హైదరాబాద్

అనే్వషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: మహానగరంలో చినుకుపడితే చాలు రోడ్లన్నీ గుంతలమయమవుతున్నాయి. అసలు రోడ్డు నిర్మించే సమయంలోనే ప్రమాణాలు పాటించకపోవటమే ఇందుకు కారణమన్న విషయాన్ని గుర్తించిన అధికారులు వర్షానికి గుంతలమయమైన రోడ్లతో కనీసం వాహనదారుల ఇబ్బందును దూరం చేసేందుకు మరమ్మతులైనా శాస్ర్తియంగా చేయాలన్న విషయంపై దృష్టి సారించారు. వర్షాకాలం జిహెచ్‌ఎంసికి వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం రోడ్లకు సంబంధించినవే ఉండటంతో ఈ పరిస్థితిని అధిగమించేందుకు రోడ్ల మరమ్మతులకు శాశ్వత పరిష్కారానికే అనే్వషించేందుకు జిహెచ్‌ఎంసి ఇంజనీర్లు సిద్దమయ్యారు. ప్రస్తుతం ధ్వంసమైన రోడ్ల మరమ్మతులకు సంబంధించి పురపాలక శాఖ మంత్రి నుంచి ప్రత్యేక ఆదేశాలుండటం, ప్రజల నుంచి ఎక్కువ ఫిర్యాదులు రావటం, ఇటీవల కురిసిన వర్షాలతో నగరంలోని వివిభధ ప్రాంతాల్లో రెండు వేల వరకు గుంతలు పడినట్లు అధికారులు గుర్తించినా, క్షేత్ర స్థాయిలో అంతకు రెండింతల వరకు గుంతలున్నాయి. మరికొన్ని చోట్ల రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ముందు కూడా గుంతలను పూడ్చే విషయంపై ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయటంతో పాటు రోడ్ల నిర్వహణను ప్రత్యేకంగా సమీక్షించేందుకు చీఫ్ ఇంజనీర్‌ను కూడా కేటాయించారు. ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చే విషయమై ప్రతి ఇంజనీర్ రోడ్డుపై కనీసం మూడు గంటలైనా విధులు నిర్వహిస్తూ, ఇచ్చిన టార్గెట్ ప్రకారం రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని చీఫ్ ఇంజనీర్ జియావుద్దిన్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఇంజనీర్లు రోడ్ల మరమ్మతుల పనులను మరింత వేగవంతంగా చేపట్టేందుకు వీలుగా టెండర్ల ప్రక్రియకున్న నిబంధనలను కూడా సర్కారు మినహాయించిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం టెండర్లు ఖరారు చేసే పనిలో ఉన్న అధికారులు కాంట్రాక్టర్లకు పనులను అప్పగించిన తర్వాత క్షేత్ర స్థాయిలో మరమ్మతుల పనులను తనిఖీ చేయాలని భావిస్తున్నారు. గుంతలను పూడ్చటం, కొట్టుకుపోయిన రోడ్లకు చేపట్టిన మరమ్మతులను తనిఖీ చేసి, లోపాలుంటే సంబంధిత ఇంజనీర్, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. తొలి సారిగా మొదటి తప్పిదంగా భావించి ఇంజనీర్లపై క్రమశిక్షణా చర్యలు, కాంట్రాక్టర్‌కు జరిమానా విధించాలని భావిస్తున్నారు. ఇదే లోపం మళ్లీ పునరావృత్తమైతే సదరు కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టడటంతో పాటు ఇంజనీర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చీఫ్ ఇంజనీర్ భావిస్తున్నారు.
రేపు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
హైదరాబాద్, జూలై 22: కృష్ణాతాగునీటి ప్రాజెక్టు మొదటి దశలోని యాచారం గ్రామం వద్ద వాల్వ్‌ల షిఫ్టింగ్ పనుల సందర్భంగా పనె్నండు గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేయటంతో ఈ నెల 24వ తేదీన సోమవారం పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఉండబోదని, పలు ప్రాంతాల్లో సరఫరా తక్కువగా జరగవచ్చునని జలమండలి అధికారులు శనివారం తెలిపారు. వైశాలినగర్, దిల్‌సుఖ్‌నగర్, మీరాలం, మిస్రీగంజ్, ఫలక్‌నుమా, సంతోష్‌నగర్, మాదన్నపేట, అలియాబాద్, ఆస్మాన్‌ఘడ్, మూసారాంబాగ్, మలక్‌పేట, చంచల్‌గూడ, సైదాబాద్, బొగ్గులకుంట, నారాయణగూడ, చిలకలగూడ, అడిక్‌మెట్, శివం ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఉండకపోవచ్చునని, వీటిలోని కొన్ని ప్రాంతాల్లో సరఫరా తక్కువగా జరగవచ్చునని తెలిపారు.
చెరువులను కాపాడండి
ఉప్పల్, జూలై 22: రామంతాపూర్ పట్ణంలోని చెరువులను రక్షించాలని డిమాండ్ చేస్తూ శనివారం స్వచ్ఛంద సంస్థలు ర్యాలీ నిర్వహించారు.
దూరదర్శన్ కేంద్రం నుంచి ప్రారంభమైన ర్యాలీని గంగపుత్ర సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ధీటి మల్లయ్య జెండా ఊపి ప్రారంభించారు. పెద్దచెరువు మధుర బార్ వరకు నిర్వహించిన ర్యాలీలో ప్రేరణ సంస్థ అధ్యక్షుడు ఇంజనీర్ గిరి, అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, బాబూరావు, వన్ వరల్డ్ అధ్యక్షుడు లక్ష్మణ్, సేవ్ లేక్ అధ్యక్షుడు రాకేష్, నార్సి నర్మదా అధ్యక్షులు నర్మద, క్లీన్ అండ్ గ్రీన్ బచావో అధ్యక్షులు అనసూయ, హెల్ప్ గోగ్రీన్ అధ్యక్షులు బాబూజాన్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యదర్శి గణేషన్, లయన్స్ క్లబ్ కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఇసిఇ కార్యదర్శి బాబూరావు, సాయిచిత్రనగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రఘరామ్, గంగపుత్ర సంఘం కార్యదర్శి పూస సత్యం, మోహన్ కృష్ణా, భాస్కర్‌రావు, రాజేందర్, మధుసూదన్, ఎర్వ బాల్‌రాజ్, సౌల్ల శ్రీనివాస్, గంగాధర్, శంకర్ పాల్గొని ప్రసంగించారు. నీటి జలాలు పెంచే చెరువులు అధికారుల నిర్లక్ష్యంతో కబ్జాలకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మల్లాపూర్‌లో యువతి కిడ్నాప్
నాచారం, జూలై 22: సొంత బావ.. మరదలిని కిడ్నాప్ చేసిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రామయ్య కథనం ప్రకారం.. మల్లాపూర్ జనప్రియ ఆపార్టుమెంట్ బ్లాక్- 1, ప్లాట్ నెంబర్ 204లో శంకర్ కుటుంబం నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. అదే అపార్టుమెంట్ బ్లాక్-5 ప్లాట్ 125లో నివాసం ఉంటున్న అమర్ మొదటి కూతురు భర్త కావడం విశేషం. ఈమధ్య కాలంలో మామ శంకర్‌తో తీవ్ర స్థాయలో గొడవలు జరుగుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం మూడు గంటల సమయంలో మామ శంకర్ ఇంట్లోలోకి వచ్చిన అమర్ సొంత మరదలు మనిషా (19) కారు నెంబర్ టిఎస్ 08ఇఇ 9742లో బలవంతంగా కిడ్నాప్ చేసిన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టుతున్నట్లు సిఐ విఠల్‌రెడ్డి తెలిపారు.
ఉద్రిక్తత నడుమ టవర్ తొలగింపు
బాలానగర్, జూలై 22: కూకట్‌పల్లి సర్కిల్ బాలానగర్ డివిజన్ పరిధిలోని రాజుల కాలనీలో అనుమతి లేని అక్రమ కట్టడంపై ఎటిసి టెలికాం సంస్థ ఏర్పాటుచేసిన టవర్‌ను తొలగించడంలో బస్తీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీస్ బందోబస్తు మధ్య టవర్‌ను తొలగించే ప్రయత్నంలో భవన యజమాన్ని అడ్డుకోబోయారు. ఈ క్రమంలో టిపిసిసి కార్యదర్శి నోముల సుదీప్ పటేల్, బస్తీవాసుల పక్షన నిలిచి టవర్‌ను తొలగించేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో శనివారం జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆదేశాల మేరకు టవర్‌ను తొలగించాలని టౌన్ ప్లానింగ్ ఎసిపి గజానంద్, టిపిఎస్ శ్రీహరి, బాలానగర్ పోలీస్ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని టవర్‌ను తొలగించే ప్రయత్నంలో విద్యుత్ నిలువ ఉండడంతో (బ్యాటరీ) తొలగింపునకు అడ్డంకిగా మారడంతో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేసి సీజ్ చేశారు.