తెలంగాణ

సినీ పరిశ్రమనే టార్గెట్ చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: మాదకద్రవ్యాల వ్యవహారంలో సిట్ అధికారులు సినీ పరిశ్రమను టార్గెట్ చేస్తున్నారని దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో పేర్కొనడంపై దుమారం లేపింది. రాంగోపాల్ వర్మపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తీవ్రంగా స్పందించారు. పూరీ, సుబ్బరాజు, శ్యాం కె నాయుడు రాంగోపాల్ వర్మ శిష్యులని, వారిని కాపాడుకునేందుకు వర్మ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు సిట్ భావిస్తోంది. డ్రగ్స్ వ్యవహారంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్స్‌పై దుమారం లేపుతోంది. డ్రగ్స్ వ్యవహారంలో విచారణ నియమ నిబంధనలకు లోబడి కొనసాగుతుందని, ఎవరినీ టార్గెట్ చేయలేదని తెలంగాణ ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆర్‌వి చంద్రవదన్ స్పష్టం చేశారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, డ్రగ్స్ వ్యవహారంలో ఆబ్కారీ శాఖకు ఏ రంగం పట్లా ద్వేషం లేదని తెలిపారు. సినీ రంగాన్ని లక్ష్యంగా చేసుకుని విచారణ సాగుతోందని వస్తున్న వార్తలను ఆయన తప్పుబట్టారు.
కొందరు ట్విట్టర్ల ద్వారా విచారణను వక్రీకరించడం తగదని పేర్కొన్నారు. అధికారుల ఆత్మస్థయిర్యం దెబ్బతినేలా ఎవరూ వ్యవహరించొద్దని ఆయన సూచించారు. పిల్లలను కూడా ఇలాగే ప్రశ్నిస్తారనడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్టు కమిషనర్ చెప్పారు. నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు విచారణకు సహకరిస్తున్నారని తెలిపారు.
డ్రగ్స్ వ్యవహారంపై రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలను ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించింది. రాంగోపాల్ వర్మ మతిభ్రమించి వ్యాఖ్యలు చేస్తున్నారని ఉద్యోగుల సంఘం ఆరోపించింది. రాంగోపాల్ వర్మ తన శిష్యులను కాపాడుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మహబూబ్ అలీ ఆరోపించారు. రాంగోపాల్‌వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

చిత్రాలు.. దర్శకుడు రాంగోపాల్ వర్మ *తెలంగాణ ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆర్‌వి చంద్రవదన్