హైదరాబాద్

విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జూలై 22:ఉద్యాన విస్తరణ అధికారుల పోస్టులను భర్తీ చేపట్టాలంటూ శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు చేపట్టిన ఆందోళన 20 వ రోజుకు చేరింది. శనివారం వర్సిటిని చుట్టుముట్టి విద్యార్థులను బెదిరించడంతో వర్సిటిలోని హాస్టల్ భవనానికి తాళాలు వేసుకొని భవనంపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని భీష్మించుకొని కూర్చొన్నారు. ఆందోళన రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తుండడంతో అధికారులు విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేసి వెళ్లాలని, మెస్‌ను బంద్ చేశారు. సెలవులు ప్రకటించారు. విశ్వవిద్యాలయంలో వంటావార్పు చేసుకొని అక్కడే భోజనాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేయించాలని పోలీసులకు సూచనలు ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆందోళనను విరమించాలని విద్యార్థులతో వాగ్వాదానికి దిగారు. విద్యార్థులు ససేమిరా అంటూ హాస్టల్ భవనాన్ని ఖాళీ చేసేది లేదని తేల్చి చెప్పడంతో ఆందోళన మరింత ఉద్రిక్తంగా మారింది. ఏ క్షణమైన పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. పోలీసులు, అధికారులు హాస్టల్ భవనాన్ని విడిచి వెళ్లకపోతే భవనం పై నుంచి దూకుతామని బెదిరించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ.. ఉద్యాన వర్సిటి ఏర్పడి 20 సంవత్సరాలు అవుతున్నా నేటికీ ఉద్యోగాలు భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఉద్యాన విస్తరణ ఖాళీలను భర్తీ చేయాలంటూ సామరస్యంగా ఆందోళన చేస్తుంటే దౌర్జన్యంగా పోలీసులతో అరెస్ట్ చేయించి బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు మండిపడ్డారు. ఉద్యమాన్ని మాత్రం ఆపేది లేదని విద్యార్థులు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి వచ్చి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు ప్రశాంత్, ప్రకాష్, జీవన్ జ్యోతి, తేజస్విని, అనిత ఉన్నారు.