హైదరాబాద్

ఉద్యమంలా హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, జూలై 22: ప్రజలందరూ భాగస్వాములై హరితహారం కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లి విజయవంతం చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండల పరిధి నారపల్లి, చౌదరిగూడ, కొర్రెముల గ్రామాలలో మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డిలతో కలిసి తెలంగాణకు హరితహారం కింద శనివారం పంచాయతీ రాజ్ రోడ్లకు ఇరువైపులా మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కొర్రెముల గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛ తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరు హరితహారం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఏ కార్యక్రమం విజయవంతం కావాలన్నా వంద శాతం ప్రజల సహకారం అవసరమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కూడ ప్రజల సహకారంతోనే లభించిందని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థులు హరితహారం కార్యక్రమంలో విస్కృతంగా పాల్గొని మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వం చెట్టు-పట్టా అనే పథకం ద్వారా ప్రభుత్వ స్థలాలలో నాటిన చెట్లను పేదలకు పట్టా రూపంలో ఇవ్వాలన్న ఆలోచనలో ఉందని, దీని ద్వారా ఆ చెట్లపై వచ్చే ఆదాయం వారికి అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. హరితహారం కార్యక్రమంపై ప్రతి మండలంలో ప్రత్యేకంగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించి గ్రామాల్లో మొక్కలు నాటేలా ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని మంత్రి అన్నారు. రైతుల పొలాలలో మొక్కలు నాటితే వాటి సంరక్షణకు గాను ప్రతి మొక్కకు నెలకు అయిదు రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. తమ స్వంత పోలంలో 400 మొక్కలు నాటిన రైతుకు ప్రతి నెల రూ.2వేల ఆదాయం వస్తుందని మంత్రి అన్నారు. విఓఏలకు ప్రతి నెల రూ.3వేల జీతం అందించనున్నామని దీనికి సంబంధించి నాలుగెదు రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై అయిదు నుండి 10 మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించేందకు స్థానిక ప్రజాప్రతినిధులు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే మిషన్ భగిరధ, మిషన్ కాకతీయ పథకాలు కూడా ముందుకు వెళతాయని చెప్పారు. జిల్లాకు ఉపాధిహామీ పథకం కింద ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలని అదే విధంగా స్థానిక సంస్థల బలోపేతానికి కూడ నిధులు కేటాయించాలని మంత్రిని కోరారు. జిల్లా కలెక్టర్ యం.వి.రెడ్డి మాట్లాడుతూ 33 శాతం అడవులు ఉండాల్సిన జిల్లాలో కేవలం 14 శాతం మాత్రమే ఉన్నాయని, వృక్ష సంపదను పెంపొందించేందుకు గాను హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా మండల మహిళా సంఘాలకు రూ.2.15 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్ ఎంపిపి బండారి శ్రీనివాస్‌గౌడ్, జిల్లా అటవి శాఖ అధికారి కృష్ణ, డీఆర్‌డీఓ కౌటిల్య, కీసర ఆర్‌డీఓ హనుమంత్‌రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ సీతారాములు, ఎంపిడిఓ కల్వకుంట్ల శోభ, తహసిల్ధార్ రాజేశ్వర్‌రెడ్డి, వైస్ ఎంపిపి గ్యార లక్ష్మయ్య, సహకార సంఘం చైర్మన్ గొంగళ్ల స్వామికుర్మ, డైరక్టర్లు బొక్క ప్రభాకర్‌రెడ్డి, కొంతం అంజిరెడ్డి, రాష్ట్ర విత్తన ద్రువీకరణ అఫ్పిలేట్ అధారిటీ కమిటీ డైరక్టర్ రేసు లక్ష్మారెడ్డి, కీసరగుట్ట ఆలయ కమిటీ డైరక్టర్ తరిణే మహింద్రాచారి, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు బైనగారి నాగరాజు, నారపల్లి సర్పంచ్ శేషారావుజాదవ్, చౌదరిగూడ సర్పంచ్ నక్క వరలక్ష్మి, టిఆర్‌ఎస్ జిల్లా నాయకుడు మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు బోయపల్లి కొండల్‌రెడ్డి, మాజి అధ్యక్షుడు దర్గ దయాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు బైరు రాములుగౌడ్, ప్రధానకార్యదర్శి కందుల కుమార్ పాల్గొన్నారు.