కృష్ణ

వనం-మనంలో అందరూ భాగస్వాములవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జూలై 22: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న వనం-మనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన స్థానిక లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో మొక్కలు నాటిన అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ పది మొక్కల చొప్పున నాటి వాటిని పరిరక్షించటం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. అదేవిధంగా అడవులను అందరూ పరిరక్షించాలన్నారు. అటవీ శాఖాధికారుల వద్ద అవసరమైన మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, స్వచ్చంద సంస్థలు ఈమొక్కలు తీసుకుని నాటి వాటిని సంరక్షించుకోవాలన్నారు. జిల్లాలో అన్ని డివిజన్లలో నర్సరీలలో మొక్కలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వివిధ అభివృద్ధి పథకాల కింద మైలవరం నియోజకవర్గంలో 1.86 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. వనం-మనం కార్యక్రమంలో ముఖ్యమంత్రితోపాటు అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు భాగస్వాములయ్యారన్నారు. చెట్లు నాటటం ద్వారా ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగే రాజధాని నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.
వచ్చేనెలలోనే చింతలపూడి పనులు
పశ్చిమ కృష్ణాతోపాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొంత భాగాన్ని సస్యశ్యామలం చేయటానికి ఉద్దేశించిన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు వచ్చే నెలలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి ఉమ వెల్లడించారు. ఈపథకం నిర్మాణానికి ముఖ్యమంత్రి నాలుగువేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. ఈపథకం పనుల ప్రారంభం నుండి ఏడాదిలోగానే గోదావరి జలాలను నాగార్జున సాగర్ కాలువలలో నీటిని పారిస్తానని ప్రకటించారు. ఈపథకం ద్వారా దాదాపు ఏడు నియోజవర్గాలలో ఏడు లక్షల ఎకరాల ఆయకట్టు సాగుకు అందుతుందని వెల్లడించారు. అంతేగాక 450 గ్రామాలలోని 21 లక్షల మందికి తాగునీటిని అందించినట్లు అవుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు మంత్రి ఉమ మొక్కలను పంపిణీ చేశారు. అదేవిధంగా విద్యార్థుల సేవలో రెవెన్యూ శాఖ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవసరమైన కుల ధృవీకరణ పత్రాలను మంత్రి ఉమ విద్యార్థులకు అందించారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ కెవి శివయ్య, ఎంపిడిఓ వై హరిహరనాధ్, నూజివీడు డీఎస్పీ శ్రీనివాస్, అటవీ శాఖ సిబ్బంది, ఎంపిపి లక్ష్మి, స్కూల్ ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థినీ, విద్యార్థులచే నిర్వహించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు, గీతాలు అలరించాయి.