటలో సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావు సమావేశానికి అధ్యక్షత వహించగా కొల్లు రవీంద్ర ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఏపిపిలు, పోలీసులనుద్ధేశించి మంత్రి మాట్లాడుతూ త్వరితగతిన కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. తద్వారా నిందితులకు కఠిన శిక్షలు పడేలా ఇదే సమయంలో బాధితులకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లపై ఉందన్నారు. పోలీసులు, ప్రాసిక్యూటర్లు సమన్వయంతో వ్యవహరిస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. టెక్నాలిజీని ఉపయోగించి చేసే నేరాలను ఏవిధంగా అరికట్టాలి, నిందితులకు శిక్షలు పడేందుకు ఏలాంటి సాక్ష్యాలు సేకరించాలి అనే అంశంపై పోలీసులు, ప్రాసిక్యూటర్లు ఉమ్మడిగా పని చేయాలన్నారు. పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ చట్టాల్లో అనేక మార్పులు వస్తున్నాయన్నారు. కొత్త చట్టాల గూర్చి పోలీసులు, ప్రాసిక్యూటర్లు అవగాహన పెంచుకోవాలన్నారు. జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావు ప్రతి నెలా జిల్లాల్లోని ఏపిపిలు, పోలీసు అధికారులతో నిర్వహించే ఇలాంటి సమావేశాలు మంచి పరిణామమన్నారు. నేడు వైట్ కాలర్ నేరాలు, సైబర్ క్రైంలు, సాంకేతిక నేరాలు ఎక్కువవుతున్నాయన్నారు. ఈ నేరాలను గుర్తించే విధంగా పోలీసులకు తర్ఫీదు అవసరమన్నారు. అనంతరం మంత్రిని ఘనంగా సత్కరించారు. ఈఎస్‌ఎఫ్ ల్యాబ్స్‌కు చెందిన ఎ అనిల్, ఎ అంజిబాబు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఏవిధంగా సేకరించాలి అనే అంశంపై విశదీకరించారు. కార్యక్రమంలో జాయింట్ సీపి రమణకుమార్, డిసిపిలు కాంతి రానాటాటా, గజరావు భూపాల్, ఏపిపిలు, ఏసిపిలు సిఐలు తదితరులు పాల్గొన్నారు.