తెలంగాణ

ఎస్సార్‌డిపికి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: హైదరాబాద్‌లోని కాసుబ్రహ్మానందరెడ్డి (కెబిఆర్) పార్కు చుట్టూ నిర్మించ తలపెట్టిన ‘వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రాజెక్టు’ (స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు) కు రాష్ట్ర వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్ర అటవీ మంత్రి జోగురామన్న అధ్యక్షతన శనివారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని గతంలోనే చేపడితే, కెబిఆర్ పార్క్‌కు కీడుకలుగుతుందని కొంత మంది ఎన్‌జిఓలు, వ్యక్తులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. దాంతో కెబిర్ పార్క్ చుట్టూ ఆరు మల్లీలెవల్ ఫ్లైఓవర్లను నిర్మిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని కేంద్ర వన్యప్రాణి మండలి త్వరలోనే ఇందుకు అనుమతిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

చిత్రం.. శనివారం హైదరాబాద్‌లో జరిగిన వన్యప్రాణి మండలి సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జోగురామన్న